EPAPER

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Sankranti 2025.. మరో రెండు నెలలలో తెలుగు చిత్ర పరిశ్రమకు కాసులు కురిపించే సీజన్ సంక్రాంతి రాబోతోంది. కరోనా సమయంలో కూడా సంక్రాంతి సీజన్ కి విడుదలైన సినిమాలు కనీవినీ ఎరుగని రీతిలో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా నిర్మాతలకు లాభాల పంట పండించాయి. అందుకే ఈసారి కూడా చాలా పెద్ద పెద్ద హీరోలు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్నారు. ఇక ఈసారి సంక్రాంతి సీజన్ కి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ కనిపించనుంది అని సమాచారం. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ ఒకవైపు, మరొకవైపు బాలయ్య ఇంకొక వైపు అజిత్ ఇలా చాలామంది హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ చేశారు. ఇటీవలే సంక్రాంతి బరి నుంచి చిరంజీవి తప్పుకోవడంతో ఆస్థానాన్ని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో భర్తీ చేయబోతున్నారు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి బరిలోకి దిగబోతున్న చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


వచ్చేయడాది సంక్రాంతి బరిలో మొత్తం ఆరు సినిమాలు రంగంకి సిద్ధం చేసుకుంటున్నాయి. మొదటి నుంచి అనుకుంటున్నట్టుగానే చిరంజీవి పోటీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు సంక్రాంతి సమీకరణలు కూడా మారిపోయాయి. ఇప్పుడు సంక్రాంతి బరిలోకి సిద్ధమవుతున్న సినిమాల లిస్ట్ విషయానికి వస్తే..

గేమ్ ఛేంజర్..


ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత ప్రకటించారు. మూడేళ్ల నుంచి నిర్మాణంలో ఉంటూ విపరీతమైన అంచనాలు క్రియేట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది.

సర్కార్ సీతారాం..

నటసింహా నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎన్.బి.కె 109. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఎన్బికె 109 అనే వర్కింగ్ టైటిల్ తో ట్రెండింగ్ లో ఉన్న ఈ చిత్రానికి మేకర్స్ రెండు టైటిల్స్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా డాకూ మహారాజా, సర్కార్ సీతారాం అనే రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి పెట్టాలని చూస్తున్నారట. మాక్సిమం సర్కార్ సీతారాం అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది.

సంక్రాంతికి వస్తున్నా..

విక్టరీ వెంకటేష్ , యువ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 సినిమాలు వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. ఈ రెండింటిని ప్రతిష్టాత్మక సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతోంది. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. క్రైమ్ డ్రామాగా సినిమా రాబోతోంది. ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది.

మజాకా..

యంగ్ హీరో సందీప్ కిషన్ , దర్శకుడు త్రినాధ రావు నక్కిన కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఇది. ఫస్ట్ లుక్ లో సందీప్ కిషన్ పెళ్లికొడుకు గెటప్ లో కనిపించాడు. అతడు చుట్టూ పెళ్లి హడావిడి కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్ , హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమా జనవరి 14వ తేదీన విడుదల కాబోతోంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ..

ప్రముఖ కోలీవుడ్ హీరో అజిత్ , మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమా కూడా తెలుగు , తమిళ్ ద్విభాషా చిత్రంగా సంక్రాంతికి విడుదల కాబోతోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగుతోంది.

వీటితోపాటు సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రం కూడా సంక్రాంతి బరిలో దిగబోతోందని సమాచారం.

Related News

KE Gnanavel: ఎన్‌టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన తమిళ నిర్మాత.. ‘కల్కి 2898 ఏడీ’, ‘దేవర’పై కామెంట్స్

Tamil Film Industry: చిన్న తెలుగు సినిమా కి థియేటర్స్ ఇవ్వలేం అని చేతులు ఎత్తేస్తున్నారు

Bollywood : బిగ్ బ్రేకింగ్.. బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత..

Mahendragiri Vaarahi: సంక్రాంతి బరిలోకి సుమంత్ మూవీ.. అందరిని పిచ్చోళ్లను చేసేలా నిర్మాత మాస్టర్ ప్లాన్…?

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Big Stories

×