EPAPER

Chicken Rates: మాంసప్రియులకు పండుగ పూట బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Rates: మాంసప్రియులకు పండుగ పూట బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Rates in hike festical: తెలంగాణలో ఎక్కువగా నిర్వహించుకునే పండుల్లో దసరా ఒకటి. ఈ పండుగను పెద్దల పండగగా భావిస్తారు. సాధారణంగా దసరా పండగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మాంసం వంటకాలు చేస్తారు. అయితే ఈ ఏడాది దసరా పండుగ శనివారం రావడంతో ఎక్కువశాతం మంది వెజ్ వంటకాలకే పరిమతమయ్యారు. నేడు ఆదివారం కావడంతో చికెన్, మటన్ కోసం మార్కెట్‌ల్లో క్యూ కడుతున్నారు.


మార్కెట్ వెళ్లి ధరలు చూస్తే భగ్గమంటున్నాయి. స్కిన్ లెస్ చికెన్ ధరల ఏకంగా రూ.240 నుంచి రూ.260 వరకు అమ్ముతుండడంతో కొనుగోలుదారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ నెల ప్రారంభంలో కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర రూ. 160 నుంచి రూ.180 మధ్య పలికింది. అంతకుముందు నెలలో కూడా రూ.200లోపే ఉంది. కానీ వారం రోజుల నుంచి రూ.230 వరకు పలుకుతుండగా… నేడు రూ.250 వరకు విక్రయిస్తున్నారు.

Also Read: మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత… సంతాపం తెలిపిన సీపీఐ నారాయణ


హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాల్లోని మార్కెట్లలో రద్దీ కనిపిస్తోంది. అయితే ధరలు మాత్రం ఒకేలా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే మాంసప్రియులు కొంత నిరాశకు గురవుతున్నారు. కొంతమంది మాత్రం రేట్లు ఎంత పెరిగినా తినేందుకు వెనకాడడం లేదు. దీంతో అన్ని మార్కెట్‌ల్లో కిటకిటలాడుతున్నాయి.

Related News

KCR Political Activities: ప్రజల్లోకి కేసీఆర్.. డిసెంబర్‌కు నుంచి, టార్గెట్ అదే

Ganja Gang Attack: హైదరాబాద్ శివార్లలో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్.. మార్నింగ్ వాకర్స్‌పై దాడి

Professor Saibaba : మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత… సంతాపం తెలిపిన సీపీఐ నారాయణ

CPI Narayana: పరువు లేని నాగార్జున.. దావా వేయడం ఎందుకు? బిగ్ బాస్ షో లక్ష్యంగా నారాయణ కామెంట్స్

Dasara: పండుగ రోజు ఇటువంటి కానుక ఊహించరు కూడా.. ఆల్ ఫ్రీ అంటూ తెగ పంచేశారు.. ప్రజలు క్యూ కట్టారు

Kondareddy Palli : కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాస్ ఎంట్రీ… దసరా గూస్ బంప్స్

Big Stories

×