EPAPER

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. కేంద్రం గెజిట్ రిలీజ్

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. కేంద్రం గెజిట్ రిలీజ్

President’s rule revoked in J&K after 5 years: జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఈ మేరకు కేంద్రం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌ కొత్త ప్రభుత్వ పాలన దిశగా అడుగులు వేస్తుంది. జమ్మూకశ్మీర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్​ కాన్ఫరెన్స్​, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన 2019 ఏడాది అక్టోబర్ 31న విధించగా.. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఎత్తివేశారు.


జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో నేషనల్ కాన్పరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా.. ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం రాష్ట్రపతి పాలన రద్దు చేశారు. ఇందులో భాగంగానే కేంద్రం హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పలు కీలక అంశాలను వెల్లడించారు.

2018లో జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలతో కూటమి ప్రభుత్వం చీలింది. దీంతో అసెంబ్లీని రద్దు చేసి 6 నెలలపాటు జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 31న రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది.


ఇదిలా ఉండగా, ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 2009 నుంచి 2014 సమయంలో ఎన్సీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి సీఎంగా పనిచేశారు. పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి మళ్లీ విజయం సాధించింది. ఈ మేరకు ఎల్‌జీకి ఎన్సీ ఉపాధ్యక్షుడు ఓ లేఖ సమర్పించారు. దీంతో కేంద్రం రాష్ట్రపతి పాలన ఎత్తివేసింది.

Also Read: ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Related News

Baba Siddique’s murder case: బాబా సిద్ధిఖీ హత్య కేసు, సంచలన విషయాలు.. నిందితుడు మైనర్ కాదు

Durga Pooja Violence| దుర్గామాత ఊరేగింపులో కాల్పులు.. ఒకరు మృతి, షాపులు, వాహనాలు దగ్ధం!

Baba Siddique: బాబా సిద్దిక్ హత్య కేసులో మూడో నిందితుడు అరెస్ట్.. ‘షూటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఇతనే’

Gita Jayanti Express: ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

Uttarakhand: రైల్వే ట్రాక్‌పై గ్యాస్ సిలిండర్.. తప్పిన పెను ప్రమాదం.. ఎందుకురా ఇలా తయ్యారయ్యారు!

PM Modi : గతిశక్తికి ప్రధాని మోదీ థాంక్స్… భారత్ భవిష్యత్ పై కీలక మార్గనిర్దేశం

Big Stories

×