EPAPER

Telugu Film Producers : ఎంతకాలం నడిపిస్తారు ఈ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ ట్రెండ్

Telugu Film Producers : ఎంతకాలం నడిపిస్తారు ఈ ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ ట్రెండ్

Telugu Film Producers : ప్రతిసారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ మొదలవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు ఒక సినిమా హిట్ అయింది అని చెప్పడానికి ఎన్ని సెంటర్స్ లో ఎన్ని డేస్ ఆడింది అని క్యాలిక్యులేట్ చేస్తూ మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం సినిమా ఎంత వసూలు చేసింది అనే దానిమీద మొత్తం డిపెండ్ అయిపోయింది. అయితే వాస్తవానికి ఒక సినిమాకి ఎంత కలెక్షన్స్ వస్తున్నాయి అని ఎవరికి క్లారిటీ లేదు. అలానే ఏ ప్రొడ్యూసర్ కూడా తనకు వచ్చిన లాభాన్ని బయటకు చెప్పుకోడు. కానీ రీసెంట్ టైమ్స్ లో డే వన్ కలెక్షన్స్ పోస్టర్ డే టు కలెక్షన్స్ పోస్టర్ ఇలా వేయటం మొదలుపెట్టారు. అయితే ఇవన్నీ కూడా ఫేక్ పోస్టర్లో అని ఈజీగా చెప్పొచ్చు. ఇక 2024లో ఇలా మూడు సినిమాలకి ఫేక్ పోస్టర్స్ వేశారు. వాటిలో సంక్రాంతి కానుకగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఒకటి.


సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండేవి. కానీ ఈ సినిమా మొదటి షో పడగానే మిశ్రమ స్పందన లభించింది. అయితే మహేష్ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఫాలోయింగ్ వలన ఈ సినిమా సేఫ్ జోన్ కి వచ్చేసింది. ఈ సినిమాకి కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేది పక్కన పెడితే, ఈ సినిమా పోస్టర్ పై మాత్రం 212 కోట్లు వచ్చినట్లు ఆల్ టైం రికార్డ్ (ఫర్ రీజినల్ ఏ ఫిలిం) అని పోస్టర్స్ వేశారు. ఇకపోతే కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన సినిమా దేవర ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా 500 కోట్లు వచ్చినట్టు పోస్టర్స్ వేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ నటించిన విశ్వం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం 20 శాతం మాత్రమే రికవరీ వస్తే రెండు రోజుల్లో ఫుల్ రికవరీ అని పోస్టర్స్ వదిలారు. ఇక నిర్మాత నాగ వంశీ కలెక్షన్స్ పోస్టర్ పై స్పందిస్తూ ఫ్యాన్స్ ను హ్యాపీ చేయటానికి కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తాం అని చెప్పుకొచ్చారు.

వాస్తవానికి ఇలా పోస్టర్స్ వేయటం వలన ఆడియన్స్ హ్యాపీగా ఉండటం పక్కన పెడితే, సినిమా నిర్మాతల మీద, సినిమా మీద ఉన్న రెస్పెక్ట్ తగ్గిపోతుంది అని చెప్పాలి. ఒక సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. చాలా మలయాళం తమిళ్ సినిమాలు కూడా ఇక్కడ మంచి కలెక్షన్స్ వసూలు చేసాయి. మంచి కాన్సెప్ట్ సినిమా ఎప్పుడు మంచి బిజినెస్ చేస్తుంది. ఇకపోతే ఈ ఫేక్ పోస్టర్స్ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుందో వేచి చూడాలి. వీటి పైన తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ, నిర్మాతల మండలి కానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ ఏడాదిలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఇక ఆ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ స్థాయిలో వేస్తారో అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Related News

Pawan Kalyan: పవన్ నోట.. బన్నీ మాట.. వారితో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు

Allu Arjun : అల్లు అర్జున్ గారు కావొచ్చునా…? ఇదేం ట్విస్ట్ డీసీఎం గారు…?

Citadel Honey Bunny: ‘సిటాడెల్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటున్న సామ్

Ram Gopal Varma : సల్మాన్ వివాదం, సిద్ధిఖీ హత్యపై సినిమా తీస్తే… ఆర్జీవీ పోస్ట్ వైరల్

Raja Saab: ఫ్యాన్స్ కి శుభవార్త.. డార్లింగ్ ఫ్యాన్స్ కోసం మరో వరల్డ్..!

Allu Arjun : నష్టాల్లో కూరుకుపోయిన దిల్ రాజును కాపాడిన బన్నీ… అదే జరగకపోయి ఉంటే…

Ram Charan: ఒకప్పుడు ఎమ్మెస్ రాజు గారిని సంక్రాంతి రాజు అనే వారు, ఇప్పుడు ఆ ప్లేస్ ని దిల్ రాజు భర్తీ చేశారు

Big Stories

×