EPAPER

IT Company Dasara gift: ఉద్యోగులకు ఆ ఐటీ కంపెనీ దసరా గిఫ్ట్, కార్లు, బైక్‌లతోపాటు..

IT Company Dasara gift: ఉద్యోగులకు ఆ ఐటీ కంపెనీ దసరా గిఫ్ట్, కార్లు, బైక్‌లతోపాటు..

IT Company Dasara gift: దసరా వచ్చిందంటే చాలు వివిధ కంపెనీలు పని చేస్తున్న ఉద్యోగులకు రకరకాల గిఫ్టులు ఇస్తుంటారు. కొంతమంది స్వీట్లు.. మరికొందరు డ్రై ఫ్రూట్స్ ఇలా ఎవరికి నచ్చినట్టుగా వారు దసరా పేరిట బహుమతులు ఇస్తుంటారు. కానీ ఓ ఐటీ కంపెనీ ఏకంగా తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు కార్లు, బైకులు ఇచ్చింది. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం. ఇంతకీ ఎక్కడ అన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.


చెన్నైకి చెందిన టీమ్ డీటెయిలింగ్ సొల్యూషన్ సంస్థలో పని చేసిన ఉద్యోగుల పంట పడింది. దసరా సందర్భంగా కంపెనీని నమ్ముకున్న ఉద్యోగులకు ఊహించని కానుక ఇచ్చింది. ఒకటీ రెండు ఏకంగా 28 మంది ఉద్యోగులకు కార్లు (అందులో హ్యూందాయ్, టాటా, మారుతి సుజునీ, మెర్స్‌డెస్ బెంజ్ కంపెనీల కార్లు) అందజేసింది.

కేవలం కార్లు మాత్రమే కాదు. మరికొందరికి 29 బైక్‌లు సైతం ఇచ్చింది. దీంతో ఆ కంపెనీ ఉద్యోగులు ఫుల్‌ఖుషీ. దసరా కానుకలపై ఆ కంపెనీ డైరెక్టర్ శ్రీదర్ కన్నన్ తన మనసులోని మాట బయటపెట్టారు. తమ కంపెనీ పని తీరు, ఏళ్ల తరబడి ఉద్యోగులు తమకు సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు.


తమ కంపెనీ పనితీరు వెనుక ఉద్యోగుల కృషి మరువలేమని, ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమన్నారు. అందుకోసమే మంచి వాహనాలను కొనుగోలు చేశామన్నారాయన. ఇదేకాకుండా దసరా సందర్భంగా ఉద్యోగులకు మరో ఆఫర్ ఇచ్చేసింది ఆ కంపెనీ.

ALSO READ: ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య, మూడు రౌండ్లు కాల్పులు.. హత్య ఎవరి పని?

గతంలో ఉద్యోగులు ఎవరైనా మ్యారేజ్ చేసుకుంటే సహాయం కింద 50 వేలు ఇచ్చేది. ఇప్పుడది లక్షకు పెంచేసింది. దీంతో టీనేజర్స్ ఫుల్ ఎంజాయ్. గతంలో నార్తిండియాకు చెందిన ఓ కంపెనీ కూడా ఇదే విధంగా చేసింది. తమ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులకు దసరా కానుకగా కార్లు ఇచ్చిన విషయం తెల్సిందే.

Related News

Baba Siddique: సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మధ్య సంధి కుదిర్చిన బాబా సిద్ధిఖ్.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర

RSS Kerala: కేరళ చరిత్రలో ఫస్ట్ టైమ్.. సీపీఎం గ్రామంలో ఆర్ఎస్ఎస్ కవాతు.. వెనుక ఏం జరుగుతోంది?

Shivsena Vs Shivsena: ‘అది డూప్లికేట్ శివసేన’-‘ఉద్ధవ్ మరో ఓవసీ’.. దసరా రోజు సీఎం, మాజీ సీఎంల మాటల యుద్ధం

Baba Siddiqui Shot dead: ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య, మూడు రౌండ్లు కాల్పులు.. హత్య ఎవరి పని?

Jammu & Kashmir : కశ్మీర్​లో కేంద్రం మాస్టర్ స్ట్రాటజీ… రాష్ట్రపతి పాలనకు బైబై

Bagamathi Train : ఓ మై గాడ్, భాగమతి రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులా… రైల్వేశాఖ ఏం చెప్పిందంటే ?

Big Stories

×