EPAPER

Naga Vamsi: వెంకీ అట్లూరి టాలెంట్ అలాంటిది, ఇప్పటివరకు ఆ పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు

Naga Vamsi: వెంకీ అట్లూరి టాలెంట్ అలాంటిది, ఇప్పటివరకు ఆ పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు

Naga Vamsi: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో వెంకీ అట్లూరి ఒకరు. తొలిప్రేమ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వెంకి. ఈ సినిమా టైటిల్ పెట్టినప్పుడే ఈ సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదివరకే కరుణాకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కెరియర్ లో ఆ సినిమా ఒక మైలురాయి అని చెప్పాలి. ఇకపోతే అదే టైటిల్ తో వరుణ్ తేజ్ హీరోగా సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇక సినిమాను కూడా అద్భుతంగా డీల్ చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు వెంకీ. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రంగ్ దే అనే ఒక సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ ను సాధించలేకపోయింది.


వెంకీ అట్లూరి చేసిన మూడు సినిమాలు కూడా సెకండ్ హాఫ్ ఫారన్ లో జరుగుతూ ఉంటుంది. మళ్లీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సినిమాను చేస్తే రూటేడ్ గా ఉండే సినిమాను చేద్దాం అసలు సిటీ కనిపించకూడదు అని ఒక మాట చెప్పాడు నాగ వంశీ. అందుకోసమే కేవలం విలేజ్ లో జరిగే ఒక స్టోరీని క్రియేట్ చేసి ధనుష్ తో సినిమా చేశాడు. అదే సంయుక్త, ధనుష్ జంటగా నటించిన సార్. ఈ సినిమాకి జీవి ప్రకాష్ సంగీతం అందించారు. ఈ సినిమా కథను ధనుష్ కు చెప్పే ప్రాసెస్ విషయంలో సంగీత దర్శకుడు అనిరుద్ మంచి హెల్ప్ చేశారు అని నాగ వంశీ చెబుతూ వచ్చారు. నాకు తెలిసిన ఒక నిర్మాత ఉన్నారు. తను ఒక తెలుగు డైరెక్టర్ ను పంపిస్తారు కథ వినమని ధనుష్ కు చెప్పాడు అనిరుద్. మామూలుగా ధనుష్ కథవిని పంపించేద్దామని అనుకున్నారట. కానీ ఆ కథను ఫస్ట్ సిటింగ్ లోనే ఒప్పుకునేలా చేశాడు దర్శకుడు వెంకీ అట్లూరి.

అలానే ప్రస్తుతం చేస్తున్న లక్కీ భాస్కర్ సినిమా కథ కూడా సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమాలో ఎవరు టచ్ అని ఒక కొత్త పాయింట్ దర్శకుడు వెంకీ అట్లూరి టచ్ చేసినట్లు నిర్మాత నాగ వంశీ తెలిపారు. ఎవరితోనైనా ఫస్ట్ సిటింగ్ లో కదా ఒప్పించగలిగే టాలెంట్ వెంకీకి ఉంది అని నాగ వంశీ చెప్పుకొచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 31న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్ కూడా సినిమా మీద మంచి అంచనాలను పెంచాయి అని చెప్పాలి. దుల్కర్ సల్మాన్ తెలుగులో చేస్తున్న మూడవ సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ అయితే దుల్కర్ తెలుగులో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నాడని చెప్పొచ్చు.


Related News

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Mahendragiri Varahi: సంక్రాంతి బరిలోకి అక్కినేని హీరో.. పోటీని తట్టుకునేరా..?

Prabahs: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

Salman Khan : సల్లూ భాయ్ మాత్రమే కాదు… డేంజర్‌‌ జోన్‌లో ఉన్న బీ టౌన్ స్టార్స్ వీళ్లే

Kamal Haasan: కమల్ హాసన్ కొత్త లుక్, ఇదేంటి ఇంత మారిపోయారు.. దానికోసమేనా?

Big Stories

×