EPAPER

OTT Movie : ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆ అబ్బాయి నుంచి కాల్… క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆ అబ్బాయి నుంచి కాల్… క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఒక అబ్బాయి నుంచి కాల్ వస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది కదా?! క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల కోసం సర్చ్ చేస్తున్న వారి కోసమే ఈ రోజు మన మూవీ సజెషన్. సస్పెన్స్ థ్రిల్లర్లలో సపరేట్ గా కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు మన సజెషన్ మాత్రం సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్. నార్మల్ సస్పెన్స్ థ్రిల్లర్ ల కంటే సైకలాజికల్ సస్టన్స్ థ్రిల్లర్ డిఫరెంట్ గా ఉంటాయి. మన ఆత్మ మనకి కాల్ చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ ఇది. మరి ఈ సైకాలజికల్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడొచ్చు? మూవీ పేరేంటి ? అనే విషయంలోకి వెళ్తే…


దీపిక పదుకొనే హీరోయిన్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమాలో స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఆమె ఒక బిడ్డకు తల్లి అయ్యిందన్న విషయం తెలిసిందే. కానీ ఆమె ఈ సినిమా చేసింది ఇప్పుడు కాదు. కెరీర్ మొదట్లో. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరు కార్తీక్ కాలింగ్ కార్తీక్. పేరుకు తగ్గట్టుగానే సినిమా మొత్తం విచిత్రంగా ఉంటుంది.


కథలోకి వెళ్తే…

సినిమాలో హీరో కార్తీక్ ను అందరూ ఏడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే అతను ఎవరితోనో గట్టిగా మాట్లాడలేక పోతాడు. దీన్నే సాకుగా చూపించి అందరూ ఏడిపిస్తూ ఉండడంతో అతను ఎప్పుడు చూసినా మూడీగా, ఒంటరిగా ఉంటాడు. అయితే దీని వెనక ఉన్న కారణం అతని గతం. చిన్నప్పుడు జరిగిన ఒక అనుకోని సంఘటన కారణంగా కార్తీక్ డిప్రెషన్ తో బాధపడతాడు. ఇప్పటికీ సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే కార్తీక్ కు నచ్చే ఒకే ఒక్క విషయం సోనాలి. ఆఫీసులో తన కొలీగ్ అయిన సోనాలిని కార్తిక్ ప్రేమిస్తాడు. కానీ ఆమెతో చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా ఉంటాడు. ఓ రోజు అనుకోకుండా అతని జాబ్ ఊడిపోతుంది. ఉన్న ఒక్క ఆధారం కూడా ఊడిపోవడంతో డిప్రెషన్లో చనిపోవాలని డిసైడ్ అవుతాడు. పైకి వెళ్ళిపోవడానికి మార్గంగా స్లీపింగ్ పిల్స్ ని తీసుకోబోతాడు. అయితే సడన్ గా ఒక ఫోన్ వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ కార్తీక్ కి కాల్ చేసింది మరో కార్తీక్. అంటే ఈ కార్తీక్ తనకు తానే ఫోన్ చేసుకున్నట్టు అర్థం. దీంతో అతను భయపడతాడు. కానీ అవతల ఫోన్లో ఉన్న వ్యక్తి తను కార్తీక్ అని చెప్పడమే కాకుండా ఇతని గురించి ఒక్క విషయం కూడా వదలకుండా అన్ని చెప్పేస్తాడు. అసలు ఒక వ్యక్తి తనకు తానే ఫోన్ చేసుకోవడం సాధ్యమవుతుందా? ఆ వ్యక్తి ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? కార్తీక్ గతంలో ఏం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్న కార్తీక్ కాలింగ్ కార్తిక్ అనే ఈ సినిమాపై ఒక లుక్ వెయ్యండి.

Related News

OTT Movie : పగ తీర్చుకోవడానికి ఒంటరి అమ్మాయి బీభత్సం… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా

OTT Movie : సినిమాలో ఛాన్స్ ఇస్తానని తీసుకెళ్లి ఇంత అరాచకమా? బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అబ్బాయిల స్పర్శ కోసం అల్లాడిపోయే అమ్మాయి… పిచ్చెక్కించే బో*ల్డ్ కథ

Mangalavaram : పాయల్ మూవీకి తగ్గని క్రేజ్.. మరోసారి అక్కడ రిలీజ్..

Jigra OTT: ఓటీటీలోకి ‘జిగ్రా’ మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Banned Movies on OTT: ఈ మూవీస్ కు ఇండియాలో నో ఎంట్రీ… కానీ ఇక్కడ చూడవచ్చు

Big Stories

×