EPAPER

Work Life Balance| 23 లక్షలు వద్దు 18 లక్షల జీతం చాలు.. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా..

Work Life Balance| 23 లక్షలు వద్దు 18 లక్షల జీతం చాలు.. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే రాజీనామా..

Work Life Balance| పరుగులు తీసే నేటి జీవన విధానంలో చాలా మంది ఉద్యోగం చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అయితే ఇలా చేసే వారు జీవితంలో కుటుంబంతో మంచి బంధం కోల్పోవడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే జీవితంలో ఉద్యోగంతోపాటు కుటుంబం, ఆరోగ్యానికి సమ ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ సూత్రాన్ని అర్థం చేసుకున్న ఒక ఉద్యోగి ఇటీవలే తాను కొత్తగా చేరిన కంపెనీలో ఒకరోజు పనిచేసి అక్కడి ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశాడు. ఆ ఉద్యోగి రాజీనామా లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


శ్రేయస్ అనే ఒక ప్రాడక్ట్ డిజైనర్ ఇటీవల ఒక కొత్త కంపెనీలో ఉద్యగానికి చేరాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు శ్రేయస్ ఎంతో హుహారుగా ఆఫీసులో పనిచేశాడు. కానీ రోజు గడిచే కొద్ది అతని సంతోషమంతా ఆవిరైపోయింది. కంపెనీ జే మేనేజర్ అతనిపై తీవ్ర ఒత్తిడి చేశాడు. మేనేజర్ అతనికి ఇచ్చిన పని పూర్తి చేయాలంటే 12 నుంచి 14 గంటలు పడుతుంది. ఇలా ఒకరోజు కాదు ప్రతిరోజు ఇలాగే ఉంటుందని ఆ మేనేజర్ చెప్పాడు. పని పూర్తి చేయకుండా ఇంటికి వెళ్లకూడదని ఆంక్షలు విధించాడు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి ఎన్ని తిన్నాడంటే?..


అయితే శ్రేయస్ మాత్రం తాను ఒక రోజుకి ఆఫీసులో 9 గంటలు మాత్రమే పనిచేస్తానని.. తనకు రోజు వ్యాయామం, పుస్తకాలు చదివే అలవాటు ఉందని.. ఆఫీసు తరువాత తన వ్యక్తిగత జీవితాన్ని తాను వదులుకోలేనని మేనేజర్ కు చెప్పాడు. ఇదంతా విన్న మేనేజర్ అతడి గురించి ఆఫీసులో అపహాస్యం చేశాడు. ఉద్యోగం కావాలంటే అతని వ్యక్తి గత జీవితాన్ని పక్కన పెట్టాలని చెప్పాడు. మేనేజర్ ప్రవర్తన, ఆఫీసులోని నియమాలతో తన ఆరోగ్యం దెబ్బతింటుదని భావించిన శ్రేయస్ ఆ ఒక్క రోజు పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశాడు.

ఆ తరువాత తన రాజీనామా లెటర్ ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. అతని రెడ్డిట్ పోస్ట్ కు విపరీతంగా వ్యూస్ వచ్చాయి. చాలా నెటిజెన్లు తమకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని.. శ్రేయస్ తో అంగీకరించారు. మరికొందరైతే శ్రేయస్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడని ప్రశంసించగా… మరికొందరు ఆ మేనేజర్ ని తీవ్రంగా విమర్శించారు.

ఇలాంటిదే మరో కేసు గురించి దేవ్ కటారియా అనే ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దేవ్ కటారియా, అతని స్నేహితులిద్దరూ ఒకే తరహా పని చేస్తున్నారు. అయితే తన స్నేహితునికి రెండు జాబ్ ఆఫర్లు వచ్చాయి. ఒక కంపెనీ రూ.23 లక్షలు సాలరీ ప్యాకేజీ ఆఫర్ చేయగా.. మరో కంపెనీ రూ.18 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ దేవ్ కటారియా స్నేహితుడు మాత్రం తక్కువ సాలరీ ప్యాకేజీ అంటే రూ.18 లక్షల జాబ్ ఆఫర్ ని స్వీకరించాడు. ఇది చూసి దేవ్ కటారియా ఆశ్చర్యపోయానని తెలిపాడు.

కానీ తన స్నేహితుడు కారణం చెప్పగానే అతను చేసిందే కరెక్ట్ అని అంగీకరించాడు. నిజానికి ఆ రూ.23 లక్షలు సాలరీ ఆఫర్ చేసే కంపెనీలో వారానికి 6 రోజులు పనిచేయాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదు. కానీ రూ.18 లక్షల సాలరీ ప్యాకేజీ ఆఫర్ చేసే కంపెనీ హైబ్రిడ్ సిస్టమ్ లో వర్క్ చేయోచ్చని వెసలు బాటు ఇచ్చింది. పైగా వారానికి 5 రోజులు మాత్రమే డ్యూటీ చేయాలి. ఈ రెండో ఆఫర్ తీసుకోవడం వల్ల తన స్నేహితుడు కుటుంబానికి, ఆరోగ్యానికి సమయం కేటాయించగలడని కటారియా తెలిపాడు.

ఇంతకుముందు అతను చేసే ఆఫీసులో ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు పనిచేయాల్సి వచ్చేదని.. ఈ కారణంగా అతనికి ఆరోగ్య సమస్యలతో బాధపడేవాడని వెల్లడించాడు. అందుకే జీతం కాస్త తక్కువైనా పర్వాలేదు ఆరోగ్యం, కుటుంబం కూడా ముఖ్యమని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Related News

Pimple Problem: వీటితో ముఖంపై మచ్చలు పోతాయ్

Green Tea For Skin: గ్రీన్ టీతో గ్లోయింగ్ స్కిన్.. ఎలాగో తెలుసా ?

Face Packs: ఈ ఫేస్ ప్యాక్స్‌తో మీ అందం రెట్టింపు

Arthritis: కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా ?

Health Tips: ఖర్జూర, పాలు కలిపి తింటే బోలెడు ప్రయోజనాలు

Walking: ప్రతి రోజు 30 నిమిషాలు నడవడం వల్ల ఈ రోగాలన్నీ దూరం

Big Stories

×