EPAPER

Gundeninda GudiGantalu Today Episode : రవిని రప్పించేందుకు మీనా ప్రయత్నాలు.. పోలీస్ స్టేషన్ కు రవి వస్తాడా?

Gundeninda GudiGantalu Today Episode : రవిని రప్పించేందుకు మీనా ప్రయత్నాలు.. పోలీస్ స్టేషన్ కు రవి వస్తాడా?

Gundeninda GudiGantalu Today Episode 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. రవి, శృతిలు పెళ్లి తర్వాత తన ఫ్రెండ్ ఫామ్ హౌస్ కి వెళ్తారు. అక్కడ తన ఫ్రెండ్ వాళ్ల కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది. మేమిద్దరం ఒక రెండు మూడు రోజులు ఉంటామే అనేసి శృతి తన ఫ్రెండ్ తో అంటుంది. రెండు, మూడు రోజులు కాదు మీరు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండండి అనేసి తన ఫ్రెండు శృతి తో చెబుతుంది. ఇంట్లో వాళ్లు తన గురించి ఏమనుకుంటారు అని బాధపడుతుంటాడు. ప్రేమను గెలిపించుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఇప్పటికైనా సంతోషంగా ఉందామని శృతి రవితో అంటుంది. ఇక వదిన గురించి ఏమంటారో అని బాధపడతాడు. ఆ రవిని తీసుకొచ్చి ఇక్కడ అప్పజెప్పితే మీ నాన్నని తీసుకెళ్లొచ్చు అనేసి ఎస్ఐ చెప్తాడు. ఆయనకు కావలసిన ఫుడ్ మెడిసిన్ ఇవ్వండి అని అంటాడు.. ఇక మీనా అక్కడికి వస్తుంది ప్రభావతి చూసి దారుణంగా తిడుతుంది. దాంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.


ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు రాజేష్ తో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. వాడు ఎక్కడున్నా అసలు వదలకుండా చూసి తీసుకురండి ఒకవేళ దొరికితే వెంటనే నాలుగు తగిలించి పోలీస్ స్టేషన్ కి తీసుకురండి అనేసి బాలు రాజేష్ తో మాట్లాడుతాడు. సత్యం కు ఏదైనా టిఫిన్ తీసుకొచ్చి పెడదామని బాలు బయటికి వెళ్తాడు. బయటినుంచి బాలు సత్యం కోసం టిఫిన్ తీసుకొని వస్తాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్ ఏంటయ్యా ఇది ఇదేమైనా హోటల అని అడుగుతాడు. తిను నాన్న నేను చూస్తాను అంటాడు. ఈయనది స్పెషల్ కేసు అందుకే ఆ ఎస్సై పర్మిషన్ లేకుండా ఏది చేయలేం అనేసి కానిస్టేబుల్ అంటాడు. రోహిణి స్పెషల్ కేసు అయితే ఖైదీలకు రాత్రి ఫుడ్ పెట్టారా అని అడుగుతుంది. ఇక మనోజ్ కూడా కానిస్టేబుల్ పై ఫైర్ అవుతాడు. ఇక బాలు సత్యం కు టిఫిన్ పెడతాడు. టిఫిన్ ని పక్కన పడేస్తాడు సత్యం..

మా అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలా నాన్న అనేసి బాలు అడుగుతాడు. ఇక ప్రభావతి కూడా ఏవండీ మీకు దండం పెడతాను ఏదైనా తినండి అని చెప్పేసి అడుగుతుంది. ముగ్గురు కొడుకులు ఉన్నారు కానీ మిమ్మల్ని ఈ జైలు నుంచి తీసుకురాలేక పోతున్నామని బాలు సత్యంతో అంటాడు..అక్కడికి వచ్చిన మీనాను ఇంకా ఏం చూస్తున్నావే పాపిష్టిదానా. ఎక్కడ ఉండాల్సిన మనిషిని ఎక్కడ పడేశావే. ఇలాంటి నిన్ను ఎక్కడికి తీసుకొచ్చి పెట్టాడే నా భర్త. నీకు కనీసం ఆ విశ్వాసం కూడా లేదా. నేను అప్పుడే తలబాదుకుని చెప్పాను. అయినా వినకుండా ఇంతదూరం తీసుకొచ్చారు అని ప్రభావతి అంటుంది.. ఇక మీనాను ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటాడు.


ఇక జరిగిపోయినవి ఎందుకు వదిలేయండి అని మనోజ్ అంటాడు. ఇప్పుడు మన పరిస్థితే బాగోలేదు. మీనా గురించి ఎందుకు అని రోహిణి అంటుంది. నాన్న నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని బాలు వెళ్లిపోతాడు. బయట ఉన్న మీనా ఏవండి అంటుంది. ఏ ఛీ.. అవతలికి వెళ్లు. ఎన్నిసార్లు గెంటేసిన ఇక్కడ ఉంటావేంటీ అని కోపంగా వెళ్లిపోతాడు బాలు. మరోవైపు మీనా అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు రవి. శృతి టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఏదో బాగానే ఉందని చెబుతాడు. మొహటానికి అంటున్నావా అని శృతి అంటే.. లేదు మనస్ఫూర్తిగా చెబుతున్నాను అని రవి అంటాడు. దాంతో రవిని హగ్ చేసుకుని భర్త కాంప్లిమెంట్ ఇస్తే భార్య ఆనందానికి అవధులు ఉండవు తెలుసా అని శృతి అంటుంది..

మా నాన్నకు డబ్బు ఉంటే చాలు. పిల్లలు అవసరం లేదు అని శృతి అంటాడు. మా నాన్నకు మాత్రం పిల్లలే ముఖ్యం. వాళ్లు గుర్తు వస్తున్నారు. వాళ్లకు కాల్ చేయనా అని రవి అంటాడు. తర్వాత నేనుండగా వాళ్లు గుర్తు రావడం ఏంటీ. ఇప్పుడు వాళ్లకు కాల్ చేస్తే మన లొకేషన్ తెలిసిపోతుంది. తెలిసి తెలిసి మనమే మన గురించి చెప్పినట్లు అవుతుంది. ఇప్పుడు మన ఫస్ట్ నైట్ గురించి ఆలోచించు అని శృతి అంటుంది. దాంతో సరే అని వెళ్లిపోతాడు రవి. ఇక మీనా మామయ్య బయట రావాలంటే రవి రావాలి. పెళ్లికి వచ్చిన వారిలో ఎవరికైన వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. అని మీనా ఆలోచిస్తూ ఉంటుంది. మృదులకు కచ్చితంగా రవి శృతిలు ఎక్కడున్నారో తెలుస్తుందని మృదుల కోసం వెళ్తుంది..

ఆ పెళ్లి నేనే చేశాను అంటున్నారు. నన్ను దూరం పెట్టారు. నా భర్త దగ్గరికి రానివట్లేదు. నా కాపురం ముక్కలైపోయేలా ఉంది. రవి వచ్చి చెప్పకపోతే నా జీవితం కూడా సర్వనాశనం అయ్యేలా ఉందమ్మా. వాళ్లు ఎక్కడున్నారో తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పమ్మా అని మీనా వెళ్లిపోతుంటుంది. అప్పుడు మృదుల పిలిచి సారీ అక్క. వాళ్లు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు. మీ పరిస్థితి తెలిసి కూడా చెప్పకపోతే తప్పు అవుతుంది అని మృదుల అంటుంది. శృతిని పెళ్లి చేసుకునేవాడు శృతి వాళ్ల నాన్న వాళ్లిద్దరిని విడదీస్తున్నారట. వాళ్లకు తెలిస్తే ప్రమాదామని శ్రుతి సీక్రెట్‌గా ఉంచమని చెప్పింది. శ్రుతి ఎక్కడుందో ఎవరికి చెప్పొద్దు అక్క అని తన ఫ్రెండ్ కీర్తి ఇంటి అడ్రస్ ఇస్తుంది మృదుల. ఎవరికి చెప్పను. నేనే వెళ్తాను అని కీర్తి ఇంటికి వెళ్తుంది మీనా.. ఇక సంజు వాళ్ల నాన్న కొడుకు పెళ్లికోసం ఏర్పాట్లు చేస్తాడు. సంజు అని నీలకంఠ పిలుస్తాడు. అటువైపు ఉన్న సంజు పలకడు. దాంతో చేయి వేసి పిలుస్తాడు. అప్పుడు ఎవర్రా అని చేయి తీసి ఫైర్ అవుతాడు సంజు. తండ్రిని చూసి షాక్ అయిన సంజు నాన్న నువ్వా.. సారీ సారీ అని అంటాడు. ఏమైందని నీలకంఠ అడుగుతాడు. ఏం లేదని సంజు అంటాడు. నీకు త్వరలో పెళ్లి కాబోతుంది. ఆవేశంతో ఎలాంటి పనులు చేయకు. నేను చూస్తూ ఊరుకోను అని నీలకంఠ అంటాడు. డిస్టర్ట్ చేయడానికి పెళ్లి జరిగితే కదా. పెళ్లి కూతురే లేనప్పుడు పెళ్లి ఎలా జరుగుతుంది నాన్న అని అసలు విషయం చెబుతాడు. దాంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో తల్లిదండ్రులును చూసి వస్తాను. వాళ్లు సరిగ్గా ఉన్నారో లేదో చూస్తాను అని రవి బయటకు వెళ్లబోతుంటే మీనా ఎదురవుతుంది. దాంతో జరిగింది చెబుతుంది మీనా. ఇప్పుడే మేము వస్తాం. నాన్నను విడిపించుకుంటాను అని రవి అంటాడు. ఇప్పుడు బయటకు వెళ్తే సమస్యలు మరింత పెరుగుతాయని, వద్దని చెబుతుంది శృతి.. రవి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడా? అసలు నిజం చెబుతాడా? సత్యం ను రిలీజ్ చేస్తారా అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..

Related News

Nithiin New Movie : చేతులెత్తిసిన నిర్మాత… నితిన్ మూవీకి కొత్త ప్రొడ్యూసర్..?

Rakul Preet Singh: గాయాల పాలైన రకుల్ ప్రీత్ సింగ్.. ఏం జరిగిందంటే..?

Nick Jonas : ప్రియాంక చోప్రా భర్తకు ప్రాణహాని? లైవ్ లో స్టేజ్ పై నిక్ పారిపోవడానికి అదే కారణమా?

Game of Thrones : కత్తులతో చేసిన సింహాసనం గుర్తుందా… ఎన్ని కోట్లకు అమ్మేశారో తెలుసా?

Balagam Venu: హీరోల చేతిలో ఆగం అవుతున్న ‘ఎల్లమ్మ’.. ఆఖరికి ఈ హీరో అయినా సెట్ చేస్తాడా.?

Costly Divorce: అత్యధిక భరణం ఇచ్చుకున్న సెలబ్రిటీస్ వీళ్లే..!

Ram Gopal Varma : బయోపిక్ చేయడానికి రెడీ అయ్యాడా… అందుకే ఈ ట్వీట్స్ చేస్తున్నాడా..?

Big Stories

×