EPAPER

Heavy Rains To AP: వానొచ్చేనంటే.. వరదొస్తది, ఏపీకి భారీ వర్ష సూచన.. కేబినెట్ భేటీ రద్దు?

Heavy Rains To AP: వానొచ్చేనంటే.. వరదొస్తది, ఏపీకి భారీ వర్ష సూచన.. కేబినెట్ భేటీ రద్దు?

Heavy Rains To AP: ఏపీకి మరో తుపాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.


ముఖ్యంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీగా వర్షాలు పడనున్నాయి. మరికొన్ని చోట్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నది వాతావరణ శాఖ మాట. ముఖ్యంగా పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకారం నెల్లూరుతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండనుంది.

మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటలకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని, ఈ క్రమంలో మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేసింది.


వాతావరణ శాఖ వార్నింగ్ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మంగళవారం, బుధవారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు అధికారులు సెలవు ప్రకటించారు. పరిస్థితి గమనించిన ప్రైవేటు విద్యా సంస్థలు సైతం సెలవు ప్రకటించాయి.

ALSO READ: అదృష్టం అనుకొనే లోపే అదృశ్యం.. మద్యం షాప్ దక్కించుకున్న వ్యక్తి జాడ ఎక్కడ ? పోలీసులకు భార్య ఫిర్యాదు

వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో బుధవారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాల వర్షాల నేపథ్యంలో పలువురు మంత్రులు జిల్లాలకు పరిమితమయ్యారు. ఈ మేరకు కేబినెట్ సమావేశం వాయిదా పడే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అల్పపీడనం ప్రభావం తెలంగాణపై పడింది. ఆకాశం నల్ల మబ్బులు కమ్ముకుని మేఘావృతమైంది. కొన్ని చోట్లు చినుకులు, మరికొన్ని చోట్లు తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది.

మరోవైపు తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దక్షిణ తమిళనాడులో ఎగతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తు న్నాయి. పరిస్థితి గమనించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ అర్థరాత్రి పల్లికరణై, ఎస్ కొలత్తూరు, కీలక్ కట్టలై, నారాయణపురం ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు.

 

Related News

New Industrial Policy: ఏపీ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానం, కేబినెట్ ఆమోదం తర్వాత..

Lookout Notices To YCP Leaders: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో సజ్జలకు కష్టాలు.. అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, ఎందుకు?

AP Liquor Policy: అదృష్టం అనుకొనే లోపే అదృశ్యం.. మద్యం షాప్ దక్కించుకున్న వ్యక్తి జాడ ఎక్కడ ? పోలీసులకు భార్య ఫిర్యాదు

Tirumala: భారీ వర్షాలకు తిరుమల వెళ్తున్నారా.. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి.. ఆ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

Big Stories

×