EPAPER

Gaddar Awards: మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించాలి, గద్దర్ అవార్డుల భేటీలో భట్టి కీలక వ్యాఖ్యలు

Gaddar Awards: మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించాలి, గద్దర్ అవార్డుల భేటీలో భట్టి కీలక వ్యాఖ్యలు

Gaddar Awards Committee Meet: తెలుగు సినీ పరిశ్రమను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గౌరవంగా చూస్తుందని డిప్యూటీ సీఎం ల్లు భట్టి విక్రమార్క అన్నారు. మన సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. సినీ పరిశ్రమకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో చెప్పాలని కోరినట్లు వెల్లడించారు.


గత ప్రభుత్వం సినీ అవార్డులను పట్టించుకోలేదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల వేడుకను ఓ పండుగలా నిర్వహించేవారని భట్టి విక్రమార్క్ తెలిపారు.  రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఎందుకో ఈ అంశాన్ని పట్టించుకోలేదన్నారు. “తెలంగాణ అంటేనే సాంస్కృతిక జీవనం. తెలంగాణ అంటేనే ఆట, పాట. ఇక్కడ బాధ వచ్చినా సంతోషం వచ్చినా పాట ద్వారానే వ్యక్త పరుస్తారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. అందర్నీ అక్కున చేర్చుకొని, ప్రేమించే సంస్కృతి మన రాష్ట్రంలో ఉంది. అసమానతలు, వైరుధ్యాల నేపథ్యంలో ప్రజలు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నారు “ అని వివరించారు.


తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపం

ప్రజా గాయకుడు గద్దర్ మహోన్నత వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపించారు భట్టి విక్రమార్క. “’పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా..’ అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజా యుద్ధనౌక గద్దర్. గద్దర్ ఒక లెజెండ్. ఈ శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి పుడతారని నేను అనుకోవడం లేదు. ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించాలని తెలిపారు. తెలంగాణ ఆట, పాటను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్. తెలంగాణ మొత్తానికి గద్దర్ ప్రతిరూపం. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నిట్లో గద్దర్ తనదైన ముద్ర వేశారు” అని చెప్పుకొచ్చారు.

గద్దర్ పేరుతో సినిమా అవార్డులు

తెలంగాణ ప్రభుత్వం అన్ని అంశాలను పరిశీలించే గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని భట్టి విక్రమార్క్ తెలిపారు. “సినీ పరిశ్రమలోని అందర్నీ గౌరవించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి. ఎప్పుడు జరపాలనేది కమిటీ నిర్ణయించాలి. కొద్దిరోజుల్లోనే కమిటీ మరో మారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి” అని డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులకు సూచించారు.

స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్టు పెట్టండి!  

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్ స్కిల్స్ నేర్పించేందుకు ప్రత్యేక కోర్స్ ఏర్పాటు చేయాలని గద్దర్ అవార్డు కమిటీ సభ్యులు కోరారు. అన్ని అంశాలు పరిశీలించి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీలో యాక్టింగ్, కల్చర్ కు సంబంధించిన అంశాలకు చోటు కల్పించడంపై నిర్ణయం తీసుకుంటామని భట్టితెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు,  అవార్డుల కమిటీ చైర్మన్ బి. నర్సింగ్ రావు, వైస్ చైర్మన్ దిల్ రాజు, సలహా మండలి సభ్యులు తమ్మారెడ్డి భరద్వాజ, గుమ్మడి వెన్నెల, తనికెళ్ళ భరణి, డి. సురేష్ బాబు, వందేమాతరం శ్రీనివాస్, అల్లాణి శ్రీధర్, సానా యాది రెడ్డి, హరీష్ శంకర్, గుమ్మడి విమల సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్, రాష్ట్ర  ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి హనుమంత రావు,  ఏక్సిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాబు పాల్గొన్నారు.

Read Also: కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా

Related News

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

Kishan Reddy: ఆలయంపై దాడి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

Telangana Caste Census : కులగణనకు లైన్ క్లియర్.. జనవరిలో స్థానిక ఎన్నికలకు పచ్చజెండా

TPCC President Mahesh Goud : పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆపలేరు : మహేశ్ కుమార్ గౌడ్

Sahiti Infra Case: సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఈడీ దూకుడు.. ఉక్కిరిబిక్కిరవుతున్న లక్ష్మినారాయణ

Big Stories

×