EPAPER

Ram Charan: రామ్ చరణ్ కి ఇది మొదటి సారి కాదు, ఇలా చాలాసార్లు త్యాగం చేసాడు

Ram Charan: రామ్ చరణ్ కి ఇది మొదటి సారి కాదు, ఇలా చాలాసార్లు త్యాగం చేసాడు

Ram Charan: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని, మెగాస్టార్ చిరంజీవి పేరును రెండింతలు నిలబెట్టాడు అని చెప్పొచ్చు. మెగాస్టార్ అనే ఒక ఇమేజ్ ను మోయటమే చాలా కష్టం అనుకునే తరుణంలో సక్సెస్ఫుల్ గా సెకండ్ సినిమాతోనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చరణ్ చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను తీసుకొచ్చిన కూడా ధ్రువ సినిమాతో ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రామ్ చరణ్ లోని ఇంతటి నటుడు ఉన్నాడు అని ప్రూవ్ చేసిన సినిమా రంగస్థలం. ట్రిపుల్ ఆర్ వంటి సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సాధించిన కూడా చాలామందికి రంగస్థలం సినిమా అంటేనే ఎక్కువ ఇష్టమని చెప్పాలి.


కేవలం సూపర్ హిట్ సినిమాలను చేయడమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా చాలా పెద్ద మనసున్న మనిషి అనిపించుకున్నాడు చరణ్. ఎంతోమందికి తన వంతుగా సహాయం కూడా అందిస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలానే కొన్నిసార్లు ఓపెన్ గా మీడియాకి వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సినిమా పరిశ్రమలో సక్సెస్ అవుతున్నకొద్దీ జ్వరం తగ్గడం మొదలు పెట్టాను. అప్పుడు అంత ఫైర్ ఇప్పుడు చరణ్ లో లేకుండా పోయింది. బహుశా కొన్ని అనుభవాల వలన కొన్ని విషయాలపై స్పందించడం కూడా పూర్తిగా మానేశారు. ఇకపోతే చరణ్ ఆఫ్ లైన్ క్యారెక్టర్ చాలామందికి ఇన్స్పైరింగ్ గా కూడా అనిపిస్తుంది. రామ్ చరణ్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలానే చరణ్ స్టేజ్ ఎక్కి మాట్లాడిన ప్రతిసారి తన తండ్రి చిరంజీవి, అలానే బాబాయ్ పవన్ కళ్యాణ్ పైన ఎంత ప్రేమ ఉందో వ్యక్తి పరుస్తూనే ఉంటాడు.

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ చరణ్ నుండి పూర్తిస్థాయి సినిమా రాలేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించాడు చరణ్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాదాపు మూడేళ్ల క్రితం దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కలిసి గేమ్ చేంజర్ అనే సినిమాను మొదలుపెట్టారు. దర్శకుడు శంకర్ స్ట్రైట్ గా చేస్తున్న మొదటి తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకి కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించాడు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కనుక జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. కానీ సంక్రాంతి సీజన్ ప్రత్యేకం కావడంతో అప్పటికి ప్లాన్ చేశారు.


రామ్ చరణ్ సినిమాలు పోస్ట్ పోన్ అవటం అనేది పెద్ద విషయం కాదు. కానీ తమ ఫ్యామిలీలో ఉన్న హీరోస్ తో క్లాస్ రాకుండా కొన్నిసార్లు డేట్స్ మారుస్తూ ఉంటారు. ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం ధ్రువ సినిమాని అప్పట్లో ప్రీ పోన్ చేశారు. అలానే అజ్ఞాతవాసి సినిమా కోసం రంగస్థలం సినిమాని పోస్ట్ పోన్ చేశారు. చరణ్ అలా చేయటం వలన ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కోసం విశ్వంభర సినిమాను పోస్ట్ పోన్ చేసారు. వాస్తవానికి విశ్వంభర సినిమాకి సంబంధించిన పని పూర్తి అయిపోయింది. కేవలం దిల్ రాజు మాటతో అలానే చరణ్ సినిమా కాబట్టి విశ్వంభర టీం పోస్ట్ పోన్ కు సిద్ధమైంది.

Related News

Ananya Nagalla: ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనన్య.. వీడియో వైరల్..!

Chiranjeevi: ఈ షూ చూడడానికే సింపుల్.. ఖరీదు తెలిస్తే గుండె గుబేల్..!

Rajamouli : రాజమౌళి న్యూ లుక్ అదుర్స్.. అక్కడ పెంచావు.. ఇక్కడ తగ్గించావు..

Bhumika: భర్తతో భూమిక విడాకులు.. ఆ హీరో వల్లేనా?

Nbk109: బాలయ్య సినిమా కోసం వెరైటీ టైటిల్స్

Vishwambhara: సోప్ యాడ్ అంటూ.. అప్రిసేషన్ కన్నా ట్రోలింగ్ ఎక్కువైపోయింది

Big Stories

×