EPAPER

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

Rapaka Varaprasad Resign YCP Party: కోనసీమ జిల్లాలో తెరపైకి వస్తున్న కొత్త ట్విస్టులు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే మాటను ఆ నేత నిజం చేస్తున్నారా ? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులూ ఉండరనే మాటనే ఆదర్శంగా తీసుకుంటున్నారా ? ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో కొనసాగబోనని అంటున్న ఆ మాజీ ఎమ్మెల్యే.. కూటమిలో చేరిక కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారా ? ఆ నాయకుడి ఎంట్రీకి నేతలు ఒకే చెప్పినా.. కార్యకర్తలు నో అంటున్నారా.. అసలు ఆ నాయకుడు ఎవరు ? ఆ స్టోరీ ఏంటో మీరే చూడండి.


అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాల్లో కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. గత దశాబ్ద కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా నడిచిన.. రాజోలు నియోజకవర్గ వ్యవహారం ఇప్పుడు ఊహించని టర్న్ తీసుకుంటుంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అనే మాటను నాయకులు నిజం చేసి చూపిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులూ ఉండరనే లెక్కకు జస్టిఫై చేసేస్తున్నారు. ఎన్నికల ముందే కాకుండా మళ్లీ మరోసారి కోనసీమలో వలసలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. వైసీపీకి టాటా బైబై అనేశారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌.

మొన్నటి ఎన్నికల్లో జనసేన వందకు వందశాతం హిట్‌ కొట్టింది. కానీ అంతకు ముందు ఎన్నికల్లో హోల్‌ ఆంధ్రాలో ఆ పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటు. ఒకే ఒక్కడుగా అసెంబ్లీకి అడుగు పెట్టిన రాపాక వరప్రసాద్‌ అప్పట్లో తనకంటూ క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాను రాను పార్టీకి దూరమైన రాపాక.. వైసీపీ ప్రభుత్వానికి దగ్గరవుతూ వచ్చారు. సొంతపార్టీకి హ్యండిచ్చి.. వైసీపీ పంచకు చేరిపోవడంతో అక్కడి జనసైనికులు రగిలిపోయారు. రాపాకను ఓడించి తీరతామని శపధం చేసి మరీ.. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్ధికి ఘన విజయం కట్టబెట్టారు.


గత ఎన్నికల్లో కూటమి ప్రభంజనం తర్వాత అన్ని లెక్కలు మారిపోయాయి. వైసీపీ నేతలంతా ఒక్కొక్కరుగా కుటమిలోకి క్యూ కడుతున్నారు. ఈ కోవలోనే మాజీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ వైసీపీకి షాక్ ఇచ్చారు. ఫ్యాన్ పార్టీని వీడినున్నట్టు ప్రకటించారు. తాను గతంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. కానీ గత ఎన్నికల్లో టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు. అందుకే తాను అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనూ మళ్లీ రాపాక ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టారో మళ్లీ అక్కడికే చేరుకున్నారనే టాక్‌ పీక్స్‌కు చేరింది.

Also Read: ప్రధాని మోదీ ఫోటో లేకుంటే ఊరుకోను… ఉపముఖ్యమంత్రి ‘పవనాగ్రహం’

ఇక ఇప్పుడు గాజు గ్లాసే శరణ్యం అంటూ రాపాక సొంత గూటికి చేరతారా.. లేక సైకిల్‌ ఎక్కేస్తారా? లేదంటే ఇటు, అటు కాకపోతే కమలానికి దగ్గరయ్యేలా ఏదైనా స్కెచ్చేశారా? అని రాజోలు రాజకీయంలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇటీవల జనసేన మీటింగ్‌ల్లో వరుసగా ప్రత్యక్షమవుతున్నారు రాపాక వరప్రసాద్‌. జనసేన ఎమ్మెల్యే దేవవరప్రసాద్‌ను కలిశారు. అయితే పెండింగ్‌ పనులను పూర్తి చేయాలని.. ఆ వివరాలను అందించేందుకే ఎమ్మెల్యేను కలిశానని వివరణ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే రాపాక. కానీ మాటిమాటికి జనసేన మీటింగ్‌ల్లో రాపాక కనిపించడానికి కారణం ఏంటా అని జోరుగా చర్చ జరుగుతోంది.

గతంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కొన్ని కారణాల వల్ల వైసీపీలో చేరినట్లు రాపాక స్పష్టం చేశారు. కానీ గత ఎన్నికల్లో టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని అన్నారు. అందుకే తాను అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. రాజోలులో ఎంతో కష్టపడి పనిచేసినా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని, ఎంపీ టికెట్ ఇచ్చారని తెలిపారు. ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని, కానీ పార్టీ పెద్దల మాటతో ఎంపీగా బరిలో దిగానని వివరించారు. రాజోలు బరిలో తనపై నమ్మకం లేక గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారని రాపాక వరప్రసాద్ వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీలో కొనసాగబోనని స్పష్టం చేశారు.

జనసేనలో చేరడానికి రాపాక సిద్దంగా ఉన్నా కూడా.. పార్టీ వైపు నుంచి మాత్రం పిలుపు ఇంకా రాన్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టువదలని వరప్రసాద్‌ అనేలా ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సాయంతో మళ్లీ గాజు గ్లాసునే పట్టుకుంటారా? అన్నది ప్రజంట్ సస్పెన్స్ గా మారింది. మరోవైపు జనసేనలో గెలిచి జగన్ పంచన చేరిన రాపాకకు.. జనసేనాని మళ్లీ ఛాన్స్ ఇస్తారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అలానే రాపాక వరప్రసాద్ టీడీపీ గూటికి చేరతారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ సైడ్ నుంచి పూర్తి క్లారిటీ వచ్చిన వెంటనే వైసీపీకి అఫీషియల్ గా రాజీనామా చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మొత్తానికి అటు జనసేన.. ఇటు టీడీపీ ఏ గట్టున చేరినా సరే.. ఉండేది కూటమి జట్టులోనే కదా అని రాపాక వ్యూహాలు రచిస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి వరప్రసాద్‌ ప్లాన్ సక్సెస్ అయ్యి కుటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? ఇన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ కలవరమే మిగులుతుందా? రాపాక కూటమిలోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల జనసైనికులు ఎలా స్పందిస్తారు ? టీడీపీ క్యాడర్ రాపాకకు వెల్కమ్ చెబుతారా అనే విషయం చర్చనీయాంశంగా మారింది.

Related News

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Big Stories

×