EPAPER

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

Puri Jagannath.. సాధారణంగా దర్శకులు కథలు రాయడంలో ఒక్కో దర్శకుడు ఒక్కో దారి వెతుక్కుంటాడు. అయితే పూరీ జగన్నాథ్ మాత్రం థాయిలాండ్ వెళ్తాడట. అక్కడే కొత్త కథలు రాస్తారట. అసలు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వెళ్లడం వెనుక బలమైన కారణం ఉందని ,అక్కడే ఆయన సినిమా కథలు రూపుదిద్దుకుంటాయని సమాచారం.మరి కథల కోసం బ్యాంకాక్ వెళ్లడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.


పూరీ జగన్నాథ్ డైరెక్షన్ కి స్టార్ డైరెక్టర్స్ ఫిదా..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్ ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా ఎంతోమంది హీరోలకు మంచి కెరియర్ ను అందించారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా అందరూ ఆయనను అభిమానిస్తారు. టాలీవుడ్ కి తన మార్కు హీరోయిజం పరిచయం చేసిన పూరీ జగన్నాథ్ కథలు, డైలాగ్స్ అన్నీ కూడా యూనిక్ గా ఉంటాయి. సుత్తి లేకుండా సూటిగా వన్ లైన్ తోనే తాను చెప్పాలనుకున్నది చెప్పేస్తూ ఉంటాడు. ముఖ్యంగా జెడ్ స్పీడ్ లో స్క్రిప్ట్ పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేసే సత్తా కలిగిన డైరెక్టర్ అనడంలో సందేహం లేదు.


విజయేంద్రప్రసాద్ మొబైల్ వాల్ పేపర్ పై పూరీ ఫోటో..

ఒక సినిమా కథ అనుకున్నాడు అంటే రెండు వారాల్లోనే ఆ స్క్రిప్ట్ పూర్తి చేయాల్సిందే. ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి విడుదల కూడా చేసేస్తారు. పూరీ జగన్నాథ్ దగ్గర డైరెక్షన్ నేర్చుకో అని మా ఆవిడ చెప్పిందని డైరెక్టర్ రాజమౌళి కూడా ఒక వేదికపై చెప్పారు అంటే ఇక పూరి జగన్నాథ్ ఏ విధంగా సినిమాను టెకోవర్ చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ప్రముఖ రైటర్, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా తన మొబైల్ వాల్ పేపర్ గా పూరీ జగన్నాథ్ ఫోటో పెట్టుకున్నారు. ఒక రచయితగా పూరీ జగన్నాథ్ అంటే తనకు ఈర్ష అని, తన శత్రువుగా భావిస్తానని కూడా చెప్పుకొచ్చారు. నా శత్రువుని గుర్తు చేసుకోవడానికి నేను ఇలా పూరీ జగన్నాథ్ ఫోటో పెట్టుకున్నాను అంటూ వెల్లడించారు. ముఖ్యంగా వీవీ వినాయక్ లాంటి దిగ్గజ దర్శకులు కూడా పూరీ జగన్నాథ్ పై ప్రశంసలు కురిపించారంటే ఇక ఆయన ఏ రేంజ్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

కథలు రాయడానికి ఆమె కోసమే బ్యాంకాక్ కి..

ఇకపోతే పూరీ జగన్నాథ్ కి ఒక అలవాటు ఉంది. ఆయన కథలు రాయడానికి బ్యాంకాక్ మాత్రమే వెళ్తాడు. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన ప్రదేశం ఎందుకు అని అడిగితే మాత్రం అక్కడ బీచ్ లో కూర్చుని కథలు రాయడం వల్ల తన కథలు మంచిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి అనేది ఆయన నమ్మకం. ఇండియాలో కూడా చాలా బీచ్ లు ఉన్నాయి. సముద్ర తీరాలు కూడా ఉన్నాయి . కానీ బ్యాంకాక్ కి మాత్రమే వెళ్లడం వెనుక సరైన రీజన్ ఏమిటి..? అని అడిగితే.. అక్కడ ఒక ముసలావిడ వుంది, ఆమె ఫ్యామిలీ ఉంటుంది. వాళ్లకు బాగా తెలుసు నాకేం కావాలో వాటర్ కొబ్బరి నీళ్లు నేను అడక్కుండానే నాకు సప్లై చేస్తారు ముఖ్యంగా ఆ ముసలావిడ ఫామిలీతో మంచి అనుబంధం ఏర్పడింది అక్కడ పటాయ బీచ్ లో కూర్చుని కథలు రాయడం అలవాటుగా మారిపోయింది అంటూ తెలిపారు పూరీ జగన్నాథ్.. ఏది ఏమైనా బ్యాంకాక్ బీచ్ లో కథలు రాయడం తనకు అలవాటు అంటూ చెప్పుకొచ్చారు.

Related News

Bhumika: కరీనా కపూర్ నా ఛాన్స్ లాగేసుకుంది.. భూమిక షాకింగ్ కామెంట్స్

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

20 years of ShankarDadaMBBS: రీమేక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసారు

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Big Stories

×