EPAPER

HariHara Veeramallu : పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. సినిమా వచ్చేస్తుంది రెడీ అవండీ…

HariHara Veeramallu : పవన్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. సినిమా వచ్చేస్తుంది రెడీ అవండీ…

HariHara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ‘ హరి హర వీరమల్లు ‘ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ స్పెషల్ గా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయనను స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మళ్ళీ పవన్ డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీంతో రెగ్యులర్ గా ఏదో ఒక అప్డేట్ ఇస్తున్నారు నిర్మాణ సంస్థ. మెగా సూర్య ప్రొడక్షన్స్ లో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 28న రిలీజ్ చెయ్యనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే..


‘హరిహర వీరమల్లు’ షూటింగ్ అప్డేట్..

పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చివరి షెడ్యూల్ షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే షూటింగ్ మొదలు పెట్టారు టీమ్. షూటింగ్ కు సంబందించిన ఏదోక అప్డేట్ ను ఇస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. హరి హర వీరమల్లు మూవీ నవంబర్ 10 నాటికి హరి హర వీరమల్లు షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అయితే ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ ను 2025 వేసవిలో విడుదల కానుంది. అంటే మార్చి 28 న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సర్వం సిద్ధం చేశారు.. ఆ తర్వాత రెండో పార్ట్ ను 2026 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.


గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశారు. జనసేన తరఫున 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలోకి దిగితే 21 మంది గెలిచారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం తో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. రాజకీయ పరంగా బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు కాస్త సమయాన్ని సినిమా ల పై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దాంతో ఆయన నటిస్తున్న సినిమా ల గురించి ఒక్కో అప్డేట్ వస్తోంది. దసరా సందర్బంగా హరి హర వీరమల్లు మూవీ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో పవన్ విల్లు ధరించి బాణాలు ఎక్కిపెట్టి కనిపిస్తున్నారు. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు ఫస్ట్ పాటని రిలీజ్ చేయబోతున్నామని ఆ పాటని పవన్ కళ్యాణ్ పాడారని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

 

Related News

Ram Charan: ఒకప్పుడు ఎమ్మెస్ రాజు గారిని సంక్రాంతి రాజు అనే వారు, ఇప్పుడు ఆ ప్లేస్ ని దిల్ రాజు భర్తీ చేశారు

KA Movie: కుర్ర హీరో రిలీజ్ డేట్ చెప్పేశాడు..ఈసారి గట్టిగా కొట్టడమే.. ?

Naga Vamsi: వెంకీ అట్లూరి టాలెంట్ అలాంటిది, ఇప్పటివరకు ఆ పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు

Samantha: సంపాదించింది మొత్తం అందుకు ఖర్చు పెడుతున్న సామ్.. రిస్క్ తట్టుకుంటుందా.. ?

Actor : కూతురిని వేధించిన నటుడు… కేసులో నటుడు అరెస్ట్.. వెలుగులోకి కీలక అంశాలు..!

Chalaki Chanti : ఇకపై కామెడీ షోకు దూరం… వాళ్ళు సర్వనాశనం కావాలంటూ చంటి శాపనార్థాలు

Virat Karna : “నాగబంధనం” పెదకాపును నిలబెడుతుందా.?

Big Stories

×