EPAPER

Lawrence Bishnoi Salman Khan: సల్మాన్ ఖాన్‌తో స్నేహం వల్లే బాబా సిద్ధిఖ్ హత్య? గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయి ఎందుకు చేస్తున్నాడు?

Lawrence Bishnoi Salman Khan: సల్మాన్ ఖాన్‌తో స్నేహం వల్లే బాబా సిద్ధిఖ్ హత్య? గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయి ఎందుకు చేస్తున్నాడు?

Lawrence Bishnoi Salman Khan| ముంబైకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖ్ హత్య రెండు రోజుల క్రితం జరిగింది. ఈ హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ హస్తం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ హత్యకు గల కారణాల గురించి జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.


బాబా సిద్దిఖ్ హత్యకు ప్రధాన కారణం బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తో ఆయన స్నేహమే అని ప్రచారం జరుగుతోంది. కానీ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి ప్రస్తుతం గుజరాత్ లోని సాబర్ మతి జైల్లో ఉన్నాడు. డజన్ల కొద్దీ మర్డర్ కేసులు, కిడ్నాప్ కేసుల్లో అతడిపై విచారణ జరుగుతోంది. జైల్లో ఉన్నా ఈ కుర్ర మాఫియా డాన్ అనుకన్నది కనుసైగలతో సాధిస్తున్నాడు. లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ ని అతని ముగ్గురు అనుచరులు అన్మోల్ బిష్నోయి (సోదరుడు), గోల్డీ బ్రార్, రోహిత్ గోదార్ నడుపుతున్నారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి జైల్లో ఉంటూనే వేగంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడని ఎన్ఐఏ తన రిపోర్ట్ లో తెలిపింది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్నోయి కి.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంలా పవర్ ఫుల్ గ్యాంగ్ ఉందని ఈ రిపోర్ట్ లో పేర్కొంది.

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
ఏప్రిల్ 2024లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ సభ్యలు ప్రయత్నించారు. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు ఓసారి వచ్చి తుపాకీ కాల్పులు జరిపారు. మరోసారి రోడ్డుపై బైకు మీద వెళ్తూ.. సల్మాన్ ఖాన్ ఇంటిపైనే రైఫిల్ తుపాకులతో కాల్పులు చేశారు. అప్పటి నుంచి ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టూ కట్టు దిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.


అయితే 2022లోనే సల్మాన్ ఖాన్ ని హత్య చేసేందుకు సంపత్ నెహ్రా అనే గ్యాంగ్ స్టర్ ని లారెన్స్ బిష్నోయి పంపించాడని కానీ ఆ సమయంలో ప్లాన్ విఫలమైందని తెలిసింది. ఆ తరువాత 2023లో సల్మాన్ ఖాన్ మేనేజర్ కు లారెన్స్ బిష్నోయి ఒక ఈమెయిల్ పంపించాడు. తన సామాజిక వర్గానికి సల్మాన్ ఖాన్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకపోతే అతని చంపుతానని ఈ-మెయిల్ పంపించాడు. ఆ ఈ మెయిల్ ని సల్మాన్ మేనేజర్ ఆ సమయంలో మీడియాకు చూపించాడు.

Also Read: బాబా సిద్దిక్ హత్య కేసులో మూడో నిందితుడు అరెస్ట్.. ‘షూటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఇతనే’

అసలు ఒక సినిమా నటుడు అయిన సల్మాన్ ఖాన్ కు ఒక గ్యాంగ్ స్టర్ కు మధ్య శత్రుత్వం ఏమిటి? అనే ప్రశ్న ప్రధానంగా మారింది. దీనికి సమాధానం 1999వ సంవత్సరంలో జరిగిన ఓ సంఘటన.

1999లో సల్మాన్ ఖాన్ ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా విడుదలైంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం రాజస్థాన్ లో జరిగింది. షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్, తన సహనటులతో కలిసి అక్కడి అడవుల్లో లభించే ప్రత్యేకమైన బ్లాక్ బక్ జింకలను వేటాడాడు. జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ ఆ తరువాత కేసు కూడా ఎదుర్కొన్నాడు. కానీ ఇంతవరకు సల్మాన్ ఖాన్ కు జైలు శిక్ష పడలేదు.

Lawrence Bishnoi being produced in a local court in Punjab's Bathinda in 2022. (Photo: PTI)

అయితే ఇక్కడ జింకలకు సంబంధించిన మరో అంశం ఉంది. ఆ బ్లాక్ బక్ జింకలను బిష్నోయి సామాజిక వర్గం తమ కులదైవానికి ప్రతీకగా పూజిస్తుంది. జింకలను పవిత్ర జంతువులుగా ఆరాధిస్తుంది. అలాంటి పవిత్ర జింకలను సల్మాన్ ఖాన్ వేటాడి చంపాడని బిష్నోయి సామాజిక వర్గంలో బాలీవుడ్ సూపర్ స్టార్ పట్ల కోపం ఉంది. ఆ సమయంలో మాజీ ఎంపీ జశ్వంత్ సింగ్ బిష్నోయి కూడా బ్లాక్ బక్ జింకలు తమ సామాజిక వర్గానికి గుర్తింపు అని చెప్పారు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని బిష్నోయి సామాజికవర్గం వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పుడు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్నోయి అదే సామాజికవర్గానికి చెందినవాడు. 2018లోనే ఒక కోర్టు కేసు విచారణ సమయంలో లారెన్స్ బిష్నోయి బహిరంగంగా సల్మాన్ ఖాన్ ను చంపుతానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ హత్యకు ప్రయత్నిస్తున్నాడని.. సల్మాన్ ఖాన్ ను రాజకీయ అండగా ఉన్న బాబా సిద్దిఖ్ ని అందుకే హత్య చేశాడని ఇప్పుడు కథనాలు వెలువడుతున్నాయి.

Related News

Uddhav Thackeray: ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే

Jharkhand Maharashtra Elections : ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సమరం షురూ… నోటిఫికేషన్ ఎప్పుడంటే ?

Baba Siddique’s murder case: బాబా సిద్ధిఖీ హత్య కేసు, సంచలన విషయాలు.. నిందితుడు మైనర్ కాదు

Durga Pooja Violence| దుర్గామాత ఊరేగింపులో కాల్పులు.. ఒకరు మృతి, షాపులు, వాహనాలు దగ్ధం!

Baba Siddique: బాబా సిద్దిక్ హత్య కేసులో మూడో నిందితుడు అరెస్ట్.. ‘షూటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఇతనే’

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. కేంద్రం గెజిట్ రిలీజ్

Big Stories

×