EPAPER

Smart Phone Recovery : ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ బాస్.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Smart Phone Recovery : ఫోన్ పోయిందా.. డోంట్ వర్రీ బాస్.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Smart Phone Recovery : స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ లేకపోతే నిమిషం కూడా గడవదు. ప్రతీ పని స్మార్ట్ ఫోన్ తో లింక్ అయి ఉంటుంది. ఆన్లైన్ ఆర్డర్స్, గూగుల్ మ్యాప్స్, ట్రావెలింగ్, పేమెంట్స్ ఇలా ప్రతీ ఒక్కటి స్మార్ట్ ఫోన్ తోనే అనుసంధానమై ఉంటున్నాయి. ఇలాంటి కాలంలో అకస్మాత్తుగా స్మార్ట్ ఫోన్ పోగొట్టుకోవడం చిన్న విషయం కాదు. ఫోన్ పోగానే విపరీతమైన ఒత్తిడి తో పాటు నిరుత్సాహం సైతం ఆవహిస్తాయి. ముఖ్యంగా ఫోన్లో ఉంటే ఎంతో ముఖ్యమైన డేటా తో పాటు విలువైన జ్ఞాపకాలు, ముఖ్యమైన పరిచయాలు, సమాచారం, కాంటాక్ట్స్ అన్ని పోతాయనే భయం మరో వైపు వెంటాడుతుంది.


అయితే వీటన్నిటిని అధిగమించి పోయిన డేటా తో పాటు ఫోన్ ను సైతం రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆందోళనకు గురి కాకుండా కాస్త జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేస్తే ఫోన్ ను ట్రాక్ చేసి గుర్తించి తిరిగి పొందవచ్చు. ఒక్కోసారి ఫోన్ ను కోల్పోయినా డేటా తప్పుడు వ్యక్తులు చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మరి అవి ఏంటో ఓసారి తెలుసుకుందాం.

పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌లను గుర్తించడంలో సహాయం చేయడానికి… ‘ఫైండ్ మై డివైస్’ యాప్ వంటి యూజర్ ఫ్రెండ్లీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టూల్స్‌ను Google అందిస్తుంది. ఇది ఏ కంప్యూటర్‌లోనైనా android. com/ find అని టైప్ చేస్తే చాలు. ఇది  Google ఖాతాకు సైన్ ఇన్ చేసినంత సులభం. ఈ యాప్ సెల్ ఫోన్‌లను ఆన్ చేసి, ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసినంత వరకూ ఫోన్ ఎక్కడ ఉందో మ్యాప్‌లో చూపిస్తుంది. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నప్పటికీ, ఐదు నిమిషాల పాటు రింగ్ అయ్యేలా చేయవచ్చు. దీంతో ఫోన్ ఎక్కడ ఉందో తేలికగా గుర్తించే అవకాశం ఉంటుంది.


CEIR – ఫోన్​ పోయినా లేదా ఎవరైనా దొంగలించినా సెంట్రల్​ ఎక్విప్​మెంట్​ ఐడెంటిటీ రిజిస్టర్​ (సీఈఐఆర్​) ద్వారా వెంటనే దాన్ని బ్లాక్‌ చేసి పనిచేయకుండా చేయకుండా చేసే అవకాశం ఉంటుంది. ఫోన్​ తిరిగి దొరికితే దాన్ని అన్ ​బ్లాక్​ చేసుకుని వాడుకునే అవకాశం ఉంటుంది. మళ్లీ వాడుకోవాలంటే మాత్రం ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు… ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి సంచార్ సాథి పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

రిమోట్‌గా డేటాను తొలగించండి – ఫోన్ ను తిరిగి పొందే అవకాశం లేని సమయాల్లో అప్లికేషన్‌లు, ఫోటోలు, ఇమెయిల్‌లు మొదలైన వాటిని వేరొకరి చేతికి చిక్కకండా డేటాను క్లియర్ చేయటం ఎంతో ముఖ్యం. ఇక ఈ ప్రక్రియ సైతం ఎంతో వేగంగా, సమర్థవంతంగా ఉంటుంది.

android. com/ find యాప్ లో ఉన్న తదుపరి పేజీలో ఫోన్ లో ఉన్న మెుత్తం డేటాను తుడిచేసే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్ లో ఉన్న ఖాతాలతో పాటు విలువైన సమాచారం మెుత్తం పోతుంది. దీంతో ఫోన్ తప్పుడు వ్యక్తుల చేతికి చిక్కినా అందులో డేటా సేఫ్ గా ఉంటుంది.

ALSO READ : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

 

 

Related News

Airtel Unlimited Internet plans : ఎయిర్టెల్ బెస్ట్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్లాన్స్ లిస్ట్ ఇదే.. ట్రై చేయండి మరి

Samsung Galaxy F05 : సూపర్ సేల్ బాస్.. రూ. 6,499కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్

Rajmargyatra : హైవేపై లాంగ్ జర్నీ చేస్తున్నారా? – ఇది మీతో ఉంటే ఫుల్ సేప్​!

Data Recharge : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్​ ప్లాన్​కే ఫుల్ డేటా!

Best Smart Phones Under 10,000 : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!

Sunita Williams in Space: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, ఎక్కువ కాలం స్పేస్ లో ఉన్న ఆ జీవులకు ఏమైందో తెలుసా?

Big Stories

×