EPAPER

Funny Resignation Letter: ‘మంచి భవిష్యత్తు కోసం మరో ఉద్యోగంలో చేరుతున్నా.. నచ్చకపోతే తిరిగి వస్తా’.. వింత రాజీనామా వైరల్

Funny Resignation Letter: ‘మంచి భవిష్యత్తు కోసం మరో ఉద్యోగంలో చేరుతున్నా.. నచ్చకపోతే తిరిగి వస్తా’.. వింత రాజీనామా వైరల్

Funny Resignation Letter| ప్రపంచంలో మనిషుల స్వభావం వేర్వేరుగా ఉంటుంది. కొందరు నిజాయితీగా ఉంటే.. మరొకందరు కపటంగా ఉంటారు. అయితే ఈ కాలంలో ఎక్కువ శాతం ప్రజలు స్వార్థంగా ఉంటున్నారు. ఇటీవల ఒక వ్యక్తి తన ఉద్యోగాని రాజీనామా చేస్తూ.. రాసిన రాజీనామా లెటర్ తెగ వైరల్ అవుతోంది. అతను ఎంత స్వార్థంగా ఆ రాజీనామా రాశాడో చదివి నెటిజెన్లందరూ అతని తెలివి ప్రశంసిస్తూనే విమర్శిస్తున్నారు. ఎవరైనా రాజీనామా చేస్తే.. తమ వ్యక్తి గత కారణాలు చెబుతారు లేదా సాలరీ ఎక్కువ లభిస్తోంది.. కెరీర్ గ్రోత్, కుటుంబ కారణాలు లాంటివి రాస్తారు. కానీ ఈ వ్యక్తి రాజీనామాలో తాను ఉద్యోగం వదిలివెళ్లిపోతున్నాను.. కానీ తిరిగి వస్తాను అని రాశాడు.


వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికా దేశమైన ఘానాలో ఒక వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ ఇప్పుడు తెగవైరల్ అవుతోంది. ఘానాలో నుసాతా వాసా నగరానికి చెందిన ఈ వ్యక్తి తాజాగా తాను పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ రాజీనామా పత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఆ రాజీనామా ఆ ఉద్యోగి రాసిన విషయాలు చదివి మీరు కూడా నవ్వు ఆపుకోలేరు. ఈ పోస్ట చదివిన వారంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికి వరకు ఈ పోస్ట్ 40 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?


ఆ ఆఫ్రికా వాసి రాజీనామా లెటర్ లో ఏం రాశాడంటే..
తన మనుసులో ఉన్నమటను ఈ ఉద్యోగి బహిరంగంగా రాసి తెలియజేశాడు. లెటర్ లో ఇలా ఉంది. ”నాకు మరో కంపెనీలో కొత్త జాబ్ లభించింది. నేను వెళ్లాలనుకుంటున్నాను. అక్కడ పనిచేశాక నాకు నచ్చపోతే తిరిగి వచ్చేస్తాను. నేను ఇక్కడి టీమ్ మొత్తాన్ని నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కంపెనీ బాగా అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నాను.” అని రాశాడు.

అయితే ఈ రాజీనామా లెటర్ లో ఆ ఉద్యోగి తనకు కొత్త ఉద్యోగం నచ్చకపోతే తిరిగి వస్తానని రాయడం హైలైట్ అయింది. లెటర్ చదివిన యూజర్ల రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా యూజర్లు ఆ ఉద్యోగి నిజాయితీ పరుడని తాను అనుకున్నది రాశాడని కామెంట్ చేశారు. ఇంకొందరు ”అతను తిరిగి వస్తాను అని ఎంత కాన్ఫిడెంట్‌గా రాయడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా కంపెనీ మెనేజ్మెంట్ చాలా మంచిదే అయి ఉంటుంది” అని రాశారు.

Also Read: 23 లక్షలు వద్దు 18 లక్షల జీతం చాలు.. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా..

ఒక నెటిజెన్ అయితే.. “తిరిగి పాత కంపెనీకి వస్తే.. బాస్ మీ సాలరీ తగ్గించేస్తాడు,” అని కామెంట్ పెట్టాడు. ఇంకొకరైతే.. ”రాజీనామ లెటర్ చూసి కంపెనీ హెచ్ ఆర్ ముఖంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయో. ఊహించుకుంటూనే నవ్వు ఆపుకోలేకపోతున్నాను,” అని రాశాడు.

Related News

Chinese Aquarium Whale Shark: నకిలీ వేల్ షార్క్ చూపించి కోట్లు సంపాదించిన చైనా కంపెనీ.. ఎలా గుర్తుపట్టారంటే

UP Train Incident: రైలు కిటికీ నుంచి జారిపడ్డ‌ చిన్నారి.. చిమ్మ చీకట్లో 16 కి. మీ.. సీన్ కట్ చేస్తే..

Viral Video: ఇది జర్నీయా? లేక సైన్స్ ఫిక్షన్ మూవీనా? నెట్టింట వైరల్ అవుతున్న చైనీస్ యువకుడి వీడియో!

Viral News: ఔనా, నిజమా.. ఇద్దరు వ్యక్తులు కలలో కమ్యునికేట్ చేసుకోవచ్చా? ఇవిగో ఆధారాలు

Ratan Tata’s Pet Dog: అయ్యో పాపం.. రతన్ టాటా పెంపుడు కుక్క చనిపోయిందా?

మొబైల్ నెట్‌వర్క్‌ లేని భూలోక స్వర్గం.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే!

Big Stories

×