EPAPER

Viswam: నిండా ముంచేసిన గోపీచంద్ విశ్వం.. బయ్యర్స్ కి భారీ నష్టం..!

Viswam: నిండా ముంచేసిన గోపీచంద్ విశ్వం.. బయ్యర్స్ కి భారీ నష్టం..!

Viswam.. మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichandh) హీరోగా ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల (Srinuvaitla) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం విశ్వం (Viswam)దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమాలో కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటుడు వీ.కే.నరేష్, వెన్నెల కిషోర్ వంటి స్టార్ కాస్ట్ ఇందులో భాగమైన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ తో చేతులు కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇకపోతే గోపీచంద్ గత చిత్రం భీమా మాస్ సెంటర్స్ లో బాగానే ఆడింది. కానీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోని మాస్ సెంటర్లో బాగా ఆడిన విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న బయ్యర్స్ కి విశ్వం పై నమ్మకం కలిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే విడుదలైన మొదటి రోజు విశ్వం సినిమా పరవాలేదు అనిపించుకున్నా ఆ తర్వాత కలెక్షన్లు పూర్తిగా నిరాశ మిగిల్చాయి.


సేవ్ అయిన పీపుల్స్ మీడియా.. బయ్యర్స్ కి తప్పని నష్టం..

ముఖ్యంగా ఈ సినిమా కొన్న బయ్యర్స్ కి నష్టం మిగిలిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే.. సినిమా తీద్దామని చిత్రాలయం స్టూడియో అనుకున్నప్పుడు చిత్రం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచించిన చిత్రాలయం స్టూడియో అధినేత ధోనేపూడి వేణు, ప్రభాకర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో చేతులు కలిపారు. అయితే అప్పటికే ఇండస్ట్రీలో పెద్ద నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ శాటిలైట్ హక్కులను మాత్రమే దక్కించుకుంటానని చెప్పి సినిమాను నిర్మించారు. వాస్తవానికి ఏ సినిమాకైనా సరే శాటిలైట్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి అంటే కచ్చితంగా సినిమా సేవ్ అయినట్టే. ఈ నేపథ్యంలోనే శాటిలైట్ హక్కులను దక్కించుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పుడు సేవ్ అయ్యింది.కానీ చిత్రాలయం స్టూడియో మాత్రం నిండా మునిగిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.


రూ.9 కోట్లకు కొంటే రూ.5 కోట్లే వచ్చింది..

ముఖ్యంగా ఈ సినిమాను ఆంధ్ర ,తెలంగాణలో రూ.9 కోట్లకు ప్రముఖ బయ్యర్ చదలవాడ శ్రీనివాసరావు కొనుగోలు చేశారు. సీడెడ్ రూ .5కోట్లకు, (ఆంధ్రలో అన్ని ప్రాంతాలకు కలిపి రూ. 5 కోట్లు), నైజాం ఏరియాలో రూ.4కోట్లకు అమ్ముడుపోయింది ఈ సినిమా. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలను కలుపుకొని కేవలం రూ .5కోట్లు మాత్రమే రావడంతో రూ .4కోట్ల రూపాయల మేర చదలవాడ శ్రీనివాసరావు నష్టపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గోపీచంద్ ను నమ్ముకొని సినిమాను కొన్న బయ్యర్స్ కి ఇప్పుడు నష్టాలు రావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పవచ్చు.

నిండా మునిగిపోయిన బయ్యర్ చదలవాడ శ్రీనివాసరావు..

ప్రముఖ బయ్యర్ చదలవాడ శ్రీనివాసరావు విషయానికి వస్తే.. నటుడిగా, డైరెక్టర్ గా , ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మంచి పేరు దక్కించుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య చిత్రానికి దర్శకత్వం వహించిన చదలవాడ శ్రీనివాసరావు.. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి నగ్నసత్యం వంటి చిత్రాలను నిర్మించారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసిన ఈయనకు భారీ స్థాయిలో నష్టం రావడంతో నిండా మునిగిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి తెలివిగా ఆలోచించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సేవ్ అయింది. మరి చిత్రాలయం స్టూడియో బ్యానర్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాపై విశ్వాసంతో హక్కులను కొన్న చదలవాడ శ్రీనివాసరావుకి మాత్రం నష్టాలు తప్పలేదని సమాచారం.

Related News

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

Viswam Collections : హీరోగా బుట్ట సర్దే టైమ్ వచ్చింది… విశ్వం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంతంటే…?

Prasanth Varma : ఇదేం స్వార్థం ప్రశాంత్ గారు… మీ కథ అయినంత మాత్రాన మీరే డబ్బులు పెట్టాలా..?

Nithiin: మళ్లీ ఆ దర్శకుడినే నమ్ముకున్న నితిన్.. హిస్టరీ రిపీట్ అయ్యేనా?

Diwali 2024: దీపావళి బరిలో టైర్ -2 హీరోలు.. టఫ్ ఫైట్ షురూ..!

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Big Stories

×