EPAPER

Ram Gopal Varma : సల్మాన్ వివాదం, సిద్ధిఖీ హత్యపై సినిమా తీస్తే… ఆర్జీవీ పోస్ట్ వైరల్

Ram Gopal Varma : సల్మాన్ వివాదం, సిద్ధిఖీ హత్యపై సినిమా తీస్తే… ఆర్జీవీ పోస్ట్ వైరల్

Ram Gopal Varma : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను అప్పుడెప్పుడో చేసిన తప్పు ఇంకా వెంటాడుతోంది. కృష్ణ జింకను వేటాడిన వివాదంలో చిక్కుకున్న ఈ హీరోను లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ కూడా వదలట్లేదు. రీసెంట్ గా ఆయన ఇంటి బయట కాల్పులు జరిపి చంపేస్తామని హెచ్చరించిన లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ తాజాగా సల్మాన్ ఖాన్ కు సన్నిహితుడైన ఎన్సిపి నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని శనివారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు భారీగా భద్రతను పెంచారు. సల్మాన్ తో పాటు అతని తల్లిదండ్రులు నివసించే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ బయట దాదాపు అరడజను మంది పోలీసులు కాపలా కాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వివాదంపై ఆర్జీవి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.


సల్మాన్ వివాదం పై రామ్ గోపాల్ వర్మ ట్వీట్
‘గ్యాంగ్‌స్టర్‌గా మారిన ఒక న్యాయవాది ఒక సూపర్ స్టార్‌ని చంపడం ద్వారా జింక మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాడు. వార్నింగ్‌గా తన గ్యాంగ్ ఆఫ్ 700కి ఆజ్ఞాపించాడు. అతను మొదట స్టార్‌కి సన్నిహితుడైన ఒక పెద్ద రాజకీయవేత్తను చంపమని ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్నాడు. అతను జైలులో ప్రభుత్వ రక్షణలో ఉన్నందున, అతని ప్రతినిధి విదేశాల నుండి మాట్లాడుతున్నందున పోలీసులు అతన్ని పట్టుకోలేరు. ఒక బాలీవుడ్ రచయిత ఇలాంటి కథతో వస్తే నమ్మశక్యం కాని, హాస్యాస్పదమైన కథ రాసినందుకు అతన్ని కొట్టేస్తారు. 1998లో జింక చంపబడినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం 5 సంవత్సరాల పిల్లవాడు. బిష్ణోయ్ తన పగను 25 సంవత్సరాలు కొనసాగించాడు. ఇప్పుడు 30 సంవత్సరాల వయస్సులో సల్మాన్‌ను చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడమే తన జీవిత లక్ష్యం అని చెప్పాడు. జంతు ప్రేమ ఉచ్ఛస్థితిలో ఉందా ? లేదా దేవుడు విచిత్రమైన జోక్ ఆడుతున్నాడా?’ అంటూ ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించారు.

వివాదం ఏంటంటే?
1998లో సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడిన కేసు దుమారం రేపిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ టార్గెట్ చేసిన ప్రముఖుల లిస్టులో సల్మాన్ ఖాన్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పటికే ఆయనకు పలుమార్లు హత్య బెదిరింపులు ఎదురయ్యాయి. అందులో భాగంగానే బాంద్రాలో గెలాక్సీ అపార్ట్మెంట్ బయట కాల్పులు జరిగాయి. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ కు సహాయం చేసే వారి ఖాతాలను సరి చేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించింది. అయితే ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడైన సిద్ధిఖీని హత్య చేశారు. దసరా సందర్భంగా బాంద్రా లోని సిద్ధికి కుమారుడు, ఎమ్మెల్యే శశాంక్ సిద్ధికి కార్యాలయం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టపాకులు కాలుస్తుండగా మొహానికి క్లాత్ కట్టుకొని వచ్చి తుపాకులతో ముగ్గురు దుండగులు కాల్పులు జరిపారు. ఇక తామే ఈ హత్య చేసినట్టు ఇప్పటికే లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ ప్రకటించింది. అయితే తమకు ఎవరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం లేదని, కానీ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు పెట్టుకునే వారిని, సల్మాన్ ఖాన్ కు సహాయం చేసే వారిని టార్గెట్ చేస్తామంటూ ఫేస్బుక్ లో హెచ్చరించారు.

Related News

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Big Stories

×