EPAPER

China military Drill Taiwan| తైవాన్ చుట్టూ చైనా మిలటరీ డ్రిల్.. ‘యుద్దం రెచ్చగొట్టేందుకే’

China military Drill Taiwan| తైవాన్ చుట్టూ చైనా మిలటరీ డ్రిల్.. ‘యుద్దం రెచ్చగొట్టేందుకే’

China military Drill Taiwan| తైవాన్ భూభాగం చుట్టూ సముద్రంలో చైనా భారీ స్థాయిలో తన మిలిటరీ, నేవి, ఎయిర్ ఫోర్స్ తో అక్టోబర్ 14, 2024 సోమవారం ఉదయం మిలిటరీ డ్రిల్ చేపట్టింది. ఈ మిలిటరీ డ్రిల్ తైవాన్ కు వార్నింగ్ లాంటిదని చైనా తెలిపింది.


తైవాన్ కొత్త ప్రెసిడెంట్ లాయి చింగ్ తె ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ డ్రిల్ కు కారణమని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ పార్టీ తైవాన్ ప్రత్యేక దేశం కాదని చైనాలో ఓ భాగం మాత్రమేనని ఎప్పటినుంచో వాదిస్తోంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తైవాన్ అధ్యక్షుడు లాయి చింగ్ తె వ్యాఖ్యలు చేశారు. తైవాన్ ఎప్పటికీ ఒక స్వతంత్ర దేశంగానే ఉంటుందని ఎవరికీ తలవంచేది లేదని ఆయన అన్నారు. లాయి చింగ్ తె తైవాన్ నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చైనాతో పోరాటం చేసేందుకు రెడీ అని చెప్పారు. అప్పటి నుంచి తైవాన్ పై చైనా కన్నెర్ర చేసింది.

తాజాగా తైవాన్, దాని పరిసర దీవుల చుట్టూ సముద్రంలో చైనా భారీ స్థాయిలో మిలిటరీ డ్రిల్స్ చేసింది. “ఈ డ్రిల్స్ పై తైవాన్ రక్షణ మంత్రిత్వశాఖ స్పందించింది. చైనా ఈ డ్రిల్స్ చేయడం వెనుక అర్థం ఒకటే అదే యుద్ధం. కానీ చైనాతో పోరాడడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే.. రెచ్చగొడితే ఊరుకునేది లేదు”, అని తైవాన్ అధికారులు అన్నారు.


Also Read: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా

తైవాన్ చుట్టూ మిలటరీ, ఎయిర్ ఫోర్స్ తో మాక్ డ్రిల్స్ చేయడంపై చైనా మిలిటరీలోని పిఎల్ఏ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ప్రతినిధి నేవీ సీనియర్ కెప్టెన్ లి జి మీడియాతో మాట్లాడారు. “ఈ భారీ స్థాయి మిలిటరీ డ్రిల్స్ లో ఆర్మీ ఎయిర్ ఫోర్స్, మిసైల్ కార్ప్స్, నేవీ విభాగాలు పాల్గొన్నాయి. తైవాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చేందుకే ఈ డ్రిల్స్. తైవాన్ ఒక స్వతంత్ర దేశమని వాదించే వారు ఇకపై జాగ్రత్తగా వ్యవహరించాలి. మా దేశ సార్వభౌమత్వన్ని ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదు.” అని అన్నారు.

రెండో ప్రపంచానికి ముందు తైవాన్ మహా దీవి జపాన్ పాలనలో ఉండేది. ఆ తరువాత చైనా ఆధీనంలోకి వచ్చింది. 1949లో చైనాలో అధికారంలో ఉన్న చియాంగ్ కాయి షెక్ ప్రభుత్వాన్ని కూలదోసి మావో జెడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తననకు ఉరితీస్తుందనే భయంతో చింగ్ కాయ్ షెక్ తన అనుచరులతో కలిసి తైవాన్ దీవికి పారిపోయారు. ఆ తరువాత ఇరు వర్గాల మధ్య చైనా ఆధిపత్యం కోసం అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సంవత్సరాల పాటు పోరు సాగింది. చివరికి తైవాన్ ప్రత్యేక దేశంగా మారింది.

కానీ చైనాలోని కమ్యూనిస్ట్ మాత్రం.. తైవాన్ ని స్వతంత్ర దేశంగా గుర్తించేలేదు. చైనాలో తైవాన్ ఎప్పటికీ భాగమే చెప్పింది. ఎప్పిటికైనా తైవాన్ ని స్వాధీనం చేసుకుంటామని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే మే 2024లో తైవాన్ కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన లా చింగ్ తె.. చైనాకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో పరిస్థితులు ఇప్పుడు సీరియస్ గా మారాయి. యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Related News

UN Peacekeepers Netanyahu: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

Israeli bombardment In Gaza: గాజా బాంబుదాడుల్లో 29 మంది మృతి.. లెబనాన్ లో మరో ఐరాస కార్యకర్తకు తీవ్ర గాయాలు

Women CEOs Earning More| పురుషుల కంటే మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ .. కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు

Cyber Attacks On Iran: ఇరాన్ లో పెద్దఎత్తున సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యం

US airstrikes: సిరియాపై బాంబుల వర్షం..ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు!

Air India Flight Tricky Situation: 2 గంటలకు గాల్లోనే విమానం.. ఎయిర్ ఇండియా తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో ఏం జరిగింది?

Big Stories

×