EPAPER

Kanguva: కంగువ.. అది ప్లస్ అవుతుందా.. ? మైనస్ అవుతుందా..?

Kanguva: కంగువ.. అది ప్లస్ అవుతుందా.. ? మైనస్ అవుతుందా..?

Kanguva: కోలీవుడ్ స్టార్  హీరో సూర్య నటిస్తున్న చిత్రాల్లో ఒకటి కంగువ. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై  అటు తమిళ్ ప్రేక్షకులే కాదు.. తెలుగు ప్రేక్షకులు సైతం భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తుండగా.. అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇక ఒక కీల పాత్రలో కార్తీ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నదమ్ములు అయిన సూర్య- కార్తీ ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఎదురెదురు తలపడింది లేదు.


కంగువలో కార్తీతో సూర్య ఫైట్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా సినిమాగా అక్టోబర్ 10 న కంగువ రిలీజ్ కు సిద్దమవుతుంది. తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా ఒక భాషలో వచ్చే సినిమాను మిగతా భాషలో డబ్బింగ్ చేస్తూ ఉంటారు.

పాన్ ఇండియా సినిమా అంటే..  కొంతమంది హీరోలు అన్ని భాషల్లో వారి సొంత గాత్రాన్నే అందిస్తారు. మిగతా కీలక పాత్రల కోసం ఆ పాత్రను బట్టి తెలుగు నటీనటులతో డబ్బింగ్ చెప్పిస్తుంటారు. కానీ,ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా మేకర్స్ AI ను నమ్ముకుంటున్నారు. ఈ మధ్యనే వెట్టయాన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్రకు మొదట ప్రకాష్ రాజ్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పించారు. కానీ, అది అంత వర్క్ అవుట్ అవ్వలేదని.. AI సహాయంతో అమితాబ్ ఒరిజినల్ వాయిస్ నే తెలుగులో డబ్ చేశారు. అది పర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది.


ఇప్పుడు ఇదే పద్దతిలో కంగువ తమిళ్ వెర్షన్ అంతా ఒరిజినల్ వాయిస్ లతో ఉండగా.. మిగిలిన భాషల్లో మాత్రం AI ను ఉపయోగించి డబ్బింగ్ చెప్పిస్తున్నారట. ఈ విషయాన్నీ నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ” తమిళ్ వెర్షన్ కు సూర్యనే డబ్బింగ్ చెప్పాడు.  మిగతా భాషల్లో మాత్రం AI ను ఉపయోగించి డబ్బింగ్ చెప్పిస్తున్నాం” అని తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై మరింత ఆత్రుత ఎదురుచూస్తున్నారు.

ఈ మధ్యకాలంలో AI  ఫోటోలు, వాయిస్ లు ఎంత ఫేమస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, కొన్నిసార్లు ఆ వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇంగ్లీష్ సినిమాకు తెలుగు డబ్బింగ్ చెప్పినట్లు.. అందులోనూ ఈ సినిమా కథ ప్రకారం కొన్ని పదాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయట. మరి అవన్నీ AI ద్వారా మేకర్స్ మ్యానేజ్ చేస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ AI  వాయిస్ వలన కంగువకు ప్లస్ అవుతుందా.. ? మైనస్ అవుతుందా.. ? అనేది తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Related News

Shruti Haasan: ‘డెకాయిట్’ నుండి తప్పుకున్న శృతి హాసన్.. అదే కారణమా?

Jani Master: జానీ మాస్టర్ కు బెయిల్ రద్దు.. తల్లిని చూసైనా కోర్టు కనికరించలేదా..?

Tollywood Young Hero: పూరీనే రిజెక్ట్ చేసిన కుర్ర హీరో.. తప్పు చేశాడా.. తప్పించుకోవడానికి చేశాడా.. ?

Prabhas Hanu: ప్రభాస్, హను సినిమాకు ఓ రేంజ్‌లో హైప్.. ఓవర్సీస్ కోసం ఏకంగా అన్ని కోట్లు డిమాండ్?

Matka Movie: లేలే రాజా.. ఏముందిరా.. మనోహరీ.. సాంగ్ అదిరింది అంతే

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Big Stories

×