EPAPER

Ram Charan: ఒకప్పుడు ఎమ్మెస్ రాజు గారిని సంక్రాంతి రాజు అనే వారు, ఇప్పుడు ఆ ప్లేస్ ని దిల్ రాజు భర్తీ చేశారు

Ram Charan: ఒకప్పుడు ఎమ్మెస్ రాజు గారిని సంక్రాంతి రాజు అనే వారు, ఇప్పుడు ఆ ప్లేస్ ని దిల్ రాజు భర్తీ చేశారు

Ram Charan: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి విజన్ ఉన్న నిర్మాతలలో ఎమ్మెస్ రాజు ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ఎమ్మెస్ రాజు నిర్మించారు. అయితే అప్పట్లో ఎమ్మెస్ రాజు నిర్మించిన సినిమాలు చాలా పెద్ద సినిమాలతో పాటుగా సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉండేవి. ఒక్కడు, వర్షం వంటి సినిమాలు కూడా పెద్ద పెద్ద సినిమాలతో పాటు అప్పట్లో రిలీజ్ అయ్యాయి. అయితే ఈ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఒకప్పుడు ఎమ్మెస్ రాజును సంక్రాంతి రాజు అనే వాళ్ళు. ఇకపోతే ప్రస్తుతం ప్రతి సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రావడం మొదలైంది.


భగవంతుడికి భక్తుడికి అంబికా దర్బార్ బత్తి అనుసంధానమైనట్టు, సంక్రాంతి సీజన్ కి దిల్ రాజుకి ఒక రకమైన అవినాభావ సంబంధం ఉంది. ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వచ్చినట్లు ప్రతి సంక్రాంతి సీజన్ కి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఒక సినిమా వస్తుంది. ఆ సినిమా కోట్లను కొల్లగొడుతుంది. ఒక సంక్రాంతి వస్తుంది అంటేనే గత కొన్ని నెలల ముందు నుంచి ఒక సినిమాను సిద్ధం చేస్తారు దిల్ రాజు. ఇక ఈ సంక్రాంతికి కూడా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాను ప్లాన్ చేశారు. కానీ ఆ సినిమా అనుకున్న టైంలో పూర్తవ్వకపోవడం వలన సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోయారు. ఇక రీసెంట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాట్లాడుతూ ఒకప్పుడు ఎమ్మెస్ రాజు గారిని సంక్రాంతి రాజు అనే వాళ్ళు. గత కొన్ని ఏళ్లుగా ఆ స్థానం ఆ పిలుపు దిల్ రాజు గారికి సొంతమైంది అంటూ చెప్పుకొచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి 2025 సంక్రాంతికి గేమ్ చేంజెర్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాను జనవరి 10న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

బేసిగ్గా ప్రతి సంక్రాంతి సీజన్ కు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ బ్యానర్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది. చాలా ఏళ్లు తర్వాత ఒక మల్టీ స్టారర్ సినిమాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అందించి, అద్భుతమైన హిట్ ను తమ ఖాతాలో వేసుకొని మరోసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మల్టీ స్టారర్ సినిమాలు వచ్చేలా తెర తీసారు. ఇద్దరు స్టార్ హీరోలను శ్రీకాంత్ అడ్డాల చాలా పద్ధతిగా డీల్ చేసి, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయి ఒక అందమైన అద్భుతమైన సినిమాను ఈ బ్యానర్ కి అందించాడు. ఈ సినిమాను ఇప్పటికి చూసినా కూడా చూడముచ్చటగా ఉంటుందని చెప్పొచ్చు. అలానే సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు ఎక్కువ స్కోప్ ఉండేలా చేస్తుంటారు దిల్ రాజు. శతమానంభవతి, ఎఫ్2, వారసుడు వంటి ఎన్నో సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేశారు. అందుకే చరణ్ చెప్పినట్టు ఎమ్మెస్ రాజు గారి స్థానాన్ని దిల్ రాజు భర్తీ చేశారని ఒప్పుకోవాల్సిందే.


Related News

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Mahendragiri Varahi: సంక్రాంతి బరిలోకి అక్కినేని హీరో.. పోటీని తట్టుకునేరా..?

Prabahs: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

Salman Khan : సల్లూ భాయ్ మాత్రమే కాదు… డేంజర్‌‌ జోన్‌లో ఉన్న బీ టౌన్ స్టార్స్ వీళ్లే

Kamal Haasan: కమల్ హాసన్ కొత్త లుక్, ఇదేంటి ఇంత మారిపోయారు.. దానికోసమేనా?

Ghatikachalam Teaser: మసూద కన్నా ఎక్కువ భయపెట్టేలా ఉందేంటి.. ?

Big Stories

×