EPAPER

TGPSC Group-1 2024: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచే హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

TGPSC Group-1 2024: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్.. నేటి నుంచే హాల్ టికెట్లు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా!

TGPSC Group-1 Hall Ticket 2024: గ్రూప్ -1 అభ్యర్థులకు అలర్ట్. రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అక్టోబర్ 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా, దీనికి సంబంధించిన హల్ టికెట్లపై అప్డేట్ ప్రకటించింది.


నేటి నుంచి గ్రూప్ -1 హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని టీజీపీఎస్సీ పేర్కొంది. అక్టోబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 27 వరకు గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు.

గ్రూప్ -1 మెయిన్స్‌లో మొత్తం ఆరు పేపర్లు ఉండడంతోపాటు జనరల్ ఇంగ్లిష్ పేపర్ రాయాల్సి ఉంటుంది. దీంతో ఓవరాల్‌గా గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులు ఏడు పేపర్లు రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ప్రతీ రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండనున్నాయి. ప్రతీ పేపర్ 3 గంటల వ్యవధిలో 150 మార్కులు ఉండనున్నాయి.


జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పేపర్ గా పరిగణించగా.. అక్టోబర్ 21న ఉండనుంది. ఇక, అక్టోబర్ 22న పేపర్ 1 జనరల్ ఎస్సే, అక్టోబర్ 23 పేపర్ 2 చరిత్రచ సంస్కృతి, భూగోళశాస్త్రం, అక్టోబర్ 24న పేపర్ 3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, అడ్మినిస్ట్రేషన్, అక్టోబర్ 25న పేపర్ 4లో భాగంగా ఎకానమీ, డెవలప్‌మెంట్, అక్టోబర్ 26న పేపర్ 5 సైన్స్, సాంకేతికత, డేటా ఇన్టర్ప్రెటేషన్, అక్టోబర్ 27న పేపర్ 6 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర నిర్మాణంపై ఉండనుంది.

Also Read: నావల్ల కాదు, డ్రాపవుతున్నానన్న జగ్గారెడ్డి.. కారణం అదేనా?

గ్రూప్ -1 మెయిన్స్‌కు మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 3.02లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్ తప్పా మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంచుకున్న భాషల్లో ఉండనుంది.

Related News

Ex Professor GN Saibaba body: ప్రొఫెసర్ సాయిబాబా కోరుకున్నట్టుగా, గాంధీ ఆసుపత్రికి అప్పగింత

Jaggareddy clarification: నావల్ల కాదు, డ్రాపవుతున్నానన్న జగ్గారెడ్డి.. కారణం అదేనా?

Manne Krishank : మూసీ కాంట్రాక్ట్‌పై తప్పుడు ప్రచారం… మన్నె క్రిశాంక్‌కు లీగల్ నోటీసులు

Harish rao : బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చీఫ్ విప్ ఎలా ఇస్తారు… ఇది రాజ్యంగ విరుద్ధం : ఎమ్మెల్యే హరీశ్ రావు

Minister Sridhar babu : మీకు ప్రతీది రాజకీయమేనా… హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్న

Warngal : ఫ్లెక్సీ వార్… పోలీస్ స్టేషన్‌కు మంత్రి కొండా సురేఖ

Big Stories

×