EPAPER

Viswambhara Teaser : సీన్స్ అన్నీ కాపీనే… ఈ కాపీ పేస్ట్ డైరెక్టర్ ను మెగాస్టార్ ఎలా నమ్మాడో..

Viswambhara Teaser : సీన్స్ అన్నీ కాపీనే… ఈ కాపీ పేస్ట్ డైరెక్టర్ ను మెగాస్టార్ ఎలా నమ్మాడో..

Viswambhara Teaser : టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ప్లాఫ్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ మూవీనే ‘ విశ్వంభరా ‘.. దర్శకుడు వశిష్ఠ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూస్తామా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇక దసరా కానుకగా ఈ మూవీ నుంచి ఓ టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. నిన్న రిలీజ్ అయిన టీజర్ ఒక వర్గం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరో వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలు అందుకుంటుంది. ఈ సినిమాను ఇంగ్లిష్ సినిమాలను చూసి కాపీ కొట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం..


విశ్వంభర నుంచి గతంలో విడుదలైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ కు మాత్రం ట్రోల్స్ వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం కాపీ కొట్టారు అనే టాక్ ను అందుకుంది. గ్రాఫిక్స్ పై మాత్రం దారుణమైన ట్రోలింగ్స్ సోషల్ మీడియా లో ఎదురు అవుతున్నాయి. ఆరంభం అదిరిపోయినప్పటికీ, మధ్యలో వచ్చే విఎఫ్ఎక్స్ షాట్స్ చాలా ఆర్టిఫీషియల్ గా అనిపించింది. మూవీ కాన్సెప్ట్ చూస్తే అవతార్ తరహా లో ఒక కొత్త ప్రపంచం లో ఈ సినిమా కథ జరగబోతుందని టీజర్ ను చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ సీన్స్ హాలీవుడ్ మూవీల నుంచి కాపీ కొట్టారనే ట్రోల్స్ వినిపిస్తున్నాయి.

చీకటి అలుముకున్న విశ్వం, డ్రాగన్స్ లాంటి సీన్స్ ఇంగ్లిష్ మూవీల నుంచి కాపీ కొట్టారని సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ అందుకుంటుంది.. అవేంజర్స్, అవతార్ సినిమాలోని హైలెట్ సీన్లను కాపీ కొట్టారనే వార్తలు వినిపించడంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఆవిరి అయ్యాయి. అసలు ఇలాంటి వశిష్ఠను చిరంజీవి ఎలా నమ్మాడు? టీజర్ కే ఇంతలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇక సినిమాకు ఏ రేంజ్ లో ఉంటాయో.. ఈ మూవీ కూడా మరో ఆచార్య అవుతుందా అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. టీజర్ చూడగానే మంచి స్టోరీ లైన్ అని ప్రతీ ఒక్కరికి అనిపించింది. మంచి స్టోరీ లైన్ ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా క్వాలిటీ ని కూడా మైంటైన్ చేయాలి.. అప్పుడే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమాకి అయినా వండర్స్ చూడగలం. ఈ విషయం లో ‘హనుమాన్’ మూవీ మేకింగ్ ని ప్రతీ దర్శకుడు ఒక కేసు స్టడీ లాగా తీసుకోవాలి. 20 కోట్ల రూపాయిల బడ్జెట్ తో 400 కోట్ల రూపాయిల క్వాలిటీ ని చూపించాడు.. ఇలాంటి సీన్లు తియ్యాలంటే ఆ డైరెక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ మూవీ టాక్ ఎలా ఉంటుందో, వశిష్ఠ విడుదల సమయానికి ఏదైన మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి..


Related News

Ananya Nagalla: ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన అనన్య.. వీడియో వైరల్..!

Chiranjeevi: ఈ షూ చూడడానికే సింపుల్.. ఖరీదు తెలిస్తే గుండె గుబేల్..!

Rajamouli : రాజమౌళి న్యూ లుక్ అదుర్స్.. అక్కడ పెంచావు.. ఇక్కడ తగ్గించావు..

Bhumika: భర్తతో భూమిక విడాకులు.. ఆ హీరో వల్లేనా?

Ram Charan: రామ్ చరణ్ కి ఇది మొదటి సారి కాదు, ఇలా చాలాసార్లు త్యాగం చేసాడు

Nbk109: బాలయ్య సినిమా కోసం వెరైటీ టైటిల్స్

Vishwambhara: సోప్ యాడ్ అంటూ.. అప్రిసేషన్ కన్నా ట్రోలింగ్ ఎక్కువైపోయింది

Big Stories

×