EPAPER

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

Baba Siddique Murder: బిష్ణోయ్ కులదైవానికి సల్మాన్ బలి..

బాలీవుడ్ సెలబ్రెటీలకు సన్నిహితుడైన ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీని తామే చంపామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. కొద్ది రోజులుగా రెక్కీ నిర్వహించి హత్య చేసినట్లు ఆ గ్యాంగ్ సభ్యులు పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నాడు. హర్యానాకు చెందిన ఓ కానిస్టేబుల్ కుమారుడు అయిన లారెన్స్ బిష్ణోయ్ ముందు నుంచీ నేరస్వభావం కలిగిన వ్యక్తి. దోపిడీలు, దొంగతనాలతో ఎదిగాడు. తర్వాత కిడ్నాపులు, హత్యలకు పాల్పడుతున్నాడు. దావూద్ ఇబ్రహీం తరహాలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్లుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. బాలీవుడ్ ప్రముఖుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా కాల్పులు జరుపుతున్నట్లుగా భావిస్తున్నారు. గతంలో దావూద్ ను నిర్లక్ష్యం చేసి వదిలివేయడంతో ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్ ను ప ట్టుకున్నా.. జైల్లో ఉన్నా.. అతను ఓ మాజీ మంత్రిని.. అత్యంత కీలక నేతను హత్య చేయించగలిగాడంటే.. చిన్న విషయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

బిష్ణోయ్ గ్యాంగ్ తమ ఉనికి చాటుకోవడం కోసం సల్మాన్ ఇంటి వద్ద ఫైరింగ్ చేసింది. ఆ తర్వాత ఓ బిగ్ టార్గెట్ ను షూట్ చేయకపోతే భయం ఉండదని అనుకుని.. బాబా సిద్దిఖీని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో దావూద్ ఇబ్రహీం కూడా ఇలాగే బాలీవుడ్‌ను టార్గెట్ చేసేవారు. పలువురిపై ఎటాక్స్ చేయించారు. చివరికి బాలీవుడ్ మొత్తాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకున్నారని చెబుతారు. తర్వాత మెల్లగా మాఫియా కబంధ హస్తాల నుంచి బాలీవుడ్ బయటపడింది. కనీసం ఏడు వందల మంది షూటర్లతో ఓ నెట్ వర్క్ ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఆయుధాలను కూడా విదేశాల నుంచి స్మగ్లింగ్ ద్వారా తెప్పించుకుంటారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా కెనడా నుంచి వారి గ్యాంగ్ కు సంబందించి కీలక నిర్ణయాలు జరుగుతూ ఉంటాయని.. ఇక్కడి షూటర్లకు అక్కడి నుంచే ఆదేశాలు వస్తాయని చర్చ జరుగుతోంది.


Also Read: సల్మాన్ ఖాన్‌తో స్నేహం వల్లే బాబా సిద్ధిఖ్ హత్య? గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయి ఎందుకు చేస్తున్నాడు?

లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు సిద్ధిఖీ హత్యలో సంబంధం ఉన్న నేపథ్యంలో ముంబయిలోని సల్మాన్‌ ఖాన్‌ నివాసం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సిద్ధిఖీకి అనేక మంది బాలీవుడ్‌ సెలబ్రెటీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సిద్ధిఖీ ఏర్పాటు చేసే ఇఫ్తార్‌ విందు, పార్టీలకు సల్మాన్‌, షారుఖ్, సంజయ్‌దత్‌, శిల్పాషెట్టి వంటి అగ్రతారలు తరచూ హాజరవుతుంటారు. ఇంత జరుగుతూంటే లారెన్స్ బిష్ణోయ్ బయట ఉన్నారని అనుకుంటారు. కానీ ఆయనను అరెస్టు చేసి చాలా కాలం అయింది. తీహార్ జైల్లో ఉన్నారు. ఎన్ఐఏ విచారణలో బిష్ణోయ్ చాలా ప్రమాదకరమైన వ్యక్తిగా తేలింది ఆ మేరకు చార్జిషీటు కూడా దాఖలు చేశారు. జైల్లో ఉండే నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. బిష్ణోయ్ హవా ఇలాగే ఉంటే మరో దావూద్ లా మారుతాడని..ఆయనను… ఆయన గ్యాంగ్‌ను మొదట్లోనే ఏరి వేయాలన్న సూచనలు ఎక్కువగా ఎక్స్ పర్ట్స్ నుంచి వినిపిస్తున్నాయి.

అసలు ఒక సినిమా నటుడు అయిన సల్మాన్ ఖాన్ కు ఒక గ్యాంగ్ స్టర్ కు మధ్య శత్రుత్వం ఏమిటి? అనే ప్రశ్న ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తోంది. దీనికి సమాధానం 1999వ సంవత్సరంలో జరిగిన ఓ సంఘటన. 1999లో సల్మాన్ ఖాన్ హమ్ సాథ్ సాథ్ హై సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం రాజస్థాన్ లో జరిగింది. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, తన సహనటులతో కలిసి అక్కడి అడవుల్లో లభించే ప్రత్యేకమైన జింకలను వేటాడాడు. జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఆ తరువాత కేసు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇంతవరకు సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడలేదు. ఆ బ్లాక్ బక్ జింకలను బిష్నోయి సామాజిక వర్గం తమ కులదైవానికి ప్రతీకగా పూజిస్తుంది. జింకలను పవిత్ర జంతువులుగా ఆరాధిస్తుంది. అలాంటి పవిత్ర జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపాడని బిష్నోయి సామాజిక వర్గంలో బాలీవుడ్ సూపర్ స్టార్ పట్ల కోపం ఉంది.

మొత్తంగా బిష్ణోయ్‌ జైలు నుంచి చక్రం తిప్పితే.. దావూద్‌ ఇబ్రహీం, చోటా షకీల్‌, అబూ సలీం చోటా రాజన్‌ లాంటి విదేశాల్లో ఉండి ఇండియాలో దందా చేస్తున్నారు. 2014 నుంచి లారెన్స్‌ బిష్ణోయ్‌ జైలులోనే ఉన్నాడు. ఇప్పటివరకు లారెన్స్‌ ను మూడు జైళ్లలోకి మార్చారు. రెండు దశాబ్దాల నిశ్చబ్దం తర్వాత ముంబైలో మళ్లీ తుపాకీ మోత మోగింది. పంజాబ్‌, ఢిల్లీలో నెత్తుటి ధారలు పారించిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌.. సిద్దిఖీ హత్యతో ముంబైలో అడుగుపెట్టినట్టైంది.

Related News

BRS On Navy Radar station: అప్పుడు అనుమతులు.. ఇప్పుడు అసత్య ప్రచారాలు.. దామగుండం చుట్టూ గులాబీ రాజకీయం

Rapaka Varaprasad: రాపాక దారెటు.. కూటమిలోకి ఎంట్రీ ఇస్తారా ? కలవరమే మిగులుతుందా?

What is the THAAD: థాడ్ అంటే ఏంటి? ఇది వాడితే ఏ దేశమైనా నాశనమేనా?

JC Prabhakar Reddy: వాటా ఇవ్వాల్సిందే.. దుమారం రేపుతున్న జేసీ మాటలు..

Harish Rao: నెంబర్ 2 నేనే..!

Vijayasai Reddy EVM: ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయి విజయ్‌సాయిరెడ్డి ట్వీట్.. 2019లో టాంపరింగ్ సాధ్యం కాదని చెప్పిన జగన్!

Big Stories

×