EPAPER

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

Vande Bharat Sleeper Train: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వేలోకి సరికొత్త రైలు ఎంట్రీ ఇవ్వబోతోంది. తొలి వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 2025లో పట్టాలెక్కబోతోంది. న్యూఢిల్లీ-శ్రీనగర్ మధ్య ఈ కొత్త రైలు ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. దేశ రాజధానితో జమ్మూకాశ్మీర్ కు కనెక్టివిటీని పెంచనుంది. పర్యాటకులతో పాటు సాధారణ ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడనుంది. రాత్రిపూట ప్రయాణం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ రైలులో బోలెడు ప్రత్యేకతలు ఉన్నాయి.


అత్యంత వేగం, అత్యధునిక సౌకర్యాలు

వందే భారత్ స్లీపర్ రైలు కేవలం 13 గంటల్లో 800 కి.మీ ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీలో రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 8 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. ప్రయాణీకులకు రాత్రిపూట చక్కటి ప్రయాణాన్ని అందిస్తుంది. విలువైన పగటి సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ రైలులోని అత్యాధునిక సౌకర్యాలు ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి.


కీలక ప్రాంతాల్లో స్టాఫ్ లు

వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-శ్రీనగర్ రూట్ లోకి కీలక ప్రాంతాల్లో ఆగనుంది. అంబాలా కాంట్, లూథియానా, జమ్మూ తావి, శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా లాంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ వెంట నడుస్తుంది. ఇది జమ్మూ, కాశ్మీర్‌లో రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.

నచ్చిన బడ్జెట్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు

వందే భారత్ స్లీపర్ రైలులో మూడు రకాల కేటగిరీలలో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు AC 3 టైర్ (రూ.2,000), AC 2 టైర్ (రూ.2,500) , AC ఫస్ట్ క్లాస్ (రూ.3,000)గా ధరను నిర్ణయించారు.  ప్రతి క్లాస్ లో అప్‌గ్రేడ్ చేసిన స్లీపర్ స్పెసిలిటీస్ ఉన్నాయి. రాత్రంతా సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు.

స్లీపర్ రైలును తయారు చేసిన BEML

న్యూఢిల్లీ-శ్రీనగర్ వందే భారత్ స్లీపర్ రైలును భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) సంస్థ తయారు చేసింది. ఈ రైలును రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సెప్టెంబర్ 2024లో ఆవిష్కరించారు. ఇది ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ రైతు రెడీ అయ్యింది. ఇందులో అప్ గ్రేడ్ చేయబడిన బెర్తులు, మెరుగైన లైటింగ్, క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థ ఉంటుంది.

జమ్మూ- కాశ్మీర్‌ టూరిజానికి ఊతం

వందే భారత్ స్లీపర్ ట్రైన్ జమ్మూ- కాశ్మీర్‌ లోని పర్యాటక రంగం మీద గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. అత్యాధునిక రైలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ కు సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. పర్యాటక ఆర్థిక వ్యవస్ధ మరింత బలోపేతం కానుంది.

బారాముల్లా వరకు పొడగింపు

వందే భారత్ స్లీపర్ రైలు జనవరి 2025 నుంచి న్యూఢిల్లీ-శ్రీనగర్ మధ్య నడవనున్నప్పటికీ, మున్ముందు బారాముల్లా వరకు విస్తరించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విస్తరణ కారణంగా ఉత్తర జమ్మూతో పాటు కాశ్మీర్ అంతటా కనెక్టివిటీ పెరగనుంది. ఈ రైలు ప్రారంభానికి సుమారు నెల రోజు ముందు నుంచి బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది.

Read Also: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Related News

Bengaluru Air Taxis: బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ.. జస్ట్ ఇంత చెల్లిస్తే చాలు, 5 నిమిషాల్లో గమ్యానికి, మరి హైదరాబాద్‌లో?

Best Mobiles: అదిరిపోయే కెమెరా, సూపర్ డూపర్ ఫీచర్లు, రూ. 10 వేల లోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!

IRCTC Train Booking: రైలు బయల్దేరే ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Vande Bharat Sleeper: వందే భారత్ లో కాశ్మీర్ వెళ్లిపోవచ్చు, ఎప్పటి నుంచో తెలుసా?

Indian Railways: ఒకే టికెట్ కు రెండు ధరలా? రైల్వేలో ఇలా కూడా జరుగుతుందా?

Boeing Mass layoffs: 17000 మంది ఉద్యోగులను తొలగించనున్న బోయింగ్.. వేల కోట్ల నష్టమే కారణం..

Big Stories

×