EPAPER

Horoscope 16 october 2024: ఈ రాశి వారికి తిరుగులేని విజయాలు.. గురుధ్యానం మంచిది!

Horoscope 16 october 2024: ఈ రాశి వారికి తిరుగులేని విజయాలు.. గురుధ్యానం మంచిది!

Astrology 16 october 2024: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం.. మొత్తం 12 రాశులు. ఇందులో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఏ రాశి వారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంది? వంటి వాటిపై జ్యోతిష్యులు ఎలాంటి విషయాలు చెప్పారో తెలుసుకుందాం.


మేషం:
మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు తోటివారి సహకారం అందుతుంది. శత్రువులతో ఆచితూచి వ్యహరించాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. దుర్గాదేవి ఆరాధన మంచిది.

వృషభం:
ఈ రాశి వారికి అదృష్టకరంగా ఉంటుంది. అనుకున్న పనులు సకాంలో నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు. గిట్టనివారితో ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదేవతారాధన శుభకరం.


మిథునం:
మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి ప్రయోజనాలు ఆశాజనకంగా ఉంటాయి. అవివాహితులు వివాహయోగం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీసుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.

కర్కాటకం:
కర్కాటక రాశి వారికి విజయవంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో లాభాలు రెట్టింపు అవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్, స్థాన చలనం ఉంటుంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

సింహం:
సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రణాళికతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.అవసరానికి సహాయం అందుతుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కన్య:
ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి మెరుగైన లాభాలు ఉంటాయి. మంచి పనులను ప్రారంభిస్తారు. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు తిరుగులేని విజయాలు ఉంటాయి. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. ఆత్మీయుల సహకారంతో కీలక పనుల్లో విజయం పొందుతారు. గురు ధ్యానం మంచిది.

Also Read: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది

తుల:
ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కీలక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. సమిష్టి నిర్ణయాలు పనిచేస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాలు ఉంటాయి. శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణ చదివితే మంచిది.

వృశ్చికం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆటంకాలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కోపం, చిరాకు దగ్గరకు దరిచేరనీయవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. శ్రీలక్ష్మిదేవి సందర్శనం మంచిది.

ధనుస్సు:
ధనుస్సు రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో తీవ్రమైన పోటీ ఉంటుంది. ఒత్తిడికి గురికాకుండా పనులు పూర్తి చేయాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయం పఠిస్తే మంచి జరుగుతుంది.

మకరం:
మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీమీ రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. శుభవార్త వింటారు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులను గుడ్డిగా నమ్మవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గణపతి ఆలయ సందర్శన మంచిది.

కుంభం:
ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాల్లో తోటివారి సహకారం ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్స్ ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

మీనం:
మీన రాశి వారికి సామాన్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం మంచిది. ముఖ్య వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

Related News

Anuradha Nakshatra: అనురాధ నక్షత్రంలోకి శుక్రుడి సంచారం.. 3 రాశుల వారికి ధనలాభం

Saturn Retrograde: నవంబర్ 15న కుంభ రాశిలోకి శని ప్రవేశం.. 4 రాశుల వారిపై సంపద వర్షం

Mirrors and Vastu: ఇంట్లో అద్దాలను ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు, అలా ఉంచితే జరిగేది ఇదే!

Lakshmi Puja 2024: లక్ష్మీదేవి మంత్రం జపిస్తే మీ జీవితాన్ని సమృద్ధిగా డబ్బుతో నింపుతుంది

Guru Vakri 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలో గురుడు తిరోగమనం.. 119 రోజులు ఈ 3 రాశుల వారి జీవితంలో ఆనందమే

Tulsi Chalisa Benefits: కోరికలు తీరి, ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి!

Big Stories

×