EPAPER

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లోకి సోనియా రీ ఎంట్రీ.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ లోకి సోనియా రీ ఎంట్రీ.. ఈసారి రచ్చ మాములుగా ఉండదు..

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడు ప్రసారం జరుగుతుంది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ రచ్చ రచ్చగా సాగింది. ఈ వారం నామినేషన్స్ లో 9 మంది ఉన్నారన్న విషయం తెలిసిందే. వారిలోంచి నిఖిల్ బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.. కాగా ఇప్పుడు మరొకరు హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ పర్సన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


హౌస్ లో కేవలం నాలుగు వారాలు హౌస్ లో కొనసాగి, బిగ్ బాస్ హిస్టరీ లోనే ఎవరికీ రానంత నెగటివిటీ ని మూటగట్టుకొని బయటకి వెళ్లిన కంటెస్టెంట్ సోనియా.. ఈమె హౌస్ లో ఉన్నవాళ్లందరితో గొడవ పెట్టుకుంది. అయిందానికి కానీ దానికి రియాక్ట్ అవుతూ హౌస్ మొత్తం రచ్చ రచ్చ చేసింది.. అంతేకాదు లవ్ ట్రాక్ కు నడిపింది. ఇక బయటకు వచ్చిన తర్వాత సోనియా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎంత వైరల్ అయ్యాయో మనం చూశాం.. ఆ వీడియోల గురించి ఇంకా మార్చిపోలేదు కానీ మరో కొత్త వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఈ ఫైర్ బ్రాండ్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని టాక్.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారింది..

సోనియా నెగటివ్ అయినప్పటికీ కూడా, బోలెడంత కంటెంట్ ఇస్తుండడంతో బిగ్ బాస్ టీం ఆమెని మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని టాక్.. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ఆమె రెమ్యూనరేషన్ భారీ గా డిమాండ్ చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసలు. ఆమె హౌస్ లోకి మొదటిసారి ఎంట్రీ ఇచ్చినప్పుడు వారానికి 3 లక్షల రూపాయిలు ఇవ్వడానికి బిగ్ బాస్ టీం అంగీకరించింది. కానీ ఇప్పుడు రీ ఎంట్రీ కోసం ఆమె సుమారుగా వారానికి 4 లక్షల 50 వేల రూపాయిలను డిమాండ్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది.. ఆమె అడిగింది విని షాక్ అవుతున్నారు. దీనిపై బిగ్ బాస్ టీమ్ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. భారీ రెమ్యూనరేషన్స్ ను ఇచ్చి పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ లాగా తీసుకొచ్చారు. వాళ్ళకే బడ్జెట్ భారీగా పెరిగిపోయింది, ఇప్పుడు సోనియా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఈ సీజన్ బడ్జెట్ లిమిట్ దాటిపోతుందని బిగ్ బాస్ టీం భావించిందట. దీంతో నిన్న మొన్నటి వరకు కచ్చితంగా సోనియా రీ ఎంట్రీ ఉంటుందని బలంగా వినిపించిన ఇప్పుడు ఆమె పేరు అయితే వినిపించలేదు. ఇక ఈమె ఎంట్రీ లేనట్టే అని తెలుస్తుంది.


ఇక ఈ వారం హౌస్ నుంచి పృథ్వి లేదా నిఖిల్ వెళ్లే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. పృథ్వి, విష్ణు ప్రియా లవ్ ట్రాక్ నడుస్తుంది. ఇలాంటి టైం లో అతన్ని పంపిస్తే బిగ్ బాస్ కు రేటింగ్ పడిపోతుంది. ఇక నిఖిల్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారో చూడాలి..

Related News

Bigg Boss 8 Telugu Promo: వెక్కివెక్కి ఏడ్చిన యష్మీ.. అవినాష్ భార్యపై పృథ్వి చీప్ కామెంట్స్, ఇదేనా నీ సంస్కారం?

Bigg Boss 8 Day 44 Promo1: నామినేషన్ రచ్చ.. తారస్థాయికి చేరిన గొడవ..!

Bigg Boss 8 Telugu: సొంత మనుషులే ప్రేరణకు వెన్నుపోటు, మణికంఠకు అన్యాయం.. అందరూ కలిసి తేజను గట్టెంక్కిచారుగా!

Bigg Boss Sita : బిగ్ బాస్ నుంచి బయటకొచ్చినా ఆ కోరిక తీరలేదని సీత ఎమోషనల్..

Bigg Boss: ఏడవ వారం నామినేషన్స్ జాబితా.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు..!

Bigg Boss 8 Telugu: నయని నోరుమూయించిన గంగవ్వ, ప్రేరణపై పగపట్టి న పృథ్వి.. ఈసారి నామినేషన్స్ అదుర్స్

Big Stories

×