EPAPER

Jr NTR’s Devara: అంతలా లేచి ఇలా పడిపోయిదేంటి..? మేకర్స్ అప్రమత్తం అవ్వాల్సిందే..

Jr NTR’s Devara: అంతలా లేచి ఇలా పడిపోయిదేంటి..? మేకర్స్ అప్రమత్తం అవ్వాల్సిందే..

Jr NTR’s Devara: ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘దేవర’.. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యింది. మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌తో మొదలయినా కొందరి అంచనాలను మాత్రం అందుకోగలిగింది. అందుకే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో, ఓపెనింగ్స్ విషయంలో ‘దేవర’ వండర్స్ క్రియేట్ చేయగలిగింది. ఆఖరికి ‘దేవర’తో ఎన్‌టీఆర్.. రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేశాడని కూడా ఫ్యాన్స్ సంతోషించారు. కలెక్షన్స్ విషయంలో ఆకాశాన్ని అందుకున్న ‘దేవర’.. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పటికీ మేకర్స్ మాత్రం ప్రేక్షకులకు అబద్ధాలు చెప్తూ సినిమాను థియేటర్లలో నడిపించాలని చూస్తున్నారు.


అక్కడ పరిస్థితి వేరే

ఎన్నోసార్లు వాయిదా పడిన తర్వాత సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలయ్యింది ‘దేవర’ (Devara). ఈ సినిమా విడుదల కాకముందు నుండే పోస్టర్స్‌తో, ప్రెస్ మీట్స్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు దర్శకుడు కొరటాల శివ (Koratala Siva). ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత సోలో హీరోగా ఎన్‌టీఆర్ నుండి ఫ్యాన్స్ ఏదైతే ఆశిస్తున్నారో అది కచ్చితంగా ‘దేవర’తో దొరుకుతుందని మాటిచ్చాడు. దీంతో ఈ సినిమా భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ప్రీ రిలీజ్ బుకింగ్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తుందంటూ పోస్టర్లు కూడా విడుదల చేశారు మేకర్స్. మూవీ విడుదలయ్యి 15 రోజులు అయినా కూడా రూ.3 కోట్ల కలెక్షన్స్ రాబట్టిందని అన్నారు. కానీ థియేటర్లలో పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు.


Also Read: “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్స్ న్యాయపోరాటం… రెండేళ్లు దాటినా పట్టించుకోని ప్రొడ్యూసర్

కలెక్షన్స్ పోస్టర్స్

థియేటర్లలో పెద్దగా పోటీ లేని సమయం చూసి ‘దేవర’ను రంగంలోకి దించారు మేకర్స్. ఆ ఒక్కవారమే చాలావరకు థియేటర్లలో ఈ సినిమానే రన్ అయ్యింది. కానీ ఆ తర్వాత వారం నుండి దాదాపుగా అరడజను సినిమాలు థియేటర్లలో పోటీపడడం మొదలయ్యింది. అది కూడా ‘దేవర’పై కాస్త ఎఫెక్ట్ చూపించింది. అలా ఆ మూవీకి కలెక్షన్స్ తగ్గిపోతున్నాయని ప్రేక్షకులు భావిస్తున్నా.. మేకర్స్ మాత్రం వందల కోట్ల కలెక్షన్స్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. ఇండియాలో మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లో ‘దేవర’కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయని పోస్టర్లు విడుదలయ్యాయి. దసరా ముగిసే సమయానికి ‘దేవర’కు ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని ప్రకటించారు.

ఓనర్లకు నష్టం

మేకర్స్ చెప్తున్నదానికి.. వాస్తవంలో జరుగుతున్నదానికి సంబంధం లేదని అనిపిస్తోంది. చాలావరకు థియేటర్లలో ‘దేవర’కు ప్రేక్షకులు లేరు. అలాంటప్పుడు విడుదలయిన 15వ రోజు రూ.3 కోట్ల కలెక్షన్స్ ఎలా వస్తాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు ఖాళీగా ఉండడంతో కచ్చితంగా ‘దేవర’ షోలు వేసుకుంటే ఆ ఓనర్లకే నష్టం అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అందుకే దాదాపుగా ‘దేవర’ థియేట్రికల్ రన్ ముగిసిపోయినట్టే అని అర్థమవుతోంది. అయినా కూడా ఇప్పటికీ ఫేక్ కలెక్షన్స్ చూపిస్తూ ఫ్యాన్స్‌ను మాయ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘దేవర’ థియేట్రికల్ రన్ ముగిసిపోవడం మాత్రమే కాకుండా త్వరలోనే ఓటీటీలోకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

Related News

Puri Jagannath: పూరీ కథల వెనుక బ్యాంకాక్.. అసలు కథేంటి మాస్టారూ..?

OG : డీవీవీ దానయ్య కు విముక్తి, అభిమానులకు పండుగ

Pushpa2 : పుష్ప 2 బిజినెస్ కోసం సుక్కు మాస్టర్ ప్లాన్.. కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా..

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Big Stories

×