EPAPER

Son In Law Arrested: అత్తకు రోజూ అల్లుడు మెసేజ్‌లు.. అరెస్ట్ చేసిన పోలీసులు, పాపం ఆమె గుండె పగిలింది

Son In Law Arrested: అత్తకు రోజూ అల్లుడు మెసేజ్‌లు.. అరెస్ట్ చేసిన పోలీసులు, పాపం ఆమె గుండె పగిలింది

Son In Law Arrested| ఒక పెళ్లి అయిన వ్యక్తి తన భార్య తల్లికి రోజూ ఫోన్ ద్వారా మెసేజ్ చేసేవాడు. ఆ మెసేజ్ లో ప్రత్యేకంగా ఏమీ ఉండదు. అన్నీ సాధారణ మెసేజ్ లే ఉండేవి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ లాంటివి. చూడడానికి అది చాలా నార్మల్ గా అనిపించేది. కానీ రోజులు గడిచే కొద్దీ ఒక విచిత్ర విషయాన్ని ఆ అత్త ఈ మెసెజ్ లలో గమనించింది. వెంటనే పోలీసులకు తన అల్లుడిపై ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. దీంతో ఆ విచారణ కాస్త హత్య కేసుగా మారింది.


వివరాల్లోకి వెళ్తే.. అమెరికా దేశంలోనికి సౌత్ కెరోలీనా రాష్ట్రం పెండిల్‌టన్ ప్రాంతానికి చెందిన బ్రాండన్ బార్న్స్ అనే 21 ఏళ్ల యువకుడు ఏడాది క్రితం జెస్సికా అనే 20 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి పెండిన్ టన్ ప్రాంతంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివసించేవారు. అయితే ఆ ఇంట్లోనే జెస్సికా స్నేహితులు విక్లోరియా, కెండాల్ ఇద్దరూ పెయింగ్ గెస్ట్స్ గా అదే ఇంట్లో ఉండేవారు.

అంతా బాగానే ఉన్నా.. గత కొన్ని నెలల నుంచి జెస్సికా, ఆమె భర్త బ్రాండన్ మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇద్దరు తరుచూ వాదించుకునేవారు. ఇదంతా జెస్సికా ఫ్రెండ్స్ చూసి.. ఏదో భార్యాభర్తల గొడవ అని పట్టించుకునేవారు కాదు. కానీ ఒక రోజు జెస్సికా, బ్రాండన్ తమ బెడ్ రూమ్ లో గట్టిగా గొడవపడుతున్నట్లు అరుపులు వినిపించాయి. దీంతో ఆమె ఫ్రెండ్ విక్టోరియా.. వారి బెడ్ రూమ్ కు వెళ్లింది. అయితే, అప్పటికే ఘోరం జరిగిపోయింది. బ్రాండన్ చేతిలో జెస్సికా చనిపోయింది. అది చూసి విక్టోరియా గట్టిగా కేకలు వేసింది. దీంతో ఇంట్లో ఉన్న మరో వ్యక్తి కెండాల్ కూడా అక్కడికి వచ్చింది.


Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..

అప్పుడు బ్రాండన్ తాను కోపంలో జెస్సికా గొంతు గట్టిగా పట్టుకున్నానని, ఆమె చనిపోయిందని ఏడ్చాడు. ఇదంతా చూసి పోలీసులకు ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలని, జెస్సికా చనిపోయిన విషయం ఎవరికీ చెప్పకూడదని ముగ్గురూ నిశ్చయించారు. అందుకనే కెండాల్ కారులో జెస్సికా శవాన్ని తీసుకుపోయి ఊరికి పది కిలోమీటర్ల అవతల ఒక అడవిలో పడేశారు.

అయితే జెస్సికాకు ఒక అలవాటు ఉండేది. ఆమె రోజూ తన తల్లి సిసిలియాతో ఫోన్ లో మాట్లాడేది. లేదా మెసేజ్ చేసేది. అందుకే బ్రాండన్ తన భార్య ఫోన్ తీసుకొని తన అత్తకు కాల్ చేయకుండా కేవలం మెసేజ్ లు చేసేవాడు. ఆ మెసేజ్ లలో కేవలం ‘హాయ్ మామ్, గుడ్ మార్నింగ్,’ ‘హాయ్ మామ్, గుడ్ ఈవినింగ్ ,’ ‘గుడ్ నైట్ మమ్మీ,’ అని మాత్రమే మెసేజ్ లు చేసేవాడు. అవతలి వైపు సిసిలియా తన కూతురు తనకు ఎందుకు కాల్ చేయడం లేదని ఆలోచించేది. జెస్సికా ఫోన్ కు సిసిలియా కాల్ చేసినా.. బ్రాండన్ కట్ చేసి.. తాను చాలా బిజీ అని మెసేజ్ మాత్రమే చేసేవాడు.

Also Read: కుటుంబాన్ని పోషించడానికి ఆ పనిచేస్తున్న మహిళ.. ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు!

ఇలా ఒక నెల రోజులు గడిచి పోయాయి. సిసిలియా ఒక రోజు జెస్సికాను చూడడానికి పెండిల్ టన్ ప్రాంతానికి వచ్చింది. కానీ ఇంట్లో జెస్సికా లేదని.. ఆమె బయటికి వెళ్లిందని బ్రాండన్ చెప్పాడు. అలా మరోసారి కూడా జరిగింది. సిసిలియా ఎన్నిసార్లు తన కూతురి గురించి అడిగినా.. బ్రాండన్ అదే సమాధానం చెప్పేవాడు. దీంతో సిసిలియాకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసుల వద్దకు వెళ్లి తన కూతురు కనబడడం లేదని.. ఆమె ఫోన్ తో తనకు ఎవరో మెసేజ్ లు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు బ్రాండన్, అతని ఇంట్లో ఉంటున్న విక్టోరియా, కెండాల్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అయితే పోలీసులకు భయపడిపోయి విక్టోరియా జరిగినదంతా చెప్పేసింది. దీంతో పోలీసులు అడవిలోకి వెళ్లి జెస్సికా శవాన్ని గుర్తుపట్టారు. జెస్సికా శవం కుళ్లి పోయిన పరిస్థితిలో కనిపించింది. పోలీసులు జెస్సికా హత్య కేసులో బ్రాండన్ ను అరెస్టు చేశారు. అయితే అతనికి శవం మాయం చేయడానికి సహకరించినందుకు విక్టోరియా, కెండాల్ ఇద్దరిని కూడా అరెస్టు చేశారు.

Related News

Mumabai : ముంబైలో దారుణం.. తల్లి తండ్రి కళ్ళముందే నడిరోడ్డుపై వ్యక్తి హత్య

Hyderabad Crime News: గచ్చిబౌలిలో దారుణం.. మహిళా టెక్కీపై ఇద్దరు అత్యాచారం, ఆపై..

Lover Murder: ప్రియుడి కోసం లాడ్జికి వెళ్లిన యువతి.. పోలీసుల ఎదురుగానే హత్య!

Mayor Vijayalakshmi case: సౌండ్ పొల్యూషన్.. మేయర్ విజయలక్ష్మిపై కేసు, అసలేం జరిగింది?

Contract Killer Lover: కూతుర్ని హత్య చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన తల్లి.. చిన్న ట్విస్ట్.. హంతకుడు ఏం చేశాడంటే?..

Hindupur Rape Case: హిందూపురం.. అత్తాకోడళ్ల అత్యాచారం కేసు, నిందితులు మైనర్లు?

Big Stories

×