EPAPER

Airtel Unlimited Internet plans : ఎయిర్టెల్ బెస్ట్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.. ట్రై చేయండి మరి

Airtel Unlimited Internet plans : ఎయిర్టెల్ బెస్ట్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.. ట్రై చేయండి మరి

Airtel Unlimited Internet plans : ఎయిర్‌టెల్ భారతదేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్ కంపెనీలలో ఒకటి. ఇక ఈ టెలికాం సంస్థ తన కస్టమర్ల కోసం చాలా ఎప్పటికప్పుడు ది బెస్ట్ టారిఫ్‌లను పరిచయం చేస్తుంది. అవి ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రెండూ కావచ్చు. హై- స్పీడ్ డేటా, కాలింగ్ టారిఫ్‌లు కావచ్చు. ఏది ఏమైనా బెస్ట్ ప్లాన్స్ మాత్రం ఎయిర్టెల్ సొంతం. ఇక అపరిమిత ఇంటర్నెట్ కావాలనుకునే వినియోగదారుల కోసం ఇప్పటికే Airtel ప్రీపెయిడ్ ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. ఆ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.


ఈ స్మార్ట్ యుగంలో ప్రతీ పని స్మార్ట్ గా సాగాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ తప్పనిసరి. స్మార్ట్ ఫోన్లో ప్రతీ యాప్ డేటా తో అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణం. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళు, పలు కంపెనీ ఉద్యోగులు సైతం హై స్పీడ్ ఇంటర్నెట్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వీరికి నిత్యం అన్ లిమిటెడ్ హై స్పీడ్ 5G డేటా తప్పనిసరి. ఇక ఎయిర్టెల్ వినియోగదారులకు ది బెస్ట్ అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరకే అత్యుత్తమ ప్లాన్స్ లభిస్తున్నాయి.

రూ. 399 ప్లాన్ – Airtel వినియోగ పరిమితిని అమలు చేయకుండా వినియోగదారులకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ వినియోగాన్ని అందిస్తుంది. 64 Kbps హై- స్పీడ్ డేటా పరిమితి, అపరిమిత ఇంటర్నెట్‌, రోజుకు 100 SMS, ఎటువంటి FUP లేకుండా ఉచిత కాలింగ్ సదుపాయం ఉంది. 28 రోజుల పాటు రోజూ వారీ 1.4 GB హై -స్పీడ్ డేటా ఇవ్వగా మెుత్తం 42GB డేటా అందుబాటులో ఉంది.


READ ALSO : ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ బాస్.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

రూ. 449 ప్లాన్ – ఈ ప్లాన్ అన్ లిమిటెడ్ ఉచిత ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ప్రతీ రోజూ 1.5 GB హై- స్పీడ్ డేటాతో మెత్తం డేటా 42 GBగా ఉంది. 28 రోజులు చెల్లుబాటయ్యే ఈ ప్లాన్ లో ప్రతీ రోజూ 100 SMS సౌకర్యం ఉంది.

రూ. 698 ప్లాన్ – ఎయిర్టెల్ లోనే ది బెస్ట్ డేటా ప్లాన్ ఇదే. ఇందులో అపరిమిత కాల్స్ తో పాటు అన్ లిమిటెడ్ డేటా సదుపాయం సైతం కలదు. హై స్పీడ్ డేటా 84 రోజులు పాటు అందించబడుతుంది. ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు సైతం ఉచితంగా లభిస్తున్నాయి.

రూ. 299 ప్లాన్ – ప్రీపెయిడ్ ప్యాక్‌ని కలిగి ఉన్న కస్టమర్స్ ఈ అపరిమిత డేటా యాడ్- ఆన్ ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. రూ. 299 అదనపు ప్యాక్‌లో ఉచిత అపరిమిత ఇంటర్నెట్ వినియోగాన్ని పొందే అవకాశం ఉంది. అయితే ఈ ప్లాన్ లో ఇతర అదనపు ప్రోత్సాహకాలు లేవు. కాలింగ్ మెసేజ్ సదుపాయం ఇందులో లేదు.

ఈ ప్లాన్ తో పాటు మరి కొన్ని బెస్ట్ ప్లాన్స్ సైతం ఎయిర్టెల్ అందిస్తుంది. ఇప్పటికే ప్రముఖ టెలికాం సంస్థలన్నీ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు పోటీ పడుతూ కొత్త కొత్త ప్లాన్స్ ను తీసుకు వస్తున్న నేపథ్యంలో.. ఎయిర్టెల్ తక్కువ రేట్ కి హై స్పీడ్ ఇంటర్నెట్ను అన్లిమిటెడ్ గా అందిస్తుంది.

Related News

Smart Phone Recovery : ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ బాస్.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Samsung Galaxy F05 : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

Rajmargyatra : హైవేపై లాంగ్ జర్నీ చేస్తున్నారా? – ఇది మీతో ఉంటే ఫుల్ సేప్​!

Data Recharge : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్​ ప్లాన్​కే ఫుల్ డేటా!

Best Smart Phones Under 10,000 : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Sunita Williams in Space: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Big Stories

×