Rajmargyatra : ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లాలంటే కచ్చితంగా మ్యాప్‌ను ఉపయోగిస్తుంటాం. అలానే ఫాస్టాగ్ రీఛార్జి చేయడానికి ఇంకో యాప్, జర్నీలో ఏమైనా సమస్య వస్తే కంప్లైంట్ చేయడానికి మరొకటి.. ఇలా ఒక్కోదానికి మరొకదాన్ని ఆశ్రయిస్తుంటాం. మరి అన్నింటికీ కలిపి ఒకటే యాప్ ఉంటే! ఇప్పుడు అందుకే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఓ సరికొత్త యాప్‌ను తీసుకొచ్చింది. దాని పేరే రాజ్‌మార్గ్‌యాత్ర. ఇందులో రూట్ మ్యాప్స్ నుంచి స్మార్ట్ అలర్ట్స్ వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. ఇంతకీ ఈ యాప్‌లో ఏఏ ఫీచర్లు ఉంటాయి? వాటి వివరాలు ఏంటి? తెలుసుకుందాం.
రెస్టారెంట్ల నుంచి పెట్రోల్ బంక్‌ల వరకు – నేషనల్ హైవే యాప్‌పై వెళ్లేటప్పుడు తినడానికి రెస్టారెంట్లు, పెట్రోల్ బంక్‌లు, ఛార్జింగ్ స్టేషన్లు, హాస్పిటల్స్, ఏటీఎంలు, పోలీస్ స్టేషన్లు, పర్యటక ప్రాంతాల వివరాలు ఉంటాయి. ఇంకా వాతావరణ స్థితి, ట్రాఫిక్ అలర్టులను కూడా చూపిస్తుంది. అలా ప్రయాణికులకు అవసరమయ్యే కీలక సమచారం ఈ యాప్‌లో దొరుకుతుంది.
స్మార్ట్ అలర్ట్ – పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం ప్రమాదకరణం. అయినా కొంతమంది అత్యుత్సాహం, లేదా ఇతర కారణాలతో వేగంగా వెళ్తుంటారు. ఇది మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఓవర్ స్పీడ్ నోటిఫికేషన్ ఇస్తుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఎన్హెచ్ఏఐ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. యాప్‌లో ఉన్న స్మార్ట్ అలర్ట్, వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఈ నోటిఫికేషన్స్ వస్తాయి.
కంప్లైంట్ చేయొచ్చు – ప్రధాన జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు చాలా చోట్లు రోడ్లు సరిగ్గా ఉండకపోవచ్చు. దాని వల్ల ప్రయాణానికి ఇబ్బంది కలుగుతుంది. ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి రహదారికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే ఈ యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. Report An Issue On NHపై క్లిక్ చేసి సమస్యను ఫొటో, వీడియో తీసి కంప్లైంట్ చేయొచ్చు. దీనిపై ఎన్హెచ్ఏఐ చర్యలు తీసుకుంటుంది. పైగా ఈ యాప్‌లో మన కంప్లైంట్ స్టేటస్‌ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
ALSO READ : డేటా త్వరగా అయిపోతుందా? – ఇలా చేస్తే తక్కువ రిచార్జ్ ప్లాన్‌కే ఫుల్ డేటా!
టోల్ ప్లాజా డీటెయిల్స్ – Toll Plaza Enroute ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ సెర్చ్ బాక్స్‌లో మీరు బయల్దేరుతున్న ప్రాంతంతో పాటు ఎక్కడికో వెళ్లాలో అంటే చేరాల్సిన గమ్యస్థానాన్ని ఎంటర్ చేయాలి. సెర్చ్‌పై క్లిక్ చేస్తే చాలు. ఆ రహదారిలో ఉండే టోల్ ప్లాజాల సంఖ్య, వాటి పేర్లు, కట్టాల్సిన మొత్తం వివరాలు డిస్ప్లే అవుతాయి.
ఫాస్టాగ్ సర్వీసులు – ఫాస్టాగ్ సర్వీసులు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. కొత్త ఫాస్టాగ్ దరఖాస్తును ఇందులో చేసుకోవచ్చు. అలానే నెలవారీ పాస్‌లు, ఫాస్ట్ ట్యాగ్‌కు సంబంధించిన ఇతర సర్వీసులు కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు.
ఇంకా ఏవేవి ఉంటాయంటే? – పోలీస్ అసిస్టెన్స్, ఎమర్జెన్సీ నంబర్లత పాటు హైవే అసిస్టెన్స్ కూడా యాప్‌లో ఉంచాయి. అలా మనం జర్నీ చేస్తున్న రహదారి వివరాలు కూడా ఎప్పటి కప్పుడు కనిపిస్తుంటాయి. జర్నీని కూడా రికార్డ్ చేసుకోచ్చు. మొత్తంగా ఈ రాజ్‌మార్గ్ యాత్ర యాప్ తెలుగుతో పాటు ఇంగ్లిష్ సహా మొత్తం 12 భాషల్లో అందుబాటులో ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోని, మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. అప్పుడు ఈ సదుపాయాలన్నీ పొందొచ్చు. యాపిల్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుంది.