EPAPER

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Realme : ఆఫర్ అదుర్స్.. స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపుతో పాటు రూ.2,499 ఇయర్ బర్డ్స్ ఫ్రీ

Realme : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రియల్ మి ఫెస్టివల్ లో భాగంగా రియల్ మి సెల్ ను తీసుకొచ్చింది. ఇందులో స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపును అందిస్తుంది. ఇక గత నెలలోనే విడుదలైన రియల్ మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపును అందించడంతో పాటు ఈ ఫోన్ను కొనుగోలు చేసిన కస్టమర్స్ కు విలువైన ఇయర్ బర్డ్స్ ను సైతం అందిస్తోంది.


ఫెస్టివల్ సేల్లో భాగంగా ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలతో పాటు ఆపిల్ సైతం సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో స్మార్ట్ ఫోన్స్ కు ఉన్న గిరాకీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు తాజాగా రియల్ మీ సైతం సేల్ను ప్రారంభించింది. తాజాగా లాంచ్ చేసిన రియల్ మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ తో పాటు కొనుగోలు చేసిన కష్టమార్స్ కు రూ.2,499 విలువైన ఇయర్ బర్డ్స్ సైతం అందిస్తోంది.

రియల్ మి నార్జో 70 టర్బో 5G స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ ఆకట్టుకునే డిజైన్ తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ డైమన్ సిటీ 7300 ఎనర్జీ ఫైవ్ జీ తో వర్క్ చేస్తుంది. 6gb ర్యామ్ 128gb స్టోరేజ్, 8gb ర్యామ్ 128gb స్టోరేజ్, 12gb రామ్ 256gb స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. రియల్ మీ ఇండియా వెబ్సైట్స్ లో 6 జిబి రామ్ వేరియన్ ధర రూ. 16999 గా ఉంది. ఇక కూపన్, డిస్కౌంట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ. 750 తగ్గింపు లభిస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డ్స్ తో కొనుగోలు చేసిన కస్టమర్స్ కు మరింత తగ్గింపును అందిస్తోంది.


ALSO READ : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

ఇక 8 జిబి రామ్ వేరియంట్ 128gb రామ్ వేరియన్ ధరలు వరుసగా రూ 17999, రూ. 20999 గా ఉన్నాయి. ఇక ఈ ఫోన్స్ టర్బో ఎల్లో, టర్బో గ్రీన్, టర్బో పర్పుల్ కలర్స్ లో లభిస్తున్నాయి. ఈ ఫైవ్ జి స్మార్ట్ ఫోన్ 120mah రిఫరెన్స్ రేట్ 6.7 అంగుళాల OLED డిస్ప్లే తో వచ్చింది. ఈ డిస్ప్లే రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్స్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 రియల్ మి UI 5.0పై ఆధారపడి పని చేస్తుంది. ఇక మీడియా టెక్ డైమన్ సిటీ 7300 ఎనర్జీ 5జి ప్రాసెస్ ను కలిగి ఉంది.

ఈ స్మార్ట్ ఫోన్ హ్యాండ్ సెట్ కూలింగ్ ఛాంబర్ ను కలిగి ఉంది. ఇక కెమెరా సైతం అత్యాధునికంగా తీర్చిదిద్దారు. 50MP కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఇక సెల్ఫీ కెమెరా 16MPగా ఉండగా.. హ్యాండ్ సెట్ 45w ఛార్జింగ్ సపోర్ట్ తో 5000 mah బ్యాటరీ తో పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.4, వైఫై, యుఎస్బిసి సహా మరిన్ని ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ రియల్ మి హ్యాండ్ సెట్ ఐపీ 65 రేటింగ్ తో డస్ట్ వాటర్ రెసిస్టెంట్ గా అందుబాటులోకి వచ్చింది. ఇక రక్షణ పరంగా అత్యాధునికంగా ఈ స్మార్ట్ ఫోన్ను డిజైన్ చేయటంతో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ సైతం ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్నాయి.

Related News

Android : ఆండ్రాయిడ్ వాడుతున్నారా.. ఆ ట్రిక్స్ తెలుసుకోకపోతే హ్యాక్ అవుతుంది మరి!

iPad mini: ఆపిల్ కొత్త ఐప్యాడ్ చూశారా…? ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోద్దీ

Redmi : రూ. 8,999కే Redmi 5G స్మార్ట్ ఫోన్ – స్పెసిఫికేషన్స్ అదుర్స్ గురూ!

Whatsapp : వాట్సాప్ షాకింగ్ డెషిషన్.. లక్షల్లో అకౌంట్స్ బ్యాన్

Jio Bharat V3 And V4 : అతి తక్కువ ధరకే జియో భారత్ మొబైల్స్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Big Stories

×