EPAPER
Kirrak Couples Episode 1

Sins of Parents: తల్లిదండ్రులు చేసిన పాపం… పిల్లల్ని వెంటాడుతుందా…

Sins of Parents: తల్లిదండ్రులు చేసిన పాపం… పిల్లల్ని వెంటాడుతుందా…

Sins of Parents:తల్లిదండ్రులు చేసిన పాపాలే కాదు తాత, ముత్తాతలు చేసిన పాపాలు మనల్ని వెంటాడతాయి. మూడు తరాలపాటు పాపం సంక్రమిస్తూ వస్త్దుంది. అందుకే మనం బాగుంటే సరిపోదు వారు బాగుండాలి. వారు చేసిన తప్పు వారి సంతానం అనుభవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే మీ కోసం కాకున్నా మీ సంతానం బాగుండాలంటే మీరు తప్పు పనులు చేయకండని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను..నా ఇష్టం అనుకునే వాళ్లు వారి సంతానాన్ని చెడగొట్టే హక్కు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు బాగుండాలంటే ముందు మనం చక్కగా ఉండాలి. తాత ముత్తాత్తలు సంపాదించిన ఆస్తులు తీసుకునే వారికి వారు చేసిన పాపాలు కూడా వారసత్వంగానే వస్తాయి. ఆ పాపాల ఫలితాలు తీసుకోవాల్సిందే. ఆస్తుల కోసమే వారసులు కాదు ముత్తాతలు చేసిన పాపాలకు కూడా వారసులవుతారు.


తాత ముత్తాతలు ఎలాంటి పనులు చేసి డబ్బులు సంపాదించిన వాటిని తీసుకుంటే ఫలితాలు కూడా అలానే ఉంటాయి. ఆ డబ్బు తాను సంపాదించిక పోయినా పాపాలు తనకెలా వర్తిస్తాయని అని ప్రశ్నించే వాళ్లు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి. తాత వారసుడ్ని అని చెప్పుకునే మనువడు ఆ తాత చేసిన పాపాలకు వారసుడే. వారు కూడబెట్టిన ఆస్తిలో అది ,ఇది కూడా ఉంది. ఆస్తి రెండు రకాలు. కనిపించేది ఆస్తి. కనిపించదని పుణ్య ఫలం. ఆస్తులు తీసుకోకపోయినా అవి వచ్చేస్తాయి.

కొంతమంది తాతల ఆస్తితో పనిలేదని, తండ్రి సంపాదించిన ఆస్తితో అవసరం లేదని చెప్పే వాళ్లు ఉంటారు. కాబట్టి వారి పాపాలతో తమకు సంబంధం లేదంటే కుదరదు. పాపాలు అలా ఊరికే పోవు. తాత ఆస్తి అంటే ధనం, బంగారం, భూములే కాదు .నువ్వు కూడా అన్న సంగతి మరిచిపోకూడదు. ఈ శరీరం వారి దగ్గర నుంచి వచ్చిందే. మనకు వచ్చిన శరీరం, ఇంద్రియాలు, బుద్ధి, మనసు, పోలికలు, అలవాట్లు అంతా తండ్రి ఇచ్చిందే. అలాగే పాప పుణ్యాలు కూడా వారివే. అన్ని పాపాలు, పుణ్యాలు వద్దనుకుంటే నిత్యం భగవన్నామ స్మరణ చేయాలి. ప్రతీ రోజు స్వామిని కృష్ణార్పణం అంటే మీకు వచ్చేది పోయేది ఉండదు. మిమ్మల్ని పాపాలు, పుణ్యాలు వెంటాడావు. అంత త్యాగం చేయగలిగితే మంచిదే. అందుకే మంచి వంశంలో పుట్టాలి. వంశంలో ఒకరు దానగుణం ఉన్న వారు పుడితే ఆ తర్వాత వారికి ఆ ప్రభావం ఉంటుంది.


Tags

Related News

Shasha Yoga Horoscope: 3 రాశులపై ప్రత్యేక రాజయోగం.. ఇక వీరి జీవితాలు మారినట్లే

Jitiya Vrat 2024 : పుత్ర సంతానం కోసం ఈ వ్రతం చేయండి

Budh Gochar 2024: సెప్టెంబర్ 23న కన్యారాశిలోకి బుధుడు.. ఈ 5 రాశులకు అడుగడుగునా అదృష్టమే

Bhadra rajyog 2024: భద్ర రాజయోగం.. వీరికి ధనలాభం

Karwa Chauth 2024 Date: కార్వా చౌత్ ఏ రోజున రాబోతుంది ? తేదీ, శుభ సమయం వివరాలు ఇవే..

Shukra Gochar 2024: తులా రాశితో సహా 5 రాశుల వారికి ‘శుక్రుడు’ అపారమైన సంపద ఇవ్వబోతున్నాడు

Shani Margi 2024 Effects: దీపావళి తరువాత కుంభ రాశితో సహా 5 రాశుల వారి జీవితంలో డబ్బే డబ్బు..

Big Stories

×