EPAPER

మొబైల్ నెట్‌వర్క్‌ లేని భూలోక స్వర్గం.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే!

మొబైల్ నెట్‌వర్క్‌ లేని భూలోక స్వర్గం.. ప్రశాంతంగా ఉండాలనుకుంటే అక్కడికి వెళ్లాల్సిందే!

Indian Tourism: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉంటుంది. చేతి వేళ్లు ప్రతిక్షణం ఫోన్ స్క్రీన్ మీదే తిరుగుతుంటాయి. క్షణ క్షణానికి నోటిఫికేషన్ తో చూపంతా సెల్ ఫోన్ మీదే ఉంటుంది. టూర్లకు వెళ్లినా, సెల్ ఫోన్ ను వదిలి ఉండలేం. అయితే, భారత్ లో కొన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల్లో కనీసం మోబైల్ నెట్ వర్క్ ఉండదు.  అక్కడికి వెళ్తే బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా గడపవచ్చు. భారత్ లో టాప్ నో నెట్‌ వర్క్ టూరిజం స్పాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


దేశంలో మొబైల్ నెట్‌ వర్క్ లేని పర్యాటక ప్రదేశాలు

టూర్ కు వెళ్లడం అంటేనే ప్రకృతి అందాలను చూస్తూ ఎంజాయ్ చేయడం. అలాంటి సమయంలో సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు దూరంగా ఉండాలి. కానీ, ఈ రోజుల్లో వాటికి దూరంగా ఉండలేకపోతున్నారు. అయితే, దేశంలోని కొన్ని పర్యటక ప్రాంతాల్లో అస్సలు మొబైల్ నెట్ వర్క్ ఉండదు.


1.ఖీర్ గంగా, హిమాచల్ ప్రదేశ్

కాంక్రీట్ జంగల్ కు దూరంగా, బిజీ కాల్స్ నుంచి రిలాక్స్ కావాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్ లోని ఖీర్ గంగాకు వెళ్లాలి. సుమారు రెండు గంటల పాటు ట్రెక్కింగ్ చేసి ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. పైకి వెళ్లిన తర్వాత సెల్ ఫోన్ నెట్ వర్క్ ఉండదు. చుటూ పర్వతాలు, అందమైన గడ్డి మైదానాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

2.ఐస్ కింగ్‌డమ్, జమ్ము కాశ్మీర్

జమ్మూకాశ్మీర్ ను భూతల స్వర్గంగా పిలుస్తారు. ఇక జంస్కార్ లోని ‘ఐస్ కింగ్ డమ్’ చూస్తే అచ్చం ‘ఐస్ ఏజ్’ సినిమా చూసినట్లుగానే ఉంటుంది. ఇక్కడికి వెళ్తే పాల పొంగులాంటి ప్రకృతి అందాలు మనసును పులకించేలా చేస్తాయి. రణగొణ శబ్దాలు, సెల్ ఫోన్ ముచ్చట్లు అస్సలు ఉండవు. ప్రకృతితో హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చెయ్యొచ్చు.

3.చిత్కుల్, హిమాచల్ ప్రదేశ్

చిత్కుల్ అనేది పర్యాటకులతో సందడిగా ఉండే ప్రదేశాలకు భిన్నంగా ఉంటుంది. ఇది ఓ అందమైన, ప్రశాంతమైన గ్రామం. చుట్టూ ప్రకృతి అందాలు మనసకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మొబైల్ నెట్ వర్క్ ఉండదు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ పరవశించిపోతారు.

4.లుంగ్తుంగ్-ధూప్ధార, సిక్కిం

సిక్కింలోని ఈ ప్రాంతాన్ని దేవతల నివాసంగా పిలుస్తారు. ఇక్కడికి వెళ్తే ఎటు చూసినా దూదిలాంటి మంచు కనిపిస్తుంది. మంచుతో కప్పబడి ఉన్న పర్వాతాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

5.స్వర్గరోహిణి, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని ఈ ప్రాంతాన్ని స్వర్గలోకానికి వెళ్లే మార్గంగా అభివర్ణిస్తారు. మంచుతో నిండిన పర్వతాలు ఎంతో అందంగా ఆకట్టుకుంటాయి. ఒకవేళ మీకు స్వర్ణంలో తిరిగిన అనుభూతి కలగాలంటే స్వర్గరోహిణి వెళ్లాల్సిందే.

6.వ్యాలీ ఆఫ్ ఫ్లవర్, ఉత్తరాఖండ్

ఉత్తరాఖండ్ లోని మరో అందమైన ప్రదేశం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్. చుట్టూ మంచు కొండల నడుమ పూలు పరుచుకున్న నేల చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. భారత్ లో ఉన్నఅత్యంత అందమైన ప్రదేశాల్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడ కూడా సెల్ ఫోన్ నెట్ వర్క్ అందుబాటులో ఉండదు.

Read Also: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!

Related News

Ratan Tata’s Pet Dog: అయ్యో పాపం.. రతన్ టాటా పెంపుడు కుక్క చనిపోయిందా?

Viral News: రూ.835 ఖర్చుకు.. రూ.1.2 కోట్లు, వారెవ్వా లక్కంటే ఈ గుమ్మడి కాయల వ్యాపారిదే

Watch Video: మంటల్లో కాలుతున్న కారు జనాల మీదికి దూసుకొస్తే, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

Animal Food Robber: సాలరీ రూ.20 లక్షలు.. కక్కుర్తిపడి జంతువుల ఆహారం దొంగతనం చేసేవాడు!

Viral Video: చాయ్ అమ్మే పిల్ల.. ఈమె వీడియోలు భలే వైరల్!

Viral Video: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో

Big Stories

×