EPAPER

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Viswam OTT : సడెన్ గా ఓటీటీలోకి గోపిచంద్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Viswam OTT : టాలీవుడ్ మాస్ హీరో, మ్యాచో స్టార్ గోపీచంద్ నటించిన రీసెంట్ మూవీ విశ్వం.. శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో, బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చేసింది. హీరో గోపిచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల, ఇద్దరూ ఫ్లాప్ ఫేస్ లో ఉన్నారు. గోపీచంద్ కి ఈమధ్య కాలం లో ఒకటి రెండు పర్వాలేదు అని అనిపించే సినిమాలు పడ్డాయి కానీ, శ్రీను వైట్ల హిట్ సినిమాని తీసి పదేళ్లు దాటింది. ఎన్టీఆర్ బాద్షా సినిమా తర్వాత మరో సినిమా చెయ్యలేదు. ఇప్పుడు వచ్చిన ఈ మూవీ తో శ్రీను వైట్ల కమ్ బ్యాక్ ఇచ్చినట్లే కనిపిస్తున్నాడు.. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ గురించి మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది..


డైరెక్టర్ శ్రీను వైట్ల ఎన్టీఆర్ తో చేసిన ‘బాద్ షా’ చిత్రం తర్వాత ఆయన కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. 2018 లో రవితేజ తో ఆయన తీసిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.. ఆ తర్వాత సినిమాలు చెయ్యలేదు. భారీ గ్యాప్ తీసుకొని విశ్వం చిత్రం తో మన ముందుకు వచ్చాడు. రొటీన్ చిత్రం అనిపించినప్పటికీ, కామెడీ వర్కౌట్ అవ్వడంతో దసరా హాలిడేస్ వరకు నెట్టుకొచ్చింది.. దసరా పండగ గోపి చంద్ కు వర్కౌట్ అయ్యింది. ఇక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కు భారీగానే రాబట్టిందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఓటీటీ పై ఓ వార్త వినిపిస్తుంది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గోపీచంద్ హిందీ డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి, అందుకే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా భారీ రేట్ కి కొనుగోలు చేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ మూవీని దీపావళీ కానుకగా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు తీసుకురావాలని కానీ అక్టోబర్ 29 , లేదా నవంబర్ 3 వ తారీఖున ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. అయితే సినిమా థియేటర్స్ లో విడుదలై వారం రోజులు కూడా పూర్తి కాకముందే ఓటీటీ విడుదల తేదీ లీక్ అవ్వడం వల్ల సినిమా థియేట్రికల్ రన్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవల విడుదల అవుతున్న ప్రతి సినిమాకు ఇది కామన్ అయిపొయింది. పెద్దగా ప్రభావం ఏమి చూపడం లేదు కాబట్టి ఓటీటీ తేదీ లీక్ అయినా ప్రమాదం లేదని నిర్మాతలు భావిస్తున్నారట. వరుస ఫ్లాప్స్ తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఇక మొన్న వచ్చిన స్వాగ్ మూవీ కూడా మంచి లాభాలను అందుకుంది. ఈ ఏడాది మరో మూడు సినిమాలు ఈ నిర్మాణ సంస్థ నుంచి విడుదల కాబోతున్నాయి..

Related News

Shraddha Kapoor: పెళ్లిపై ఊహించని కామెంట్స్ చేసిన ప్రభాస్ బ్యూటీ.. గంతకు తగ్గ బొంతే..!

Sandeep Reddy Vanga With RGV : రెండు సినిమా పిచ్చి ఉన్న జంతువులు, అనిమల్ పార్కులో కలిసాయి

Aadhi Sai Kumar: కెరియర్ లో ఉన్నది ఒకటే హిట్ సినిమా, అదే మళ్లీ రీ రిలీజ్

Ram Charan: నేను నా ప్రొడ్యూసర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి నా సినిమా పోస్టర్స్ మీద కలెక్షన్స్ వేయకండి

Kanguva Runtime: కంగువ రన్ టైం రీవిల్ చేసిన దర్శకుడు, అదే ప్లస్ అవ్వనుందా.?

Pushpa 2 First Review: ‘పుష్ప 2’ రివ్యూ.. యాక్షన్ సీన్స్ లో అల్లు అర్జున్ అదరగొట్టాడు.. నీయవ్వ తగ్గేదేలే..

Big Stories

×