EPAPER

Kiran Kumar on KTR: పదేళ్లలో భారీ బిల్డింగ్స్ కట్టుకున్నారు.. అప్పుడు కనిపించలేదా.. కేటీఆర్ కు ఎంపీ సూటి ప్రశ్న

Kiran Kumar on KTR: పదేళ్లలో భారీ బిల్డింగ్స్ కట్టుకున్నారు.. అప్పుడు కనిపించలేదా.. కేటీఆర్ కు ఎంపీ సూటి ప్రశ్న

Kiran Kumar on KTR: తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ట్విట్టర్ వార్ జోరుగా సాగుతోంది. గతంలో పొలిటికల్ లీడర్స్ విమర్శలు మైకుల ముందు వినిపించేవి. ఇప్పుడు సోషల్ మీడియా కూడా వాటికి వేదికైంది. తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పట్ల కాంగ్రెస్ నేతలు ట్వీట్ లతో విమర్శలు కురిపిస్తున్నారు.


ఇటీవల తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాక సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ వద్ద జరిగిన శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సీఎం మాట్లాడుతూ.. విశాలమైన మైదానంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మించడం జరుగుతుందని, అలాగే పేద, ధనిక తేడా లేకుండా ఈ స్కూల్స్ లో ఉచిత విద్యను అందిస్తామన్నారు. అలాగే గురుకులాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తాము ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

ఇక బీఆర్ఎస్ ను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ.. గత పాలకులు విద్యాభివృద్దికి తిలోదకాలు పలికారని, పేదలు విద్యాపథంలో రాణించడం మాజీ సీఎం కేసీఆర్ కు ఇష్టం లేదన్నారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాగా ఇటీవల గురుకులాల అద్దెలు చెల్లించలేదని పలువురు యజమానులు నిరసన తెలుపుతున్నారు. మరికొందరు గురుకులాల వద్ద బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.


దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తన ఎక్స్ ఖాతా ద్వారా.. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నెలనెలా ఢిల్లీకి మూటలు పంపుతుందని, అందుకు ఎంచక్కా పైసలు ఉన్నాయన్నారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు కమిషన్ వ్యవహారం నడుస్తుందని, అందుకే వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వాన్ని విమర్శించారు. పేద విధ్యార్థులు చదివే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవా ? సిగ్గు.. సిగ్గు అంటూ.. గురుకులాలను మూసివేసేందుకు ప్రభుత్వ కుట్ర చేస్తోందని ట్వీట్ చేశారు.

Also Read: IAS officers: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!

ఇక ఈ విమర్శలపై కాంగ్రెస్ భగ్గుమంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల విధ్యార్థులకు ఎటువంటి కష్టం రానివ్వమని, ఆ యజమానులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంది. కానీ కేటీఆర్ విమర్శలు రెచ్చగొట్టే ధోరణిలో ఉన్నాయని కాంగ్రెస్ నేతలు తెలుపుతున్నారు. కేటీఆర్ విమర్శలపై భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీ పాలన పదేళ్లు సాగిందని, అప్పుడు కనిపించని గురుకులాలు ఇప్పుడు కనిపిస్తున్నాయా అంటూ విమర్శించారు.

పదేళ్ల కాలంలో గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలన్న ఆలోచన లేక.. అన్ని జిల్లాలలో పార్టీ కార్యాలయాలు కోట్ల రూపాయలతో నిర్మించారన్నారు. ఇప్పుడు ఉన్న ప్రేమ.. నాడు ఏమయిందో అంటూ ప్రశ్నించారు. ఇలా గురుకులాల వేదికగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ మొదలైంది.

Related News

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు.. వెళ్లిపోవాల్సిందేనంటూ..

CM Revanth Reddy : మరోసారి హస్తీనాకు సీఎం రేవంత్‌రెడ్డి… ఆశావహుల్లో ఉత్కంఠ

MP Aravind: బీఆర్ఎస్‌కు పట్టిన గతే.. మీకూ పడుతుంది: ఎంపీ అరవింద్

Delhi Congress Committee: ఇద్దరు మంత్రులకు కీలక భాద్యతలు అప్పగించిన అధిష్టానం.. కారణం అదేనా.. మరేదైనా ఉందా ?

Minister Ponnam: అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం.. జాగ్రత్త: మంత్రి పొన్నం

Minister Seethakka: దామగుండం ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవో ఇచ్చింది: మంత్రి సీతక్క

CM Revanth Reddy: దేశ రక్షణకు అన్ని విధాలా సహకరిస్తా.. ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను.. సీఎం రేవంత్

Big Stories

×