EPAPER

Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

Pawan Kalyan: పవన్ పై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్.. రేపే విచారణ.. అంతా సస్పెన్స్

Pawan Kalyan: తిరుమల లడ్డు వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారా లేదా అన్నది నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ తన పని తాను చేసుకొని పోతోంది. అయితే తాజాగా ఈ లడ్డు వ్యవహారం షాక్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తగిలిందని చెప్పవచ్చు. అదెలాగంటే తిరుపతి వారాహి సభ వేదికగా పవన్ చేసిన వ్యాఖ్యల ఎఫెక్ట్ ఇది.


తిరుమల లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయం నుండి యావత్ భారత్.. ఆ విషయానికి సంబంధించిన ప్రతి వార్తపై దృష్టి సారించింది. దీనికి ప్రధాన కారణం నిరంతరం కోట్లాది మంది భక్తులు.. తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుంటారు. అందులో తిరుమల లడ్డును ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు భక్తులు.

అటువంటి లడ్డులో కల్తీ నెయ్యి కలిసిందంటూ రాజకీయ ఆరోపణలు వెలుగులోకి రాగా.. కూటమి వర్సెస్ వైసీపీ లక్ష్యంగా విమర్శలు సైతం సాగాయి. ఆ విమర్శలతో వైసీపీ నేతలు.. అత్యున్నత నాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీ అధ్వర్యంలో విచారణ సాగించాలని ఆదేశించింది. అలాగే రాజకీయ విమర్శల కోసం.. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు అంటూ పార్టీలకు సూచించింది.


ఆ సమయంలో డిప్యూటీ సీఎం పవన్ ప్రాయాశ్చిత్త దీక్ష చేపట్టి.. తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించి దీక్ష విరమించారు. అంతటితో ఆగక తిరుపతిలో వారాహి బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభ సాక్షిగా పవన్.. వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తూ చేసిన ప్రసంగం కొంత చిక్కులు తెచ్చిన పరిస్థితి పవన్ కు ఎదురైందని పొలిటికల్ హాట్ టాపిక్. ఈ సభలో పవన్ చేసిన ప్రసంగంపై తాజాగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో న్యాయవాది ఇమ్మనేని రామారావు పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది.

Also Read: YS Sharmila: అసలు రాజకీయం ఇప్పుడే స్టార్ట్ చేసిన షర్మిళ.. టార్గెట్ తగిలేనా.. మిస్ అయ్యేనా ?

పిటీషనర్ ఏమి తెలిపారంటే.. తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏ శాస్త్రీయతమైన ఆధారాలు లేకుండా తిరుపతి లడ్డుల్లో కల్తీ నెయ్యి కలిసిందని పవన్ వాఖ్యానించారని, డిప్యూటీ సిఎం హోదాలో భాద్యత మరిచి పవన్ కళ్యాణ్ వాఖ్యలు చేశారన్నారు.

ఇంటర్నెట్ లో ఉన్న పవన్ వీడియోలు డిలీట్ చేసేలా ఆదేశించాలని, డిప్యూటీ సిఎం హోదాలో పవన్ చేసిన వాఖ్యలను సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని పిటీషన్ లో పేర్కొన్నారు. మరో సారి తిరుపతి ప్రసాదంపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. మరి రేపు ఈ పిటీషన్ విచారణకు రానుండగా.. న్యాయస్థానం ఏమి చెప్పనుందన్నది ఇప్పుడు సస్పెన్స్ గా ఉందని చెప్పవచ్చు.

Related News

AP Liquor Policy: అదృష్టం అనుకొనే లోపే అదృశ్యం.. మద్యం షాప్ దక్కించుకున్న వ్యక్తి జాడ ఎక్కడ ? పోలీసులకు భార్య ఫిర్యాదు

Tirumala: భారీ వర్షాలకు తిరుమల వెళ్తున్నారా.. జస్ట్ ఒక్క నిమిషం ఆగండి.. ఆ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ

Prakasam Crime news: హమ్మా.. చోరీ చేసి ఎంచక్కా కొండెక్కాడు.. ఆ తర్వాత జరిగింది తెలుసుకోవాల్సిందే!

AP Liquor Policy: జాక్ పాట్ కొట్టిన మహిళలు.. లాటరీలో వారిదే హవా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని దక్కాయంటే.. ?

IAS PETITIONS IN CAT : క్యాట్​కు వెళ్లిన ఐఏఎస్​లు… ఏపీలోనే ఉంటానంటున్న సృజన, తెలంగాణ కావాలంటున్న ఆమ్రపాలి

CM Chandrababu: ఏపీలో మళ్లీ వర్షాలు…! జనాల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు…

Big Stories

×