Data Recharge : ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. చిన్న పిల్లలు అన్నం తిన్నాలంటే, గేమ్స్ ఆడాలంటే మొదలు పెద్దవారికి, యువతకు వృత్తి పరంగా లేదా ఇతర వ్యక్తిగత అవసరాలకు స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోదు దానికి తోడు కచ్చితంగా డేటా ఉండాల్సిందే. అప్పుడు మనకు కావాల్సిన సమచారం లేదా ఇతర ఇంకేమైనా అందులో దొరుకుతుంది. అందుకే ఫోన్లో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. పైగా ప్రారంభ దశలో డేటా ఛార్జీలు తక్కువగా ఉండటం, ఆ తర్వాత అందుబాటు ధరలో ఉండటం వల్ల కూడా డేటా వినియోగం బాగా పెరిగిపోయింది.
కానీ ఇప్పుడు ప్రముఖ టెలికాం సంస్థలు తమ తెలివితేటలతో రీఛార్జ్ ప్లాన్ ధరల్ని భారీగా పెంచేసి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో వినియోగదారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే డేటా వినియోగం తప్పనిసరి అయిపోయింది. ఏం చేయలేక పెంచిన ధరలకే డేటా రిచార్జ్‌లు చేసుకుంటూ ఇంటర్నెట్ సేవలను ఉపయోగిస్తున్నారు.
అయితే చాలా మందికి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఫోన్లో రోజువారి డేటా కూడా త్వరగా అయిపోతుంది. దీంతో అదనపు డేటా కోసం రీఛ్చార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్లో డేటా తొందరగా అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మీ ముందుకుకు వివరాలను తీసుకొచ్చాం.
ముందుగా రీఛార్జ్ చేసుకునేటప్పుడే డేటా అవసరాలను బట్టి ప్లాన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే ధర తక్కువ ఉండే ప్లాన్ ఎంచుకుంటే ఆ తర్వాత అదనపు డేటా ప్యాక్‌లు కొనాల్సి వస్తుంది. డబ్బులు అదనంగా ఖర్చు అవుతాయి.
ప్లే స్టోర్ యాప్స్ ఆటో అప్డేట్ డిసెబుల్ లేదా ఓన్లీ వైఫైలోనే ఉంచాలి. అలా చేయకపోతే యాప్స్ మొబైల్ డేటాను ఉపయోగించుకుని అప్డేట్ అయిపోతాయి. దీంతో అవసరమైన సమయంలో డేటా కొరత ఏర్పడుతుంది.
ALSO READ : 10వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే!
వైఫై సదుపాయం ఉంటే డేటా ఆఫ్ చేసుకుని దానికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మొబైల్ డేటా ఆదా అవుతుంది. ఏవైనా అప్డేట్స్, డౌన్ లోడ్స్ ఉన్నా వైఫైలోనే చేసుకోవాలి. అయితే, వైఫై కనెక్ట్ ముందు సురక్షితమో కాదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. లేదంటే మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు.
అనవసరమైన యాప్స్ అ న్ఇన్స్టాల్ చేయడం మంచిది. తాత్కాలిక అవసరాల కోసం ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్, బ్యాక్ గ్రౌండ్ డేటా యూసేజ్‌ను రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. దీంతో ఆయా యాప్స్ బ్యాక్ గ్రౌండ్లో డేటా వినియోగించడం ఆగిపోతుంది.
హైక్వాలిటీ ఫొటోలు, వీడియోలు కూడా ఎక్కువ డేటాను యూసేజ్ చేస్తాయి. ఆన్లైన్ స్ట్రీమింగ్ అయినా, డౌన్లోడ్ అయినా క్వాలిటీని ఆటోమోడ్లో పెట్టుకోకుండా తక్కువ క్వాలిటీలో పెట్టుకోవాలి. అప్పుడు కూడా డేటాను ఆదా చేయొచ్చు.
కొన్ని బ్రౌజర్లు, యాప్స్‌కు డేటా సేవింగ్ ఫీచర్ ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు బ్రౌజింగ్ వెబ్ పేజీలు, ఇమేజ్, వీడియో సైజును కంప్రెస్ చేసి చూపిస్తుంది. దీంతో ఎక్కువ డేటా ఖర్చవదు.
యాప్స్ అడిగే పర్మిషన్స్‌ను చెక్ చేసుకుని అవసరం లేని వాటిని రిజెక్ట్ చేయాలి. అవసరం లేని వాటికి కూడా పుష్ నోటిఫికేషన్స్ కూడా ఆఫ్ చేసుకోవాలి. వీటన్నిటినీ సెట్టింగ్స్‌లోని యాప్స్ సెక్షన్లో మార్పులు చేసుకోవాలి.
చివరిగా ఎప్పటికప్పుడు మీ డేటా వినియోగాన్ని సమీక్షించుకోవాలి. ఏ యాప్ ద్వారా ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసుకోవాలి. అప్పుడు వాటిని ఆప్టిమైజ్ చేసుకోవడం ద్వారా డేటా ఆదా అవుతుంది.