EPAPER

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Instagram Followers : సోషల్ మీడియా కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌దే హవా. సెలబ్రెటీలతో పాటు యువత ఎక్కువగా ఉపయోగించే ఈ యాప్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఇన్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ను పొందాలని ఎవరికి మాత్రం ఉండదు. అలా ఎక్కువ ఫాలోవర్స్ కావాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సిందే.


ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ కావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. హై క్వాలిటీ కంటెంట్ ను క్రమం తప్పకుండా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసే పోస్ట్ లలో ఎటువంచి తప్పుడు కంటెంట్ లేకుండా ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఫాలోవర్స్ ఇట్టే పెరుగుతారు.

నేమ్ –  ప్రొఫైల్ పేరు సైతం సెర్చ్ ఫ్రెండ్లీగా ఉండేలా చూసుకోవాలి. యూజర్ నేమ్‌ను ఎవరైనా సులభంగా గుర్తు పెట్టుకుని సెర్చ్ చేసేలా ఉంటే రీచింగ్ ఎక్కువగా ఉంటుంది. పర్సనల్ ఖాతా అయినప్పటికీ బిజినెస్ అకౌంట్‌గానే ఉంచాలి. ప్రైవేట్ అకౌంట్‌గా ఉంటే కంటెంట్ ను కొంత మందే చూస్తారు. ప్రొఫైల్ పిక్చర్ ను ఒరిజినల్‌ ఉంచటం వలన నమ్మకం పెరుగుతుంది.


రీల్స్ – ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ కు ఉన్న ఫాలోయింగ్ కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షార్ట్ ఫారమ్ వీడియోస్ అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇక ఎక్కువగా ఫాలోవర్స్ కావాలి అనుకునే వారు రీల్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిందే. అతి పెద్ద సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ లో కంటెంట్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఇక వీరందరినీ తట్టుకొని డిఫరెంట్ థీమ్ తో మంచి షార్ట్స్ ని అప్లోడ్ చేస్తే ఫాలోవర్స్ పెరుగుతారు.

ALSO READ : ఎయిర్టెల్ బెస్ట్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.. ట్రై చేయండి మరి

ఫేస్ బుక్ – ఫేస్ బుక్ ద్వారా Instagram ఖాతా క్రియేట్ చేస్తే ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. Instagram ఉపయోగించే Facebook స్నేహితులకు కొత్త Instagram ఖాతా గురించి తెలియటంతో కొత్త అకౌంట్ కు ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

ఫోటో షేరింగ్ – ఇన్‌స్టాగ్రామ్ ఓ ఫొటో షేరింగ్ యాప్ అనే విషయాన్ని గుర్తించాలి. ఇక్కడ ఫాలోవర్లను పెంచుకోవడానికి తప్పనిసరిగా మంచి HD ఫోటోలను పోస్ట్ చేయాలి. షేర్ చేసే ఫోటోల నాణ్యతతో పాటు స్పష్టత, ఆకర్షణ బట్టి ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

హ్యాష్‌ట్యాగ్‌ – హ్యాష్‌ట్యాగ్స్ ఉపయోగించడం మరిచిపోకూడదు. Instagram కి అప్‌లోడ్ చేస్తున్న ఫోటోతో అనుబంధానమైన హ్యాష్‌ట్యాగ్ (#)ను ఉపయోగించాలి. దీంతో ఎక్కువ మంది పోస్ట్ లను చూసే అవకాశం ఉంటుంది. ఇక సరైన, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్ ఉపయోగిస్తే వేలల్లో లైక్స్ వస్తాయి. దీంతో ఫాలోవర్స్ సైతం పెరుగుతారు.

సినిమాలు, డాన్స్, జోక్స్ వంటి ట్రెండింగ్ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఆసక్తికర కంటెంట్ తో కొత్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కు ఫాలోవర్స్ చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. పోస్ట్ కు ఎవరైనా కామెంట్ పెడితే స్పందించాలి. వారికి రిప్లై ఇవ్వటంతో సానుకూలత ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇన్టాలో ఫాలోవర్స్ పెంచుకోటానికి ఫ్రొఫైల్ ఆప్టిమైజ్ చేయటం కూడా ముఖ్యమే.

 

Related News

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Big Stories

×