EPAPER

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Jani Master.. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కు బెయిల్ పిటీషన్ విషయంలో పెద్ద షాక్ ఎదురైందని చెప్పవచ్చు. జానీ మాస్టర్ కు బెయిల్ ఇవ్వడానికి పోక్సో కోర్టు తాజాగా నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టులో బెయిల్ కావాలని పిటీషన్ దాఖలు చేశారు జానీ మాస్టర్. అయితే ఆ బెయిల్ పిటిషన్ తాజాగా విచారణకు రాగా ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం తెలిపింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ బెయిల్ పిటీషన్ ను రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం.


జానీ మాస్టర్ కు షాక్ .. బెయిల్ రద్దు చేసిన కోర్టు..

అసలు విషయంలోకి వెళ్తే.. జూనియర్ లేడీ కొరియోగ్రాఫర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారు అని బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అంతే కాదు తాను మైనర్ గా ఉన్నప్పటి నుంచే తనపై లైంగికంగా దాడి చేశాడని , శారీరకంగా చిత్రవధకు గురి చేశాడని, తనను అత్యాచారం చేశాడు అంటూ ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో మైనర్ ను అత్యాచారం చేశాడన్న కేసులో పోక్సో చట్టం కింద జానీ మాస్టర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గత కొన్ని వారాలుగా చంచల్గూడా జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఇక ఇప్పుడు తమిళంలో తిరుచిత్రాంబళం సినిమాకి బెస్ట్ కొరియోగ్రఫీ అందించిన నేపథ్యంలో ఆయనకు జాతీయ అవార్డును ప్రకటించారు. అక్టోబర్ 18వ తేదీన జరగబోయే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరుకావాలని కోరగా, ఈ నేపథ్యంలోనే అవార్డు అందుకోవడం కోసం బెయిల్ కావాలని పిటీషన్ వేశారు. అయితే ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో పట్టుబడడంతో జాతీయ అవార్డుల కమిటీ తాత్కాలికంగా జానీ మాస్టర్ కి అవార్డు ఇవ్వకుండా ఆపివేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెయిల్ మంజూరు చేస్తారని ఆశపడ్డ కుటుంబీకులకు కూడా నిరాశ మిగిలింది. అక్కడ జాతీయ అవార్డు ఇవ్వడం ఆపివేయడంతో.. కోర్టు కూడా ఈయన బెయిల్ క్యాన్సిల్ చేసినట్లు సమాచారం.


తల్లి కన్నీటిని చూసిన కోర్టు కనికరించలేదా..

ఇక ఈ విషయం తెలిసి ఆయన తల్లి , భార్య సుమలత దేవి తీవ్ర మనోవేదనకు గురి అవుతున్నారు. ఈ విషయంపై ఆమె మీడియా ముందు మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు గురించి, కేసు గురించి వచ్చినట్టు వార్తలు రాస్తున్నారు.. అసలు నిజాలు నిర్ధారణ అవ్వకుండా , ఆరోపణల వెనుక వున్న అసలు ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా కోర్టులో విచారణ జరుగుతుండగా తన కొడుకు గురించి ఎవరికి తోచింది వారు రాస్తూ.. చూపిస్తూ.. వినిపిస్తూ ఉండడంతో జానీ మాస్టర్ అమ్మగారు తీవ్ర మనస్థాపం చెంది, గుండెపోటు కారణంగా ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది. అందరికీ కుటుంబాలు ఉంటాయి కదా.. ఈ పాపం ఊరికే పోదు అసలు విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి.. అంటూ మనోవేదన వ్యక్తం చేసింది. ఇకపోతే కన్న కొడుకుపై ప్రేమ పెంచుకున్న తల్లికి ఇప్పుడు మరో దెబ్బ తగిలిందనే చెప్పాలి. కొడుకు బయటకు వస్తాడు అని ఆశించిన ఆ తల్లికి కన్నీరే మిగిలింది. కనీసం ఆ తల్లి కన్నీరు చూసైన కోర్టు ఎందుకు కనుకరించలేదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా జానీ మాస్టర్ కి బెయిల్ రద్దు చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Anant Ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ డాక్యుమెంటరీ వచ్చేసింది.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

Nara Rohith – sirisha : నారా రోహిత్ కు కాబోయే భార్య ఆ కమెడియన్ డైరెక్షన్ లో నటించారా?

Devi Sri Prasad: ఫ్యాన్స్ అనిరుద్ కావాలి అనడంపై దేవిశ్రీప్రసాద్ రియాక్షన్

KE Gnanavel: ఎన్‌టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన తమిళ నిర్మాత.. ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’పై కామెంట్స్

Tamil Film Industry: చిన్న తెలుగు సినిమా కి థియేటర్స్ ఇవ్వలేం అని చేతులు ఎత్తేస్తున్నారు

Bollywood : బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Big Stories

×