EPAPER

Mobile Addiction : మొబైల్​కు బానిసలయ్యారా? – ఇలా చేస్తే ఇట్టే బయటపడొచ్చు!

Mobile Addiction : మొబైల్​కు బానిసలయ్యారా? – ఇలా చేస్తే ఇట్టే బయటపడొచ్చు!

Mobile Addiction : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. ఈ సాంకేతిక యుగంలో స్మార్ట్‌ ఫోన్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ ప్రతీ ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌లకు బానిసలవుతున్నారు. సమయం, సందర్భంతో సంబంధం లేకుండా ఉదయాన్నే లేచి నుంచి అర్ధ రాత్రి వరకు కూడా మొబైల్ చేతిలో పట్టుకుని కూర్చుంటున్నారు. అయితే ఈ ఫోన్ వాడకం తగ్గించకపోతే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎన్ని సార్లు ఫోన్ ను దూరం పెడదామనుకున్నా పెట్టలేకపోతే సమస్య తీవ్రంగా ఉందనే పరిగణించాలి. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని ఎలా తగ్గించుకోవాలో ఓ సారి చూద్దాం.


మొబైల్ ఎక్కువగా వాడటం కూడా ఓ వ్యాధిలాంటిదే అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అనారోగ్య సమస్యలతో పాటు శారీరక, మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకే ఫోన్ ఎక్కువగా ఉపయోగిస్తే ఓ సారి కౌన్సెలింగ్​కు వెళ్లాలని అని సూచిస్తున్నారు. కాబట్టి ఆ అవసరం లేకుండా ఫోన్​ను దూరం పెట్టడానికి ఇలా ప్రయత్నించండి వీలైతే.

ALSO READ :  కిర్రాక్ ఫీచర్స్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!


డిజిటల్ వెల్ ​బీయింగ్ యాప్ ద్వారా వారానికి ఒకసారి మీ మొబైల్ వాడకం ఎంత సేపు ఉందో రిపోర్ట్ తెలుసుకోంది. తద్వారా మీరు వృథా చేస్తున్న సమయాన్ని గుర్తించి, ఆ తర్వాత మొబైల్ వాడకంపై ఓ బలమైన నిర్ణయానికి రండి.

రాత్రి పడుకునే సమయంలో కచ్చితంగా మొబైల్ పక్కన పెట్టుకోవద్దు. నిద్ర లేవడానికి మొబైల్ ఫోన్​ అలారానికి బదులుగా సాధారణ అలారం క్లాక్​ను వాడండి.

మీ ఫోన్​లో ఉన్న యాప్స్​లో ఏవేవి మీ సమయాన్ని వృథా చేస్తున్నాయో తెలుసుకోండి. అనంతరం దాన్ని అన్​ ఇన్​స్టాల్​ లేదా డిలీట్ చేయండి.

నోటిఫికేషన్లు కూడా ఏవి అవసరమో ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత అనవసరమైన వాటిని ఆఫ్ చేసేయండి.

ఫోన్ చూడాలనే ఆలోచన రాగానే ఎప్పటి కప్పుడు ఈ ఒక్క ప్రశ్న వేసుకోండి. ఇప్పుడు ఫోన్ అవసరమా? ఎంత వరకు అవసరం? ఇప్పుడు దాన్ని చూడకపోతే ఏమైనా అవతదా? అలా మీలో మీరు అనుకోండి.

ఏదైనా సందర్భంలో దేని కోసమైనా ఐదు నిమిషాలు ఎదురు చూడాల్సి వచ్చినప్పుడు, వెంటనే ఫోన్ తీయొద్దు. ఆ సమయంలో సరదాగా చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. పుస్తకాలు చదవండి.

అవసరం ఉన్నప్పుడు మాత్రమే డేటాను ఆన్ చేయాలి. మిగతా సమయంలో ఆఫ్​ చేయండి. అప్పుడే ఫోన్​పై కాస్త దృష్టి తగ్గుతుంది. పైగా ఆ సమయంలో కేవలం కాల్స్ మాత్రమే వస్తాయి. ఇతర నోటిఫికేషన్లు రావు.

వారానికి ఒకసారైనా లేదా రోజులో కాసేపు అయినా ఫోన్​ను ఆఫ్​లో ఉంచడానికి ట్రై చేయండి. అలా చేసినా కూడా కాసేపు వినియోగం తగ్గించినట్టవుతుంది.

ఫోన్​ నొక్కాలి అనిపించినప్పుడల్లా ఇతర హాబీలపై ఫోకస్ పెట్టండి. ఇష్టమైన ఆటలు ఆడటం, సంగీతం వినడం వంటివి చేయండి. ఎంచక్కా కబుర్లతో కాలక్షేపం చేయండి.

ఫైనల్​గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కూడా డెస్క్​ టాప్​ను ఉపయోగించండి. ఫోన్ దూరం పెట్టండి. లేదంటే మీ టాస్క్ కూడా త్వరగా పూర్తి కాదు.

Related News

Phone Battery : స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పాడైందని ఇలా కనిపెట్టేయండి..

Oppo Find X8 : కిర్రాక్ ఫీచర్స్ తో ఒప్పో స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!

Jio ISD : జియో బంపర్ ఆఫర్.. 29 దేశాలకు ISD కాలింగ్.. కేవలం రూ.39కే

ICICI credit card : ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజర్స్ కు షాక్.. ఇకపై కోత తప్పదు!

Social Media : తొలి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్ ఇదే – ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Internet : రికార్డు వేగంతో ఇంటర్నెట్ సేవలు… ఏ దేశంలో ఎంతమంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారంటే?

Big Stories

×