EPAPER

Contract Killer Lover: కూతుర్ని హత్య చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన తల్లి.. చిన్న ట్విస్ట్.. హంతకుడు ఏం చేశాడంటే?..

Contract Killer Lover: కూతుర్ని హత్య చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన తల్లి.. చిన్న ట్విస్ట్.. హంతకుడు ఏం చేశాడంటే?..

Contract Killer Lover| కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించిందని కోపంతో ఒక తల్లి ఆమె ను హత్య చేయడానికి ఒక కిరాయి రౌడీకి డబ్బులు ఇచ్చింది. అయితే ఆ రౌడీ ఆమె కూతురిని చంపకుండా పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ వేశాడు. అయితే పెళ్లికి ముందు అత్తనే హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రేదేశ్ లో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఈటా జిల్లాకు చెందిన అల్కాదేవి అనే 42 ఏళ్ల మహిళ కనబడడం లేదని ఆమె భర్త రమాకాంత్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేశాడు. ఆమె మూడు రోజుల క్రితం ఆగ్రా నగరానికి వెళ్లిందని ఆ తరువాత తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు అల్కాదేవి కోసం గాలిస్తుండగా.. ఊరి చివర పొలాల్లో ఆమె మృతదేహం లభించింది. పోలీసులు ఆమె శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

అల్కాదేవిని ఎవరో గొంతునులిమి హత్య చేశారని పోస్టు మార్టం నివేదికలో తేలింది. దీంతో పోలీసులు ఆమె భర్తను ప్రశ్నించారు. అల్కాదేవి భర్త తనకు అఖిలేశ్, అనికేత్ అనే ఇద్దరి వ్యక్తులపై తనకు అనుమానం ఉన్నట్లు తెలిపాడు. ఈ అఖిలేఖ్, అనికేత్ ఇద్దరూ రమాకాంత్ గ్రామానికి చెందిన వారే. ఈ ఇద్దరూ రౌడీలు కొన్ని నెలల క్రితం రమాకాంత్ కూతురు కావ్య (17, పేరు మార్చబడినది)ని కిడ్నాప్ చేశారు. అయితే ఆ తరువాత పోలీసులు కావ్యని సురక్షితంగా కాపాడారు. కిడ్నాపింగ్ కేసులో ఒక నిందితుడు అనికేత్ తప్పించుకోగా, అఖిలేఖ్ ని పోలీసులు అరెస్టు చేశారు.


Also Read: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే

కిడ్నప్ కేసులో తమపై పగ బట్టి అఖిలేఖ తన భార్యను హత్య చేసి ఉంటాడని రమాకాంత్ అనుమానం వ్యక్తం చేశాడు. అయితే పోలీసులు లోతుగా విచారణ చేస్తే.. అల్కాదేవి చనిపోయే ముందు పలుమార్లు సుభాష్ (38) అనే వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. ఈ సుభాష్ అనే వ్యక్తి కూడా ఒక కిరాయి రౌడీ. అతను అల్కా దేవి స్వగ్రామం అయిన సికందర్ పూర్ ఖాస్ కు చెందినవాడు.

పోలసులు సుభాష్ గురించి రమాకాంత్ ను ప్రశ్నిస్తే.. అప్పుడు కొంత నిజం బయటపడింది. సుభాష్ ఒక కిరాయి రౌడీ అతను ఇంతకుముందు పదేళ్లు జైలు శిక్ష అనుభవించాడని తెలిసింది. కిడ్నాప్ తరువాత తన కూతురు కావ్య మానసికంగా షాక్ కు గురైనట్లు తేలడంతో ఆమెను కొన్ని రోజులు తన అమ్మమ్మ గ్రామం అదే సికందర్ పూర్ కు పంపించామని రమాకాంత్ తెలిపాడు. అయితే ఆ గ్రామంలో ఎవరితోనో కావ్య ప్రేమలో పడిందని ఆ వ్యక్తి ఒక రౌడీ కావడంతో అల్కాదేవి తన కూతురు కావ్యపై కోపపడినట్లు చెప్పాడు.

పోలీసులు ఆ తరువాత సుభాష్ ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. దీంతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కావ్య ఒక రౌడీని ప్రేమించి.. తన తల్లిదండ్రులను ఎదిరించింది. పైగా ఆ రౌడీ ఒక తక్కువ జాతి వాడు. కావ్య అతడినే పెళ్లి చేసుకుంటానని స్పష్టంగా చెప్పడంతో సమాజంలో తమ పరువుపోతుందనే భయంతో అల్కాదేవి ఒకరోజు సుభాష్ కు ఫోన్ చేసి తన కూతురిని హత్య చేయాలని చెప్పింది. అందుకు రూ.50000 కూడా ఇస్తానని చెప్పింది. తన కూతురు ఆగ్రాకు వెళ్లిందని అక్కడే హత్య చేయాలని చెప్పింది. ఆ తరువాత సుభాష్ ఆగ్రాకు వెళ్లి అల్కాదేవికి తాను హత్య చేసినట్లు ఫోన్ చేశాడు. వెంటనే బయలుదేరి రావాలని అన్నాడు.

దీంతో వెంటనే అల్కాదేవి ఆగ్రాకు బయలుదేరి వెళ్లగా అక్కడ ఆమెకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఇంతకాలం తన కూతురు కావ్య ప్రేమించిన వ్యక్తి మరెవరో కాదు స్వయంగా సుభాష్. అంటే సుభాష్.. కావ్యను హత్య చేయలేదు. కావ్య, సుభాష్ ఇద్దరూ కలిసి అల్కాదేవిని హత్య చేసి ఊరి చివర పొలాల్లో ఆమె శవాన్ని పడేశారు.

పోలీసులు కావ్య, సుభాష్ ని అల్కాదేవి హత్య కేసులో అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Related News

Hindupur Rape Case: హిందూపురం.. అత్తాకోడళ్ల అత్యాచారం కేసు, నిందితులు మైనర్లు?

Vijayawada Locopilot Murder: విజయవాడ రైల్వే స్టేషన్‌ లోకోపైలెట్ హత్య కేసులో వీడిన మిస్టరీ.. బీహార్‌కు చెందిన నిందితుడు అరెస్ట్

Fatal Triangle Love: ఒక బాయ్ ఫ్రెండ్, ఇద్దరు గర్లఫ్రెండ్స్.. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో చివరికి రక్తపాతమే

Woman Kills Parents: తల్లిదండ్రులను హత్య చేసిన యువతి.. 4 ఏళ్లుగా ఇంట్లోనే శవాలు.. ఎందుకంటే?..

Viral News: ఇలాంటి డ్రెస్సా? యాసిడ్ దాడి చేస్తానంటూ మహిళకు వార్నింగ్

Woman Throws Acid on Lover: హోటల్‌కు టిఫిన్ కోసం వెళ్లిన ప్రేమికులు.. ప్రియుడిపై యాసిడ్ పోసిన యువతి?..

Big Stories

×