EPAPER

Palle Panduga: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

Palle Panduga: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

Palle Panduga starts from today onwords: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సుమారు రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తుండగా.. దాదాపు 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.


అన్నీ జిల్లాల్లో కలెక్టర్లు గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3 వేల కి.మీ మేర సిమెంట్‌ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమిపూజలో పాల్గొంటారు.

Also Read: వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక


అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించగా.. సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Related News

Margani Bharat’s follower: రాజమండ్రిలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్త .. యాంకర్ కావ్యశ్రీ, ఆమె తండ్రిపై దాడి

Swarupoonanda Swami: స్వరూపానంద ఎక్కడా? ఆ నగరాల మధ్య చక్కర్లు.. లెక్కల్లో తేడాలొచ్చాయా?

TDP Pulivarthi SudhaReddy : వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

Hindupuram rape : హిందూపురం రేప్ ఘటనలో పురోగతి.. సీసీటీవీ ఫుటేజీ లభ్యం

Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP CID : మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసు సీఐడీకి అప్పగింత… ఉత్తర్వులు జారీ

Big Stories

×