EPAPER

Dussehra 2024: దసరా పండగ.. కొత్త పోస్టర్స్ పై ఓ లుక్కేద్దామా..?

Dussehra 2024: పండగ వచ్చిందంటే.. టాలీవుడ్ మొత్తం కళకళలాడిపోతుంది. కొత్త కొత్త పోస్టర్స్, అప్డేట్స్ తో సోషల్ మీడియా షేక్ చేస్తూ ఉంటుంది. మరి ఈసారి దసరాకు ఏ ఏ సినిమాల నుంచి పోస్టర్స్ రిలీజ్ అయ్యాయో చూద్దామా..

మ్యాడ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న నార్నే నితిన్, సంగీత శోభన్.. ఈసారి మరింత వినోదాన్ని పంచడానికి మ్యాడ్ స్క్వేర్ తో వచ్చేస్తున్నారు.

డీజే టిల్లు గా ఫార్మ్ లోకి వచ్చిన సిద్దు జొన్నలగడ్డ వరుస సినిమాలతో బిజీగా మారాడు. సిద్దు తన ఫంధా మార్చి చేస్తున్న చిత్రం కోహినూర్. కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాతో తనకు మంచి హిట్ అను అందించిన రవికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కంబోకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సింహ,లెజెండ్, అఖండ తరువాత.. ఈ కాంబో నాలుగోవ సారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది.

విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి మెకానిక్ రాఖీ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్ బాబు మేనల్లుడుగా హీరో సినిమాతో ఇండస్త్రీకి పరిచయమైన అశోక్ గల్లా నటిస్తున్న రెండో చిత్రం దేవకీ నందన వాసుదేవ. వచ్చే నెల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అచ్చ తెలుగందం అనన్య నాగళ్ల నటించిన పోట్టెల్ సినిమా ఈ నెల 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. ఎప్పటి నుంచొ ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాలలోకి వెళ్ళాక.. ఈ సినిమా షూటింగ్ ఆగింది. త్వరలోనే మళ్ళీ ఆయన సెట్ లో అడుగుపెట్టనున్నారు.

నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాబిన్ హుడ్. నితిన్ కు భీష్మ తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల ఈసారి కూడా హిట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్టార్ బాయ్ సిద్దు నుంచి వస్తున్న మరో చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన తేజ సజ్జా నుంచి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ మిరాయ్. మంచు మనోజ్ విలన్ గా నటిసున్న ఈ సినిమా సమ్మర్ కనుక ఏప్రిల్ 2025 లో రిలీజ్ కు రెడీ అవుతుంది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మరో తెలుగు చిత్రం లక్కీ భాస్కర్. సార్ సినిమాతో హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.. ఈ సినిమా ఈ నెల 31 న రిలీజ్ కు రెడీ అవుతోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం మట్కా. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. మట్కా కింగ్ గా ఎదిగిన ఒక వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. వచ్చే నెల 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

డబుల్ ఇస్మార్ట్ పరాజయం తరువాత రామ్ పోతినేని నటిస్తున్న చిత్రం రాపో 22. మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

భగవంత్ కేసరి హిట్ తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం NBK109. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. ఇప్పటివరకు డిసెంబర్ లో వస్తుంది అనుకున్న ఈ సినిమా సంక్రాంతి రేసులో నిలబడుతుందని మేకర్స్ ఈరోజే  క్లారిటీ ఇచ్చారు. జనవరి 10 న ఈ సినిమా ప్రేకహకుల ముందుకు రానుంది.

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి . . హీరోగా దూసుకుపోతున్నాడు ప్రియదర్శి. తాజాగా ఆయన నటించిన మరో చిత్రం సారంగపాణి జాతకం.. డిసెంబర్ 20 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Related News

Samyukhta Menon: వైట్ శారీలో ఏంజెల్‌లా సంయుక్త.. అబ్బబ్బా ఏమా అందం!

Raashii Khanna: చూపుతిప్పడం కష్టమే.. లెహెంగాలో అందాల ‘ రాశి ‘

Sarah Jane Dias: వాటిని చూపిస్తూ పవన్ హీరోయిన్ రచ్చ.. ఛీఛీ.. మరీ ఇంత దారుణమా.. ?

Nabha Natesh: దివి నుంచి భువికి వచ్చిన దేవకన్యలా.. నభా నటేష్, ఫొటోస్ అదుర్స్

Madonna Sebastian: బ్లాక్‌ డ్రెస్‌లో మడోన్నా సెబాస్టియన్, కాకపోతే..

Siree Lella: నారా రోహిత్ అంటే నాకు చాలా ఇష్టం.. అప్పుడే పెళ్లి వద్దు అని చెప్పాను..

Big Stories

×