EPAPER

Skin Care: గ్లోయింగ్ స్కిన్ కోసం ఇవి తప్పక ట్రై చేయండి

Skin Care: గ్లోయింగ్ స్కిన్ కోసం ఇవి తప్పక ట్రై చేయండి

Skin Care: వర్షాకాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో కొంచెం అజాగ్రత్త ఉన్నా కూడా చర్మ సంబంధిత సమస్యలను పెరుగుతాయి. బంగాళాదుంప, టమోటా రసం చర్మానికి ఉపయోగించడం వల్ల చర్మం అందంగా మారుతుంది. అంతే కాకుండా చర్మం యొక్క రంగును పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


బంగాళదుంప రసం, టమోటా రసం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే మూలకాలను కలిగి ఉంటాయి. బంగాళాదుంప,టమాటో రసాన్ని చర్మంపై అప్లై చేయడం వల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. ఈ జ్యూస్‌ని ఫేస్ ప్యాక్‌గా అప్లై చేయడం వల్ల ముఖంలోని మృతకణాలు కూడా తొలగిపోయి, ముఖంపై పాత మెరుపు తిరిగి వస్తుంది.

బంగాళాదుంప, టమోటా రసం యొక్క ప్రయోజనాలు..


బాక్టీరియా ఫ్రీ : బంగాళాదుంప, టమాటో రసాన్ని ముఖానికి క్రమం తప్పకుండా వాడటం వల్ల చర్మంలో ఉండే బ్యాక్టీరియాను తొలగించడంలో ఇవి సహాయపడతాయి. ఇవి చర్మ అలెర్జీలు, ఇతర సమస్యలను నివారిస్తాయి.

మొటిమలు: ముఖం మీద మొటిమలు సాధారణంగా వచ్చే సమస్య. బంగాళదుంప, టమాటో రసాన్ని ముఖానికి రాసుకుంటే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. బంగాళాదుంప,టమోటా రసం యొక్క కాంబో చర్మంలో ఉన్న అదనపు నూనెను తొలగిస్తుంది. మొటిమల వాపును తగ్గిస్తుంది. అంతే కాకుండా త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది.

స్కిన్ స్పాట్స్: మీ చర్మంపై టానింగ్, పిగ్మెంటేషన్ లేదా డార్క్ స్పాట్స్ ఉంటే, అప్పుడు బంగాళాదుంప, టమోటా రసాన్ని ఉపయోగించండి. వీటిలో ఉండే గుణాలు ఈ సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.

చర్మం మృదువుగా మారుతుంది: టమాటో, బంగాళదుంప జ్యూస్ ఫేస్ ప్యాక్ ముఖానికి మెరుపును తిరిగి తెస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ముఖంలోని మృతకణాలను తొలగించడానికి పనిచేస్తుంది. ఇది పొడి చర్మం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా చర్మంపై మెరుపును పెంచుతుంది.

బంగాళదుంప, టమోటా రసం ఎలా ఉపయోగించాలి ?

కావలసినవి..
1 బంగాళదుంప రసం- 1 టేబుల్ స్పూన్
1 టమాటో రసం- 1 టేబుల్ స్పూన్

Also Read: మీ ఫేస్ అందంగా కనిపించాలా ? ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

తయారీ విధానం:
ఒక గిన్నెలో బంగాళదుంపలు, టమాటోలను రసాలను వేసి బాగా కలపాలి. ముందుగా సబ్బు ,నీటితో ముఖాన్ని కడిగి ఆరబెట్టండి. ఆ తర్వాత దూదితో రసాన్ని ముఖం , మెడపై ఈ రసాన్ని రాయండి. 15-20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి 2-3 సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది

ఇతర చిట్కాలు..

మీరు ఈ మిశ్రమానికి 1 టీస్పూన్ తేనె లేదా పెరుగును కూడా కలపవచ్చు.

మీకు సున్నితమైన చర్మం ఉంటే, ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయండి.

కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఈ ప్యాక్ అప్లై చేయకుండా ఉండటం మంచిది.

ఈ రసం 2-3 రోజులు రిఫ్రిజిరేటర్లో ఉంచి కూడా వాడవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Walking: ప్రతి రోజు 30 నిమిషాలు నడవడం వల్ల ఈ రోగాలన్నీ దూరం

Copper Utensils: రాగి పాత్రలు మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయండి

Gastric Problems: గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ? వీటితో క్షణాల్లోనే ఉపశమనం

Natural Scrub: నేచురల్ స్క్రబ్స్‌తో గ్లోయింగ్ స్కిన్

Lungs Health: ఊపిరితిత్తులను బలోపేతం చేసే 5 సూపర్ ఫుడ్స్

Tiles Cleaning: వీటిని వాడితే ఇంట్లోని టైల్స్ తెల్లగా మెరిసిపోతాయ్

Big Stories

×