EPAPER

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం

Coast Guard Helicopter Crash: సెప్టెంబర్ 2న పోరుబందర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన పైలెట్ ఆర్‌కె రానా మృతదేహాన్ని తాజాగా అధికారులు గుర్తించారు. అక్టోబర్ 10న అరేబియా సముద్రంలో ఆయన డెడ్ బాడీని కనిపించినట్లు వెల్లడించారు. కోస్ట్ గార్డ్  హెలికాప్టర్ సాయంతో అతడి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఈ ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో నలుగురు కోస్ట్ గార్డు సిబ్బంది ఉన్నారు. సెప్టెంబర్ 3న కమాండెంట్ విపిన్ బాబు, ప్రధాన్ నావిక్ కరణ్ సింగ్ మృతదేహాలను వెలికితీశారు. గౌతమ్ కుమార్ అనే కోస్ట్ గార్డ్ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పైలెట్ రానా మృతదేహం మాత్రం లభించలేదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రానా కోస్ట్ గార్డులో పైలెట్ గా పని చేస్తున్నారు.


సెప్టెంబర్ 2న ఏం జరిగిందంటే.

అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వ్యాపార నౌకకు సంబంధించిన నావిక్ కు అనారోగ్యానికి గురయ్యారు. ఈ విషయాన్ని భారత కోస్ట్ గార్డు అధికారులకు చేరవేశారు. వెంటనే నౌకలోని నావిక్ ను రక్షించడంతో పాటు ఆయన స్థానంలో కోస్ట్ గార్డు నావికులు వెళ్లి నౌకను తీరానికి తీసుకురావాలని భావించారు. అనుకున్నదే ఆలస్యంగా మొత్తం నలుగురు కోస్ట్ గార్డ్ సిబ్బంది హెలికాప్టర్ లో నౌక దగ్గరికి బయల్దేరారు. వారిలో ఇద్దరు పైలెట్లు, ఇద్దరు డైవర్లు ఉన్నారు. పోరుబందర్ కు సుమారు 50 కిలో మీటర్ల దూరం ప్రయాణించగానే హెలికాప్టర్ లో సాంకేతి లోపం తలెత్తింది. కాసేపు హెలికాప్టర్ ను గాల్లోనే చక్కర్లు కొట్టించారు పైలెట్లు. అయినప్పటికీ పరిస్థితి కంట్రోల్ కాలేదు. ఏం చేయాలో తెలియక, అరేబియా సముద్రంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. హెలికాప్ట్ లోని నలుగురు కోస్ట్ గార్డ్ సిబ్బంది సముద్రంలో మునిగిపోయారు.


భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన కోస్ట్‌ గార్డ్ సిబ్బంది

కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండిండ్ విషయం తెలియగానే సిబ్బందిని కాపాడేందుకు కోస్ట్ గార్డ్ అధికారులు రంగంలోకి దిగారు. గల్లంతైన ఇద్దరు హెలికాప్టర్ పైలెట్లతోపాటు ఇద్దరు డైవర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నాలుగు నౌకలు, రెండు విమానాలతో ఈ ఆపరేషన్ చేపట్టారు. డైవర్లలో ఒకరిని ప్రాణాలతో కాపాడారు. ఓ పైలెట్, మరో డైవర్ మృతదేహాలను గుర్తించారు. ఆర్‌కె రానా డెడ్ బాడీ మాత్రం ఎంత వెతికినా కనిపించలేదు. కొద్ది రోజుల పాటు ఆయన బాడీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగించినా లాభం లేకపోయింది. తాజాగా కోస్ట్ గార్డు అధికారులు మరోసారి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆర్‌కె రానా మృతదేహాన్ని గుర్తించారు. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఏకంగా 40 రోజులకు ఆయన డెడ్ బాడీని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు.

Read Also:గాడిద పాల పేరుతో రూ.10 కోట్ల మోసం, బాబోయ్.. ఇలా కూడా చెయ్యొచ్చా?

Related News

Haryana New Government : హరియాణాలో కొత్త సర్కార్… ముహూర్తం ఎప్పుడంటే ?

Mohan Bhagawath : భారత్​ను అస్తిరపర్చేందుకు బంగ్లాదేశ్​లో భారీ కుట్రలు : ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్

25 Cr in Lucky Draw: అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ

Kumaraswamy Illegal Mining: ‘అవినీతికేసు విచారణ ఆపేయాలని కుమారస్వామి నన్ను బెదిరిస్తున్నారు’.. ఫిర్యాదు చేసిన సిట్ చీఫ్

Train Accident: మరో రైలు ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. కాలిపోయిన బోగీలు

Jimmy Tata: అన్న అలా.. తమ్ముడు ఇలా.. అజ్ఞాతవాసి జిమ్మీ టాటా గురించి మీకు తెలుసా?

Big Stories

×