EPAPER

Lawrence Bishnoi: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!

Lawrence Bishnoi: ఆ గ్యాంగ్ స్టర్ తో ఇండియన్ ఏజెంట్లకు సంబంధాలు, భారత్ పై కెనడా చిల్లర ఆరోపణలు!

India-Canada Diplomatic Row: భారత్ పై కెనడా రోజు రోజుకు తీవ్ర అక్కసు వెళ్లగక్కుతోంది. ఖలిస్థానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ కేసులో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ ను నిందితుడిగా చేర్చిన కెనడా, తాజాగా మరోసారి అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి కెనడాలో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ సంచలన ఆరోపణలు చేసింది. భారత్ ఏజెంట్లు బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి ఖలిస్థానీ ఉద్యమకారులను టార్గెట్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది.


బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత ఏజెంట్లకు సంబంధాలు

తాజాగా నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించిని వివరాలను మీడియాకు వెల్లడించిన రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీసులు భారత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత ఏజెంట్లు ప్రొ ఖలిస్థానీలను టార్గెట్ చేసుకుని చంపేస్తున్నారని ఆరోపించారు. “కెనడాలోని సౌత్ ఆసియా కమ్యూనిటీ భారత ఏజెంట్లు టార్గెట్ చేసుకున్నారు. ముఖ్యంగా ప్రో ఖలిస్థానీలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఈ ఏజెంట్లు కొన్ని గ్రూపుల సాయం తీసుకుంటున్నారు. ఇందులో ప్రధానమైన గ్రూప్ లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్. ఈ గ్రూప్ తో కలిసి భారత ఏజెంట్లు కెనడాలో ఉగ్రవాదాన్ని పెంచిపోషించే ప్రయత్నం చేస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ తో భారత ఏజెంట్లకు సంబంధాలు ఉన్నట్లు మేం నమ్ముతున్నాం” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టకపోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భాతర్ కు సంబంధించి ఆరుగురు దౌత్య అధికారులను దేశం విడిచి వెళ్లిపోవాలని కెనడా ఆదేశించింది. భారత్ కూడా వారిని వెంటనే వెనక్కి రావాలని సూచించింది.


ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత సిద్ధిఖీ హత్యతో లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ కేసులో లారెన్స్ గ్యాంగ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బిష్ణోయ్‌ గ్యాంగ్‌ విషయాన్ని కెనడా అధికారులు ప్రస్తావించడం పలు అనుమానాలకు తావిస్తుందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం లారెనస్ బిష్ణోయ్ జైల్లో ఉన్నాడు. అతడి తమ్ముడితో పాటు కొంత మంది అనుచరలు కెనడా కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు భారత ఏజెంట్లకు, బిష్ణోయ్ గ్యాంగ్ కు కెనడా లింక్ పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటా? అని దౌత్య అధికారులు ఆరా తీస్తున్నారు.

నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకు సహకరించడం లేదన్న కెనడా

తాజాగా నిజ్జర్ హత్యకేసు నిందితుల లిస్టులో భారత హైకమిషనర్ వర్మ పేరును చేర్చింది. అంతేకాదు, నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్ సహకరించడం లేదంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. కెనడా ప్రధాని వ్యాఖ్యలను భారత్ కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా ఆరోపణలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిన్ ట్రూడో ఆయన తండ్రిలాగే భారత్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడింది. ట్రూడో తండ్రి ఇలియెట్ ట్రూడో సైతం ఖలిస్థానీ ఉగ్రవాదాలకు సపోర్టుగా నిలిచారనే విషయాన్ని గుర్తు చేసింది. భారత్ లో ఖలిస్థానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే కెనడా, వారి దేశంలో క్యుబెక్ ఉద్యమాన్ని ఎందుకు ఉక్కుపాదంతో అణచివేసిందో చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

Read Also:‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

Related News

Air India Flight : గాల్లో ఉండగానే దిల్లీ చికాగో విమానానికి బాంబు బెదిరింపు.. ఆ తర్వాత ఏం జరిగిదంటే ?

India canada diplomatic row: నిజ్జర్ హత్య కేసు చిచ్చు.. ఆరుగురు కెనడా దౌత్య వేత్తలను బహిష్కరించిన భారత్

UN Peacekeepers Netanyahu: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

China military Drill Taiwan| తైవాన్ చుట్టూ చైనా మిలటరీ డ్రిల్.. ‘యుద్దం రెచ్చగొట్టేందుకే’

Israeli bombardment In Gaza: గాజా బాంబుదాడుల్లో 29 మంది మృతి.. లెబనాన్ లో మరో ఐరాస కార్యకర్తకు తీవ్ర గాయాలు

Women CEOs Earning More| పురుషుల కంటే మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ .. కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు

Big Stories

×