EPAPER

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Hero Nithiin : ఈరోజుల్లో చాలావరకు యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకోలేకపోతున్నారు. ఏదో ఒక దగ్గర వారికి బ్రేక్ పడుతుంది. చాలామందికి హ్యాట్రిక్ హిట్స్ కొట్టడం కష్టమవుతోంది. అలాంటి యంగ్ హీరోల లిస్ట్‌లో నితిన్ (Nithiin) కూడా ఉన్నాడు. ఎన్నో ఫ్లాపుల తర్వాత నితిన్‌కు ఒక హిట్ లభించింది. అలా వరుసగా కొన్ని హిట్స్ తర్వాత మళ్లీ ఫ్లాప్స్ తన వెంటపడ్డాయి. ఇప్పుడు ఆ ఫ్లాప్స్ నుండి తప్పించుకొని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే తనను ఫ్లాపుల నుండి బయటపడేసిన దర్శకుడితోనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. దానికోసం ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కూడా పక్కనపెట్టనున్నట్టు సమాచారం.


Also Read: ‘రాబిన్ హుడ్’ రాక ఆరోజు కష్టమే… మంచి రిలీజ్ డేట్ ను చేజార్చుకోనున్నారా?

కాపాడిన సినిమా…


దాదాపు ఏడేళ్ల పాటు నితిన్‌ను బ్యాడ్ లక్ వెంటాడింది. అందుకే తను ఏ సినిమా చేసిన అది ఫ్లాప్ లేదా డిజాస్టర్ అయ్యింది. అలా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్‌ను కాపాడిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ (Vikram K Kumar). విక్రమ్, నితిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్’ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. చాలావరకు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా 100 రోజులు పూర్తి చేసుకుంది. ‘ఇష్క్’తో హిట్ ట్రాక్ ఎక్కిన నితిన్.. మరోసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక ఇప్పుడు కూడా నితిన్ హీరోగా నటించిన గత రెండు సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో విక్రమ్ కే కుమార్‌తో మరోసారి చేతులు కలపడానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది.

నమ్మిన దర్శకుడు…

విక్రమ్ కే కుమార్, నితిన్ కాంబినేషన్‌లో సినిమా కన్ఫర్మ్ అయ్యిందట. ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమయ్యిందని టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టుకున్న ఈ మూవీకి అప్పుడే ‘అశ్వమేధ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం. విక్రమ్ కే కుమార్ సినిమాలంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. నితిన్ హీరోగా నటించిన ‘ఇష్క్’తోనే విక్రమ్ కే కుమార్ దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పట్లో ఈ డైరెక్టర్‌ను నమ్మడం.. నితిన్ కెరీర్‌ను మరో మలుపు తిప్పింది. ఈసారి ఈ హిట్ కాంబినేషన్ ఇంకేం మ్యాజిక్ క్రియేట్ చేయనుందో అని నితిన్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వరుస సినిమాలు…

ప్రస్తుతం నితిన్.. ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. తనకు ‘భీష్మ’లాంటి క్లీన్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతోనే ‘రాబిన్ హుడ్’ చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ‘రాబిన్ హుడ్’ విడుదల లేట్ అయ్యే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్తయితే ‘బలగం’ వేణు దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయాల్సి ఉంది నితిన్. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్‌ లేట్ అవ్వడంతో ఇప్పుడు ఆ స్థానంలోకి విక్రమ్ కుమార్ ‘అశ్వమేధ’ వచ్చి చేరింది.

Related News

Matthu Vadalara 2: చూసిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం తెలుస్తుంది ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వేసుకున్నారు

20 years of ShankarDadaMBBS: రీమేక్ తో రికార్డ్స్ క్రియేట్ చేసారు

Oviya: వీడియో లీక్ ఎఫెక్ట్.. బంఫర్ ఆఫర్ పట్టేసిన ఓవియా..

People Media Factory: ఫ్యాక్టరీ నుంచి సినిమాలు వస్తున్నాయి కానీ, లాభాలు రావట్లేదు

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Pushpa2 : పుష్ప 2 బిజినెస్ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్.. కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా..

Big Stories

×